Wednesday, December 23, 2009
గోదావరమ్మ పాపి(డి) కొండలు
అందాల పాపికొండలు చూడాలంటే రాజమండ్రి కి దగ్గర లోనున్న పట్టిసీమకు వెళ్ళి అక్కడనుంచి లాంచీలో ప్రయాణం చేయాలి.లాంచీలుకూడా రెండస్తులతో క్రింద మన్ఛి రెస్టారెంట్,టాయ్లెట్ సౌకర్యాలతో వుంటాయి.పట్టిసీమ చేరాక వేరే నావలో వెళ్ళి అక్కడ గల శివాలయం చూడవచ్చు.ఆ గుడిని మీరు "మేఘ సందేశం" సినిమాలో చూసివుంటారు.మహా శివుడు వీరభదృడిగా, మహా విష్ణువు భావనారాయణుని పేరిట క్షేత్రపాలకునిగా అవతరింఛారని చెబుతారు.ఆలయంలో శివలింగం నయనానందకరంగా దర్శనమిస్తుంది.తిరిగి లాంచి ఎక్కి ప్రయణిస్తుంటే దారిలో ఓ కొండ ఏనుగు ఆకారంలో అగుపిస్తుంది.దాని తరువాత మనకు నందీ శ్వరఆలయం అగుపిస్తుంది."జానకి రాముడు" ఈ గుడి ప్రాంగణంలోనే చిత్రీకరించారట. అలానే గండిపోసమ్మ ఆలయాన్ని చూదవచ్చు.మరికొంత దూరము ప్రయాణించాక దేవీపట్నం పోలీస్ స్టేషన్ వస్తుంది.ఈ పోలీస్ స్టేషన్ పైనే అల్లూరి సీతారామ రాజు దాడి చేసాడు.ఆనాటి పోలీస్ స్టేషన్ ఇప్పుడూ చూడవచ్చు! అటు తరువాత లాంచిని ట్రైబల్ విలేజ్ రిసార్ట్ దగ్గర ఆపి ప్రయాణీకులకు లంచ్ ఏర్పాటు చేస్తారు.ఈ రిసార్ట్ లో రాతృలు గడపాలనుకునే వారికి ఏసి/నాన్ ఏసీ గదులు వున్నాయి. ఇక్కడ నుంచి ప్రయాణంలో గోదావరి వెడల్పు రాను రాను తగ్గుతుంది.అటూ ఇటూ రెండు కొండల మధ్య నుంచి లాంచి ప్రయాణిస్తుంటే ఆ దృశ్యం కన్నుల పండుగా వుంటుంది. గోదావరికి ఇరువైపులా సన్నని పాపిడి తీసినట్లు రెండు కొండలు వున్నందున ఈ కొండలకు పాపిడి కొండలని పేరొచ్చింది.చివరికవి జనాల నోట్లో పాపి కొండలుగా మారి పోయాయి. పాపి కొండలు దాటాక పేరంటాఅలపల్లి శివాలయం వుంది.అక్కడి కొండలనుంచి పారే సెలయేర్లలో కాళ్ళు కడుగుకోంటే ఎంతో హాయిగా వుటుంది.శివుణ్ణి దర్శనం చేసుకున్నాక లాంచి తిరిగి రాజమండ్రి వైపు సాగిపోతుంది.పాపికొండల ప్రయాణం ఓ మధురానుభూతిగా మనకు మిగులుతుంది!
Subscribe to:
Post Comments (Atom)
yes it is a nice and pleasent tourist spot.
ReplyDeletei too went long back and made a post.
http://sahitheeyanam.blogspot.com/2009/05/blog-post_10.html
అవునండి. పాపికొండల అందాలు చాలా బాగుంటాయి. ప్రయాణం గురించి బాగా వివరించారు.
ReplyDeleteమీ ఆర్టికల్ చాలా బాగుంది." పాపిడి కొండలను " " వాడుకలొ పాపి కొండలు " అంటారని చక్కగా తెలియ జేసారు. ఆంధ్రా లోనె పుట్టినా అక్కడి అందాలు చూడ లేక పోవడం బాధగా ఉంది. మీ ఆర్టికల్ చదివాక కొంత ఆనందం కలిగింది.ధన్య వాదములు.
ReplyDeleteచాలా బాగా చెప్పారు. మా లాంటి వాళ్ళం ఎప్పుడైనా ఈ అందాలను వీక్షించాలంటే, ప్రస్తుతం ఉన్న అవకాశాలను, టూర్ కోసం ఎవరిని సంప్రదించాలో తెలుపగలరు.
ReplyDeleteమీరు రాజమండ్రి నుంచి విహారానికి వెళ్ళవచ్చు. టూరిస్ట్ శాఖను గాని, హోటెల్ ఆనంద్ రిజెన్సీ, జాంపెట్, రాజమండ్రి వారిని గాని సంప్రదించవచ్చు
ReplyDelete