డా.ఖాన్: రండి రండి, అప్పారావుగారు,ఎలా ఉన్నారు? మీ చెవి నొప్పికి నేనిచ్చిన మాత్రలు
మూడు రోజులు మూడు పూట్లా వేసుకున్నారనుకుంటాను. ఇప్పుడు నొప్పి ఎలా వుంది?
అప్పారావు: తగ్గడమా?! పైగా నొప్పి భరించలేనంత ఎక్కువైయిందండీ బాబూ!
డా.ఖాన్ : ఏదీ,చెవి చూడనివ్వండి! ఇదేమిటి? చెవిలో ఏమిటో తెల్లగా కుప్పలు కుప్పలుగా
ఉన్నాయి?!
అప్పారావు: ఏమిటా? భలే వారండి! అవి మీరిచ్చిన మాత్రలు!!
డా.ఖాన్ : ఏవిటీ, మీ అసాధ్యం కూలా! మాత్రలు చెవిలో వేసుకున్నారా? మీరెక్కడ దొరికారండీ?
అప్పారావు: చెవిలో వేసుకోక ఇంకెక్కడ వేసుకోవాలి.మొన్న నాకు నోటి పూత వస్తే మాత్రలు నోట్లో
వేసుకున్నాను.తగ్గింది.ఇప్పుడు చెవి నొప్పివచ్చినప్పుడు చెవిలో వేసుకోక నోట్లో వేసుకుంటామా?
ఐనా ఆ విషయం మీరు ముందుగా చెప్పాల్సింది.
డా.ఖాన్ : సరేలెండి. ఇన్జెక్షన్ చేస్తా. నొప్పి వెంటనే తగ్గుతుంది.
అప్పారావు: డాక్టర్ గారు.నే ఇంజక్షన్ చేయించుకోవడం ఇదే మొదటి సారి.నొప్పి లేకుండా చేస్తారు కదూ?
డా.ఖాన్ : భలే వారండి.నేను 35 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా,తెలుసా!!
అప్పారావు: అమ్మ బాబోయ్! ఇంజక్షన్ చేయడం అన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇంకా మీ కనుభవం
రాలేదన్న మాట. వద్దు లెండి. మాత్రలే ఇవ్వండి.ఈ సారి నోట్లోనే వేసుకుంటా.
ah ha haa good joke
ReplyDeleteమీరు రాజమండ్రి బ్లాగరేకదా, దామెర్ల రామారావుగారి గాలరీ గురించి ఫోటోలు, సమాచారంతో ఒక టపా రాయమని మనవి.
ReplyDeleteథాంక్స్
రమణ
రమణ గారు, దామెర్ల ఆర్ట్ గాలరీ గురించి వ్రాయటానికి
ReplyDeleteతప్పక ప్రయత్నిస్తాను................సురేఖ**