Sunday, December 06, 2009

రూపాయలు - రూపాంతరాలు




ఈ నాడు డబ్బున్న వాళ్లను జనాలు గౌరవిస్తారు.వాళ్ళకు ఎలాంటి
అవలక్షణాలున్నా అవేవీ అగుపించవు!కాని డబ్బు మనుషులకు అంత
విలువనిస్తున్నా ఆ డబ్బుకు మాత్రం ఈనాడు రోజు రోజుకు విలువ తగ్గి
పోతున్నది.ఒక నాడు పెద్దగా వుండే వంద రూపాయలనోటు ఈనాడు
చిన్నదవటంమే కాకుండా విలువే లేకుండా పోయింది. వంద దాకా ఎందుకు
మా చిన్నతనంలో పది రూపాయల నోటు పెద్దదిగా వుండేది. ఈనాటి వంద
కంటే ఎంతో విలువా వుండేది.ఆ రోజుల్లో ఒక రూపాయికి నాలుగు అణాలు.
ఆంధ్ర పత్రిక వీక్లీ ఖరీదు పావాలా.నెలకి అంటే నాల్గు వారాలకి ఒక రూపాయన్న
మాట! ఇప్పుడు వీక్లీ ఖరీదు పది రూపయలు.అలానే చందమామ ఆరు అణాలు.
ఏడాది చందా రూ.4.50పై ! ఆనాటి ,నే పుట్టకముందు నాటి ఒక రూపాయి
నోట్లు (1917,1935), 1949,50ల నాటి పది,ఐదు రూపాయల నోట్లు నా
దగ్గర వున్నవి మీకు చుపిస్తున్నాను. ఇప్పటి పది రూపాయల నోటు నంబరు
చూడండి! ప్రత్యేకంగా లేదూ!! పాత రూపాయల నోట్లు మా నాన్నగారు కలెక్ట్
చేసినవి.ఆయన స్టేట్ బాంక్ లో కాష్ ఆఫీసర్ గా పనిచేసినప్పుడు ప్రీంటింగ్ లో
పొరపాటుగా ప్రింటయినవి ప్రత్యేకంగా సేకరించేవారు.మీకు షోలే సిన్మా గుర్తుందా?
అందులో అమితాబ్ బొమ్మా బొరుసా వేసిన రూపాయికి రెండు వైపులా బొమ్మే
వుండటం ధర్మేంద్ర గుర్తిస్తాడు. ఇరువైపులా బొరుసు వున్న రూపాయి (మా నాన్న
గారు సేకరించింది) ఇంకా నా దగ్గర వుంది.అన్నట్టు మా నాన్న గారు 1959లో
బాంకు లో రిటైర్ అయినప్పుడు ఆయన సేలరీ నెలకు 500/-రూపాయలు!!

2 comments:

  1. ఆ ఒక్క రూపాయి నోట్లు ( పాతవి ) తప్ప అన్నీ నేను చూశానోచ్ :):)

    ReplyDelete
  2. ధన్యవాదాలు. కరెన్సీ నోట్స్ మీద పెన్ తో వ్రాయడం ఏ దేశం లోను చూడలేదంటే నమ్మండి. ఈ అలవాటు ప్లాస్టిక్ కరెన్సీ వస్తే తప్ప పోదేమో.

    ReplyDelete