నిన్న మాటినీకి "శ్రీరామరాజ్యం" చూడటానికి నేనూ,నా శ్రీమతి మా
సన్నిహిత మితృలతో వెళ్ళాము. అక్కడ నాకు పరిచయం వున్న
ఒక ఆయన సకుటుంబంగా ఎదురుపడ్డాడు. సాధారణంగా సినిమా
హాల్లో కనిపించగానే " సినిమాకేనా ?" అనే షరా మామూలు ప్రశ్న
కాకుండా "శ్రీరామరాజ్యం" సినిమాకేనా ?" అన్నా,ఏమంటే ఆ
ధియేటర్ కాంప్లెక్స్లో ఇంకా రెండు మాస్ మసాలా సినిమాలు ఆడు
తున్నాయి. ఆయన సమాధానం నాకు ఆశ్చర్యం, మరింత బాధ
కలిగించింది. " ఎబ్బే, ఇంకా ఈ పౌరాణికాలేం చూస్తాం. మాకే ఇష్టం
లేనప్పుడు ఈ పిల్లలు ( వాళ్ళకు 9,11 ఏళ్ళ వయసుంటుంది )
చూస్తారటండీ. అసలే ఇవి కంప్యూటరు రోజులు! స్టంట్లూ,డాన్సులూ
అసలు మజా లేక పోతే అస్సలు చూడరు " అన్నాడు. ఇలాటి
మహానుభావులున్నప్పుడు పిల్లలకు మన పౌరాణిక కధల గురించి
మంచి ప్రవర్తన, కుటుంబ అనుబంధాల గురించి ఎలా తెలుస్తుంది.
ఏదైనా పిల్లలు నేర్చుకొనేది అమ్మా నాన్నల నుంచే కదా ?
శ్రీరామరాజ్యం సినిమా చూడకుండానే మరికొందరు " అబ్బే, నయన
తార సీతేమిటండీ, అవ్వ !"అనీ "సింహా" లాటి సినిమాల్లో వేసిన బాల
కృష్ణ రాముడా ? "అన్న వాళ్ళూ చాలామంది ఉన్నారు. అలా అన్న
ఒకాయనే సినిమా చూసివచ్చి "ఏదో అనుకున్నా సుమాండీ ! బాపూ
గారు ఆ నయనతారను సీతగా ఎంత చక్కగా చూపించాడో, అయోధ్య
ఇలా వుండేదా అన్నట్లు ఆ సెట్టింగులూ కన్నుల పండుగచేశాయి!
బాలకృష్ణ కూడా కొన్ని చోట్ల వాళ్ల నాన్న రామారావుని గుర్తోచ్చాలా
చేశాడు సుమా " అని అన్నాడు.
ఎందుకోగానీ మన తెలుగు వాళ్ళు కొంతమంది పనిగట్టుకొని బాపూ
రమణల ఈ సినిమాపై మొదటినుంచీ కావాలనే నెగటివె టాక్ ను
ప్రచారం చేశారేమోనని అనిపించింది. ఇదే సినిమాను ఏ హిందీ
నిర్మాతో తీసివుంటే మన వాళ్ళు " ఆహా ! ఓహో ! " అంటూ పొగిడే
వారన్నది నిజం ! వాల్మీకి మహర్షి లవకుశులను రామాయణం
నుంచి ఏమి తెలుసుకున్నారని ప్రశ్నించి వారి చేత రామాయణ
కావ్య అనౌత్యాన్ని చెప్పించిన తీరు ప్రశంశనీయం. శ్రీ ముళ్ళపూడి
బాపులకు శ్రీ రాముడన్నా, రామాయణ మన్నా ఎంతో ఇష్టం. కవరు
మీద ఎడ్రస్ వ్రాసినా , ఓ పుస్తకం మీద సంతకం చేసినా శ్రీ రామ
అని వ్రాయకుండా వుండరు. ఈ చిత్రాన్ని అందించిన శ్రీ యలమంచిలి
సాయిబాబా, సంగీత దర్శకుడు ఇలయరాజా, గేయరచయిత జొన్న
విత్తుల , కమేరామేన్ రాజు, కళాదర్శకులు ఇతర సాంకేతిక నిపుణులు
తెలుగుతెరకు ఒక కమణీయ క్లాసిక్ ను అందించి ధన్యులయ్యారు.
ఇలాటి చిత్రాలను ఆదరించి ఇలాటి మరిన్ని మంచి చిత్రాలనిర్మాణానికి
పొత్సాహాన్ని అందించడం మన తెలుగు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యం.

ఇప్పుడు ఈ సినేమా కి విమర్శకులున్నా...ఇంకో పదేళ్ళకి చూడండి, విలువలు తగ్గిన తెలుగు సినేమాల్లో ఇక పౌరాణికాలు చేసే నటులులేక, ఉన్నా తీసే దర్శకులు లేక, ఇప్పటి విమర్శకులే ఈ సినేమా ని ఆణిముత్యం అని నోనోటా పొగిడే రోజూ వస్తుంది.
ReplyDeleteశ్రీరామరాజ్యం సినిమా నేను కూడా చూశానంకుల్. చాలా బాగుంది. మంచి చిత్రాలను, అదీ పౌరాణికాలను ఆదరించేవారు ఇప్పట్లో తక్కువమందే ఉన్నారు. అయితే అలాంటి చిత్రాలను ఆదరించేవారు లేకపోలేదు.
ReplyDeleteచిన్ని ఆశగానీ వ్యాఖ్యతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.
అందరికి నచాలని లెదు మీకు నచితె చాలు
ReplyDeleteఇదేం అన్యాయమండీ... రామరాజ్యం నే చూడలేదు. అయితే నా వ్యాఖ్యకు సురేఖరాజ్య బహిష్కరణా... నే చెప్పాగా బొమ్మలు వేయనుగాని బాపూగారంటే ఇష్టమని... రమణగారంటే రాయలేకపోయినా ఇష్టమని... శ్రీరాముడంటే ఇంకా ఇంకా బోల్డు బోల్డు ఇష్టమని, ఇష్టమని.. అయినా పోస్ట్ మార్చారా.. రాముడు ప్లేట్ మారిస్తే ఎలాగండి... రామో విగ్రహవాన్ ధర్మః... అటువంటిటువంటివాడు కాదు..ఆజాను బాహుడరవిందాయతాక్షుడు... వెళ్తా ..బాపుగారికోసం, రమణగారికోసం... అప్పుడు చెప్తా ఈ రాజ్యబహిష్కరణ ఏమిటో ? అంతవరకు శలవు.
ReplyDeleteఅయ్యా,
ReplyDeleteనాకు బాపు, రమణలు భలే యిష్టం.
కాని శ్రీరామరాజ్యం చూసే ధైర్యం లేదు. బాగుందని ప్రచారం చేసే ఉద్దేశం లేదు.
శ్రీరామరాజ్యాన్ని యెక్కడిక్కడ సరిపెట్టుకుంటూ యిలాగా బాగానే ఉంది అనుకోవటం నా వల్లకాదు. ఎంత బాపూ తీసినా, నిర్మాత యెంత గొప్పగా ఖర్చు పెట్టినా. విలువల విషయంలో సరిపెట్టుకోవటం అనేది ఆత్మద్రోహం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు - అలా సరిపెట్టుకోవటం పతన్నాన్ని ప్రోత్సహించటమే! పతనం చేసే వాళ్ళని అభినందించటమే. నా వల్ల కాదు.
పాతదని ప్రత్యేకంగా మెచ్చుకోవటం కాదు. లవకుశకు దీనికి హస్తి మశకాంతరం ఉంది.
పై మెఱుంగులతో చెత్త సినిమా కళాఖండం అయిపోదు.
అయ్యా శ్యామలీయం గారు ! శుభ సాయంత్రం ! మీకు చూసే ధైర్యం లేదన్నారు. చూస్తే ఎక్కడ బాగుందనిపిస్తుందో అని భయమా ? బాపు రమణలంటే
ReplyDeleteఇష్టమన్నారు. అందుకోసమైనా వాళ్ళు ఎంత బాగా తీయలేదో తెలుస్కోవటానికేనా చూడొచ్చుకదా ! ఐనా ఎవరి ఇష్టం , అభిరుచులు వారివి. నా మాటలు
మీకు ఇబ్బంది కలిగిస్తే క్షంతవ్యుంణ్ణి
@శ్యామలీయం గారు
ReplyDelete"శ్రీరామరాజ్యం చూసే ధైర్యం లేదు."
"లవకుశకు దీనికి హస్తి మశకాంతరం ఉంది.పై మెఱుంగులతో చెత్త సినిమా కళాఖండం అయిపోదు."
మీరు సినిమా చూడకుండా ఇలా ఎలా నిర్ధారించగలిగారో నాకు అర్థం కాలేదు గురువు గారూ.
అయ్యా శ్యామలీయం గారు..! అస్సలు మీరు సినిమా చూడకుండా " చెత్త " అని తేల్చడంలోనే మీ మానసిక స్థితి ఏమిటొ అర్థమవుతున్నది. నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని.."అసలు లవకుశ" కు ఉన్న గొప్పదనం ఏమిటి చెప్పండి..? సినిమా పాతదయినంత మాత్రాన అదో పెద్ద గొప్ప సినిమా..ఆణిముత్యం..ఎవరు చేయలేరు..లాంటి ప్రచారాలు..బాగా ఉన్న ప్రపంచంలో..అందరు మీలానే మాట్లాడతారులేండి.
ReplyDeleteఅయ్యా శ్యామలీయం గారు,
ReplyDeleteదయచేసి మీరు చూడకండి, చూసి వచ్చి (కేవలం) రంధ్రాన్వేషణ (మాత్రమే) చేస్తూ, ఓ పది టపాలో, కామెంట్లో వదిల్తే పాపం జనాలు తట్టుకోవటం కష్టం :)
మీరు చూడకపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు, బాగుంది అని ప్రచారం చేయకపోయినా నష్టం ఏమీలేదు,
కాని కనీసం చూడను కూడా చూడకుండా, కేవలం ఓ నిమిషం trailer మాత్రం చూసి జడ్జిమెంట్లు, పనిష్మెంట్లు ఇవ్వకండి బాబయ్యా!!!
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.

ReplyDeleteశ్రీ రామరాజ్యం చూసారా ?
ReplyDeleteహన్నా ఎంత మాటన్నారు. చూసామని చెప్పి
"బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం " అన్నాను.
వరస బెట్టి వాయించారు !!!
చూడను గాక చూడను అన్నాను. దానికీ వరస బెట్టి వాయించారు,చూదాల్సిందని !
అంతా బాపు రమణ ల మాయ ! విష్ణు మాయ గా ఉంది.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteవింతగా ఉందే! నేనేదో అవాచ్యాలూ అసభ్యాలూ వ్రాసినట్లు భావించారా? ఈ blog administrator మహాశయులు? అసలు నా వ్యాఖ్యలనెందుకు తొలగించారో! చాలా సంతోషం. వీరింత సరసవిరోధులన్న సంగతి తెలియక యిక్కడ వ్యాఖ్య ఉంచటం నాదే పొరబాటేమో. వీలయితే యీ 'రేఖా చిత్రం' బ్లాగును మరల సందర్శించటం చేయను. స్వస్తి.
ReplyDeleteSree Ramarajyam can not be compared with Lavaksusa and the intention of the director is not that.Bapu made it differently.See,enjoy and propagate the values if you can.
ReplyDeleteSree Ramarajyam can not be compared with Lavaksusa and the intention of the director is not that.Bapu made it differently.See,enjoy and propagate the values if you can.
ReplyDelete