సర్ ఆర్ధర్ ధామస్ కాటన్ 207 వ జయంతి నేడే ! ఆయన భారతదేశంలో పుట్టకపోయినా ఈ దేశప్రజల
శౌభాగ్యం కోసం తపించాడు. ఈనాడు ఉభయ గోదావరీ జిల్లాలు సస్యశామలంగా ఉన్నాయంటే ఆ మహాను
భావుడి నిరంతర కృషే కారణం. గోదావరి జిల్లాల రైతులోకం కాటన్ మహాశయుణ్ణి మరో భగవంతునిగా ఈ
నాటికీ ఆరాధిస్తారు. మానవుడికి అమరత్వం అతను చేసిన కృషి వల్లే కలుగుతుంది. గోదావరిపై ధవళేస్వరం
లో ఆనకట్ట నిర్మించి కరవు కాటకాలను రూపుమాపాడు. క్రీ"శ" 1803 మే 15వ తేదీన ( ఈ రోజే ) ఇంగ్లాండు
లోని ’కాంబర్మిర్ అబీ’ అనే గ్రామంలో హెన్రీ, కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ సంతానంగా కాటన్ జన్మిం
చాడు. 15వ ఏట మిలటరీ శిక్షణాలయంలో ఇంజనీర్గా శిక్షణ పొందాడు. పద్దెనిమిదోయేట ఈస్టిండియా కంపెనీ
వారిచే చెరువుల శాఖకు సంభందించిన సూపర్టెండెంట్కు సహాయకుడిగా నియమించబడ్డాడు. కొంతకాలం తరు
వాత కాటన్ ను గోదావరి సీమలో నిర్మాణాత్మక కార్యక్రమాన్ని సూచించడానికి నియమించారు. అందుకోసం
రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరిని పరిశిలించి పంపిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. 1847 ఏప్రియల్లో
నాలుగు భాగాలుగా ఆరోగ్యాన్నికూడా లెక్కచేయకుండా పన్నెమ్డు అడుగుల ఎత్తు గల రాతి కట్టడంతో ఆనకట్ట
నిర్మించాడు. 1852 మార్చి 31 నాటికి నిర్మాణం పూర్తిచేశాడు. నిర్మాణానికి ఐన ఖర్చు 16,60,000/- రూపాయలు.
ఆనకట్ట మొత్తం పొడవు 11,945 అడుగులు. దాదాపు వంద సంవత్సరాలు సేవలందించిన ఆనకట్ట పునాదులు
కుంగడంతో పాత ఆనకట్టకు నలభై మీటర్ల దూరంలో కొత్త ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. 141 కోట్ల ఖర్చుతో నిర్మిం
చిన బారేజ్ 1982 అక్టోబర్ ఇరవతొమ్మిదిన ప్రారంభించబడ్డది. దానికి సర్ ఆర్ధర్ కాటన్ బారేజీ గా పేరు పెట్టారు.
కరవు గోదావరి జిల్లాలనుంచి మాయమైందంటే అది కాటన్ పుణ్యమే ! అందుకే కాటన్ కీర్తి గోదావరీ జలాల్లో
కలకాలం నిలచి వుంటుందనటంలో సందేహంలేదు. ఆ మహను భావుడి జయంతి రోజున తెలుగు ప్రజలందరి
తరుఫున నమోవాకాలు తెలియజేస్తున్నాను.
ఈ మధ్య కొంత మంది పుణ్యమా అని "అపర భగీరధుడు" అనగానే వేరే వాళ్ళు గుర్తొస్తున్నారు :). అవును,ఒక విదేశీయుడు అయ్యుండి మన గురించి ఇలా తాపత్రయపడటం విశేషమే. గుడ్ పోస్ట్
ReplyDeleteరిషి గారు, శుభోదయం. నిజం చెప్పారు.జలయజ్ణం పేరిట కొంతమంది
ReplyDeleteఅపరభగీరధుడు అన్న మాటకే చెడ్డ పేరు తెచ్చారు. నేను ఆ 'మాట'
ఉపయోగించకుండా వుండాల్సింది.surekha *
సర్ కాటన్ అపర భగీరథుడు కాదు! "అసలు భగీరథుడు"!
ReplyDelete