Monday, April 15, 2013

శ్రీని "వాయిస్"మూగపోయింది

            ప్రముఖగాయకుడు, రచయిత,స్వరకర్త ఇక లేరన్న
వార్త  అభిమానులకు పెనువిషాదం.పిబియస్ అని 
పిలిచే ఆయన పూర్తి పేరు ప్రతివాద భయంకర
శ్రీనివాస్. గోదావరి తీరాన వెలిసిన మరో ఆణిముత్యం
మన శ్రీనివాస్. భక్తి గీతం నుంచి, హాస్యగీతం వరకూ
ఎటువంటి పాటనైనా పాడగల మధుర గాయకుడు
శ్రీ పిబియస్.


ఆయన పుట్టింది కాకినాడ ఐనా అనేక భాషలలో
వేల పాటలు పాడి అన్ని ప్రాంతాల శ్రోతల 
హృదయాలలో ఎనలేని స్ఠానాన్ని సంపాదించు
కున్నారు. అక్కినేని, రామారావులకు ఘంటసాల
పాడే రోజుల్లో ఆఇద్దరు హీరోలకీ తన గాత్రాన్ని
అందిచారు. అలానే ఆ రోజుల్లో కాంతారావు,జగ్గయ్య,
హరనాధ్ లకు అనేక మధురమైన పాటలు పాడారు.
ఓహో గులాబి బాలా (మంచిమనిషి), మదనకామ
రాజు చిత్రంలో నీలి మేఘాలలో, మనసే మందిరం
చిత్రంలో తలచినదే జరిగినదా పాట,ఎవరికి ఎవరు
కాపలా (ఇంటికి దీపం ఇల్లాలే) కొన్ని మరువలేని
గీతాలు. మైభీ లడ్కీ హూ( నాదీ ఆడజన్మ హిందీ
వర్షన్)లో లతా మంగేష్కర్ తో కలసి పాడారు.ఆయన
పాడిన సంస్కృత భక్తిగీతాలు LP Record గా 1973లో
విడుదలయింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు
కళైమణి బిరుదునిచ్చి తనను తాను గౌరవించుకుంది. 
ఆయనను సత్కరించుకొనే అదృష్టం మన తెలుగు
వాళ్ళు నోచుకోలేదు.
(శ్రీ పి.బియస్. పెన్సిల్ స్కెచ్ శ్రీ యస్.శంకరనారాయణ
గారి సౌజన్యంతో)

2 comments:

  1. "...ఆయనను సత్కరించుకొనే అదృష్టం మన తెలుగు
    వాళ్ళు నోచుకోలేదు..."

    Is he a faction leader to establish statues in every nook and corner and name a District after him?? After all PBS is just a Singer, how Telugu Politicians can respect him?? Too much expectation.

    Mischievous and illiterate Politicians may not respect PBS. But, he lives in the hearts of music loving Telugu "People".

    ReplyDelete
  2. శ్రీ శివరామ ప్రసాద్ గారు, మీరు చెప్పినది నూరుపాళ్ళ నిజం. బాపుగారికి పద్మశీ బిరుదుకు తమిళనాడు
    ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసిందంటే మన నాయకులు సిగ్గుతో ( వుంటే) తలదించుకోవాలి.

    ReplyDelete