Wednesday, January 25, 2012

ఈ మాటూ రానట్టేనా ? !





                              ఎప్పటిలానే గణతంత్ర దినోత్సవమ్ వచ్చేసింది. మాజీ గవర్నర్లకు,
                              తారలకు, తారడులకు అవార్డులు పంచేశారు. కాని తెలుగువాడికి
                              మళ్ళీ తీరని అన్యాయం జరిగింది. మన బాపురమణలకు అవార్డు
                              రాలేదు. పెద్ద కబుర్లు చెప్పే మన నాయకులు కేంద్రంలో ఎంత
                              పలుకుబడి వుందో అర్ధమవుతుంది.తమ సినిమాలు ఫట్ ఐనా
                              తమమీద, తమ సినిమాలపైనా తామే కార్టూన్లు వేసుకొనే
                              విశాలహృదయులు శ్రీబాపురమణ.



                              అవును బాపురమణులు బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టే
                              సినిమాలు తీయలేదు. వాళ్ళు తీసిన " సాక్షి " సినిమా ఎవరి
                              ప్రయేమం లేకుండా, పైరవీలు లేకుండా తాష్కేంట్
                              ఫిలిం ఫెస్టివల్ (సోవియెట్ రష్యా) లో ప్రదర్శించారు. చైనా
                              మంగోలియాలలో  ప్రదర్శించారు. ఇక" సీతాకళ్యాణం"లండన్,
                              షికాగో,బెర్లిన్, పారిస్ ఫెస్టివల్స్ కు వెళ్ళింది.సినిమా నిర్మాణ
                              పాఠ్యాంశమయింది!


తెలుగుదేశం ప్రభుత్వహయాంలో పిల్లలకు తెలుగు వీడియో
                              పాఠాలు తయారుచేసి యన్టీఆర్ చేత ప్రశంసలను పొందారు.
                              ముత్యాలముగ్గు, బుద్ధిమంతుడు లాంటి జనామోదమైన
                              చిత్రాలను తెలుగు తెరకు అందించారు. శ్రీరామరాజ్యం
                              చిత్రాన్ని కన్నుల పండుగగా తయారుచేశారు. 
                              వారి అభిమానులుగా అవార్డు ఈ ప్రతిభావంతులకు రాలేదే
                              అని మనస్సు చివుక్కుమని వ్రాశానే కాని  ఈ అవార్డులకు
                              ఎప్పుడో విలువ పోయింది. .ఒక సంతోషమైన విషయం:
                              ప్రఖ్యాత దివంగత కార్టూనిస్ట్ మెరియోమిరండాకు అవార్డు
                              రావటం ! ఆయనా మన దక్షిణాదిరాష్ట్రాలకు చెంది వుంటే
                              వచ్చేది కాదేమో !!

9 comments:

  1. బాపు గారికి ఈసారి కూడా అవార్డ్ రాకపోవడం నిజంగా నిరాశను కలిగించింది సురేఖ గారు. మీరు వ్యక్తపరచిన ఆవేదనే మా హృదయాలలో కూడ పేర్కొనివుంది.

    మరి వచ్చే రిపబ్లిక్ డేకైనా అవార్డ్ ప్రకటిస్తారని ఆశిద్దాం.

    ReplyDelete
  2. ఈ అవార్డులకు ఎప్పుడో విలువ పోయింది.vaariddaruu manandari manasullo avaardulu yeppudo gelichesukunnaaru.

    ReplyDelete
  3. వెన్నెలగారు , వెన్నెలలా చల్లని మాటను కురిపించారు. ధన్యవాదాలు.!

    ReplyDelete
  4. విలువలు గుర్తించేరోజులు కాదు కదండీ!

    ReplyDelete
  5. పద్మా అవార్డులా? అవి యేమిటి?

    ReplyDelete
  6. అయ్యా! శ్యామలీయంగారు, మీరు 31-12-2011 తేదీన కామెంటు వ్రాస్తూ ఇక రేఖాచిత్రం బ్లాగు చూడను స్వస్తి అని శెలవిచ్చారు. ఇప్పూడేమో
    ఎందుకు చూశారో తెలియదు, పద్మా అవార్డ్లా ? అవి యేమిటి ? అంటూ వ్రాశారు ? మీ ఉద్దేశ్యమేమిటో , మీ ఆలొచనలేమిటో ఆ భగవంతునికే తెలియాలి !!.

    ReplyDelete
  7. అప్పారావుగారూ, నేను దీర్ఘకోపనుడను కాను. అంతే సంగతి.
    ఇకపోతే పద్మా అవార్డులవిషయంలో నిరంతరం తెలుగు వాళ్ళకు జరిగుతున్న అన్యాయానికి మంటపుట్టి అవి తెలుగువాళ్ళకు గగనకుసుమసదృశాలన్న ఉద్దేశంతో అలా అన్నాను. ఇంత చిన్న విషయానికి మీరు భగవంతుడు రంగంలో దిగాలన్నారే.

    ReplyDelete
  8. శ్యా మలీయంగారు, శుభోదయం! మీకు నాపై కోపం పోయినందుకు బాపురమణగార్లకు ఓ పదేళ్ల క్రితమే పద్మశ్రీ అవార్డులొచ్చేశాయన్నంత సంతోషం కలిగింది.

    ReplyDelete
  9. అప్పారావు గారూ పదేళ్ళ క్రితమే అంటే బాపురమణగార్లది పద్మభూషణ్ స్థాయి. ఇప్పుడు పద్మవిభూషణ్ స్థాయి. పద్మశ్రీ లాంటి అవార్డులు వాళ్ళు పిల్లల కోసం టెలిస్కూల్ లాంటి కార్యక్రమాలు రూపొందించినప్పుడే ఈయవలసింది. ఏదైనా ఈ విషయంలో బాపురమణల కన్నా ప్రతి సారీ పద్మఅవార్డులకే అన్యాయం జరుగుతోందని నా అభిప్రాయం.

    ReplyDelete