Friday, September 23, 2011

దేముళ్లనూ వదలం !

ఈ కలికాలంలో మానవుడు దేముడికి భయపటం లేదు. వాడు ప్రతి రోజూ
చేస్తున్న పాపాలకు భయపడుతున్నాడు. తన మోసాలు, అత్యంత నీచంగా
పీడించి మేస్తున్న లంచాల గడ్డి ఎక్కడ పోతుందోనని ప్రతి రోజు భయపడుతూ
బ్రతుకు వెళ్ళబోస్తున్నాడు. చివరకు తన పాపాల గోతిలోంచి బయటకు
లాగడానికి ఆ దేముడికీ లంచాలు సమర్పిస్తున్నాడు. మనం చేసే పాపాలకు
ఓ కొబ్బరికాయ కొట్టేసి, అప్పనంగా కొట్టేసిన డబ్బుతో వెలిగిపోవాలని
అనుకుంటున్నాడు..

పదవిరావాలని, అటుతరువాత డబ్బు గడ్డి బాగా దొరికే మరో పదవి రావాలని
అగుపించిన ప్రతి దేముడి గుడి చుట్టూ గానుగెద్దులా తిరుగుతూ చివరకు ఆ
దేముడికే శఠగోపం పెడుతున్నాడు. చివరకు దొరికిపోయి జనాలు, కోర్టులు
అక్షింతలు వేసినా, శ్రీకృష్ణజన్మస్థానానికి ( పెద్ద వాళ్ళను జైలుకెళ్ళాడు అని
అనకూడదు కదా!) వెళ్ళి చిప్పకూడు తింటున్నా గుళ్ళో వాడూ, బయట
(అ)కార్యకర్తలు యజ్ఞాలు,యాగాలు చేస్తుంటారు. ఇక బందులూ చేయిస్తూ
రాబందుల్లా జనాలను పీక్కు తింటారు. ఇక పవిత్రత ఎక్కడ వుంది. ఈ
మధ్య కొన్ని గుళ్ళల్లో పూజారులు గుళ్ళు మూసేసి ఆ గుడి బయట క్రికెట్
ఆడుతున్నారంటే ఇంతకంటే పాపం ఎక్కడవుంది చెప్పండి. రెండు రోజుల క్రితం
హిండూ పత్రికలో పడిన పై ఫొటోయే అందుకు నిదర్శనం.
భగవాన్ ! ఈ ప్రపంచాన్ని ఇలాటి నరాధములనుంచి ఇక నువ్వే కాపాడాలి.
వాళ్ళకి నువ్వంటే చచ్చేంత భయం. నువ్వెక్కడ బయటకు వచ్చి వీళ్ళ భరతం
పడతావేమోనని నీ గుడికీ తాళాలేసి ఆటలాడుతున్నారు.

4 comments:

  1. (ఈ 'రేఖ ' గారన్నా, ఆయన కార్టూన్లన్నా నాకిష్టం. ఈయన టపాలు కూడా బాగుంటాయి. వ్యాఖ్యానిద్దామంటే, యే 'మట్లపాలెం వారో' "ఠాట్! మా బ్లాగుల్లోకి జొరబడతావా?" అంటూ కళ్లెర్రజేస్తారేమో అని భయం! అయినా.....)

    బాగున్న టపాలని అభినందించకుండా వుండలేకపోవడం నా బలహీనత!

    అందుకే "ఈ సాహసం"!

    ప్రచురించినా, మానినా, మీ యిష్టం!

    (నా నట్టింటికొచ్చి నన్ను యేకుతానని మాత్రం అనకండి!)

    ReplyDelete
  2. సమాజం నైతికంగా దిగజారింది అనడానికి ఇలాంటి నికృష్ట పురోహితుల సజీవ సాక్ష్యాలే నిదర్శనం. గుడికి వెళ్ళాలంటే, ఇలాంటి దగుల్భాజీలకు దానం చేసి మొక్కాలన్నా మనస్కరించడంలేదు. :((
    --------------
    /నా నట్టింటికొచ్చి నన్ను యేకుతానని మాత్రం అనకండి!/
    కృష్ణశ్రీ గారు, అదొక్కటి తప్ప ఏమైనా అడగండి. :)) :P

    ReplyDelete
  3. గుడికి తాళాలేస్తే దేముడు చూడడు.. అనుకోవడం.. ఆయనకు ఒకటో రెండు కోటులు ఖర్చుపెట్టేస్తే చట్ట విరుద్ధంగా సంపాదించింది పవిత్రమైపోతుంది అనుకోవడం.... ఏది పుణ్యం ఏది పాపం ఎవరు చెప్పగలరు... సర్వవ్యాపకుడైన ఆ పరాత్పరుడికన్నా స్పీడ్ గా వ్యాపిస్తున్న ఈ అకృత్యాలు మన లెక్కకు అందవు.. పాలించే వాడికి క్రింద కుర్చీ కోడు ఎవరు లాగేస్తాడోనని భయం... రుచి మరిగిన వారికి కుర్చీ ఎప్పుడెక్కుదామని ఆశ... ఓటు వేసి గెలిపించే సామాన్యులకి (ఓటుకి నోటు పుచ్చుకుని వేసేవారు కాదు అని మనవి) వారి బాధలు ఎప్పుడు తీరుతాయో ... అసలు తీరుతాయా అని ఆత్రం... అందరూ ఆ కనపడని భగవంతుని ముందు మోకరిల్లేవారే... తాళాలు వేసి గర్భగుడిలో పెట్టినా అక్కడనుంచి ఆడేవారి ఆట చూస్తూ రైటూ అవుటూ నిర్ణయించే గొప్ప రెఫరీ ఆయన... ఆడించేవాడు ఆయనే.. అది భగవంతునిపట్ల నా విశ్వాసం... కాని సురేఖగారు.. ఫోటో చూసి ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు భావించుకుని స్పందించారు...మంచిదే ....కేవలం ఒక ఫోటో చూసి మొత్తం ఆ జాతిపట్ల అంత పరుష పద ప్రయోగం ఎందుకో నాకు రుచించడం లేదు...

    ReplyDelete
  4. /కేవలం ఒక ఫోటో చూసి మొత్తం ఆ జాతిపట్ల అంత పరుష పద ప్రయోగం ఎందుకో నాకు రుచించడం లేదు/
    నిజమే! కాని అలాంటి వాళ్ళను మాత్రం దేవుడు క్షమించినా మామూలు మనుష్యులు క్షమించరు. సమ్మెలో పాల్గోవడం, మద్దతివ్వడం వాళ్ళ ఇష్టం. గుడిముందు, అర్చక ఆహార్యంతో అలా దిగజారుడుగా ప్రవర్తించడం ఆ గౌరవనీయ ఆధ్యాత్మిక వృత్తికే కళంకం. ఏహ్య భావం కలిగించే విషయం, అందరూ అలానే అని కాదు. హుందాగా బ్రతికే చండాలురు వీరికన్నా వుత్తమం.

    ReplyDelete