కొన్నిటిని చూడగానే ముద్దొస్తుంటాయి. చిట్టి చిట్టి పాపాయిలే కాదు, బుజ్జి బుజ్జి
కుక్కపిల్లలు కూడా ముద్దొస్తాయి!. కాకి పిల్ల కాకికి ముద్దంటారు. మా చిన్న
తనంలో ఇంగ్లీషు సినిమాల్లో తప్పక ముద్దుల దృశ్యాలుండేవి. ఆ సీన్లొచ్చి
నప్పుడల్లా ముందు క్లాసుల నుంచి ఈలలు గోలలూ ! ఇప్పుడు వాటిల్లో
కన్నా మన సినిమాల్లోనే ముద్దులు అంతకన్నా ఘోరంగా శృంగార దృశ్యాలు
ఉంటున్నాయి. ఇదివరలో మన సినిమాల్లో నాయకీనాయకుల మధ్య ముద్దు
లను చూపాలంటే సింబాలిగ్గా రెండుపూలు గాలికి కదలి రెండూ దగ్గరైనట్లు
చూపించే వారు. "పెళ్ళికానుక" సినిమాలో హీరో హీరోయిన్ల స్టాండ్ వేసిన
సైకిల్ హ్యాండిల్స్ కదలి రెండు ముందు చక్రాలు కలసినట్లు చూపించారు.
కలవరి డి పాటతో పాప్యులరయిన "త్రీ" చిత్రంలో నటిస్తున హీరో ధనుష్
భార్య ఐశ్వర్య హీరో హీరోయిన్ శృతిఃహాసన్ల మధ్య ముద్దు ముచ్చట్లను
స్వయంగా దర్శకత్వం వహించడం ఇప్పుడో పెద్ద వార్త. ఇప్పుడు ముద్దుల పై
మన ఆంధ్రప్రదేశ్ మంత్రులకు మోజు ఎక్కువయిందనడానికి ఇటీవల ఓ
సభలో ఇద్దరు మంత్రులు ఒకరినొకరు ముద్దులతో ముంచెత్తుకున్నారని
పత్రికలలో వార్తలతో బాటూ ఫొటోలూ చూశాం. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరు
మగ మహారాజులే !!.ఈ విషయంపై ఈనాడు శ్రీధర్ ఓ మంచి కార్టూన్ కూడా
వేశారు.ఓ దివంగత ముఖ్య మంత్రి ప్రజలకు ఫైయింగ్ కిస్సులిచ్చేవాడు!
1961లో న్ను కొన్న KISS ME , YOU FOOL అన్న కార్టూన్ పుస్తకం
నుంచి కొన్ని కార్టూన్లు మీ కోసం. ఈ పుస్తకం అట్ట మీద లిప్స్ బొమ్మ ప్లాస్టిక్
ప్లేట్ మీద వుండేది. పుస్తకాన్ని కదిపితే ఆ అధరాలు ముద్దుకు రెడీ అన్నట్లు
కదిలేవి. ఆ పుస్తకాన్ని ఎరువు తీసుకొన్న ఓ పెద్ద మనిషి ఆ లిప్స్ బొమ్మను
ఊడగొట్టి ఇచ్చాడు. ఇక సినిమా పాటల్లో " అడగక ఇచ్చిన మనసే ముద్దు
(దాగుడు మూతలు,) "ము ము ము ముద్దంటే చేదా" (అదృష్టవంతులు),
" ఇవ్వు ఇవ్వు ఒక ముద్దు " (ప్రేమ) ఇలా ముద్దులపై పాటలూ వచ్చాయి.
ముక్తాయింపుగా ఓ ముద్దు జోకు:
"చూడండి! ఆ ఎదురింటాయన ఆఫీసుకు వెల్తూ భార్యకు ఓ ముద్దిచ్చి
వెళ్తాడు. మీరూ వున్నారు " అంది భార్యామణి రాగాలు పోతూ.
" నాకభ్యంతరం లెదే ! వాళ్ళాయన చూస్తే బాగుండదేమో" అన్నాడు
భార్యతో.
ఈ ముద్దోచ్చే కార్టూన్ బాపు గారికి కృతజ్ఞతలతో.

muddugaa unnaayi..
ReplyDeleteనేను చూడని బాపు గారి కార్టూను చూపించినందుకు కృతఙ్ఞతలు.
ReplyDelete(అప్పారావుగారూ....ఇది మీక్కాదు.. దయుంచి చదవకండి ప్లీజ్...) అయ్యా !మిగతావారూ...ఆయన డెబ్భైయ్యో పడిలో పడ్డాడండి.. చక్కటి అనుకూలవతి అయిన మా చెల్లెమ్మగారు ఆయనగారి శ్రీమతి. ముత్యాల్లాంటి ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళయి, కాపురాలు చేసుకుంటున్నారు. అలాగే అబ్బాయి కూడాను... మనుమలు మనుమరాళ్ళూ.... నెలతిరిగేసరికి పెన్షన్. బాదర బందీలు లేవు..వారేకాక... ఎన్నతగిన సద్గుణాలున్న మా బోటి స్నేహితులం ఉన్నాం..ఈ పెద్దమనిషి ఇప్పడికీ లైనేస్తారు తెలుసాండీ? హన్నా, అని అప్పట్లో కూకలేసా... ఈ మధ్య కొంచెం చూసీ చూడనట్టు ఊరుకున్నాలెండి.... ఇప్పుడీ ముద్దులగోల.
ReplyDeleteఏమన్నా బాగుందా అండీ ?కొంచెం మీరైనా చెప్పండి ప్లీజ్ (సురేఖగారు! ఇక రండి)
అయ్యా హనుమంతరావుగారూ ! శుభోదయం. ఇంకా లైనేస్తాడూ అంటే మన మితృలు ఈ అప్పారావుని అప్పార్ధం చేసుకోగలరు. లైన్లంటే గీతల్తో కార్టున్లని మీ అభిప్రాయం
ReplyDeleteఅందరికీ తెలియదు కదండీ. అయినా ఏ వయసైనా వైసుల్లేకుండా ముద్దూ ముచ్చటా తీర్చుకోవచ్చుకదా ! ధన్యవాదాలు!
అప్పారావు గారూ ఇక్కడ హనుమంతరావు గారు చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ మిమ్మల్ని అప్పార్ధం చేసుకునే సాహసం మేము చేయగలమా? ఏమాటకామాటే చెప్పుకోవాలి మిమ్మల్ని ఈ విషయంలో నిలదీసే వయస్సు నాకు లేదు కాబట్టి మీకు ప్రైవేటు చెప్పడానికి బుడుగుకి కబురంపా. ఆన్ ద వే అని ఇప్పుడే మెసేజ్ పెట్టాడు. జార్త మరి.:)
ReplyDelete