Tuesday, October 25, 2011

సామాన్యునితో అసామాన్యుడు- శ్రీ ఆర్కే. లక్ష్మణ్ !!

శ్రీ ఆర్కే లక్ష్మణ్ ఇట్లా అంటారు." పుట్టుకతోనే ఏ వ్యక్తి ఏ రంగంలోనూ
ప్రముఖుడైపోడు"
నిన్ననే తన 90 వ జనమదినాన్ని జరుపుకున్న ప్రఖ్యాత వ్యంగ్య
చిత్రకారుడు తన పొలిటికల్ కార్టూన్లతో అలరించారు. ఆయన TIMES
OF INDIA దిన పత్రికకు అనుదినం వేసిన ప్రతిఒక్క కార్టూన్లలో ఆయన
సృష్టించిన భారతదేశపు సామాన్యుడు అగుపిస్తాడు.
చక్కని కార్టూనిస్ట్ కావాడానికి ప్రధానంగా హాస్యాభిరుచి, చక్కగా బొమ్మలు
గీయగలగడం, మంచి చదువు అవసరమని శ్రీ లక్ష్మణ్ అంటారు.


అందవికారంగా వుండే పక్షులు కాకులు కూడా అయన కుంచె తో
ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక ఆయన గీసిన రాజకీయ, క్రీడా ,సినీ
ప్రముఖుల కేరికేచర్లు గురించి వేరే చెప్పనక్కరలేదు .
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆయన వేసిన కొన్ని పాకెట్ కార్టూన్లు,
తెలుగు అనువాదంతో చూడండి. ఆయన అనారోగ్యం నుంచి మరింత
కోలుకొని మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ...

1 comment:

  1. భారతీయులందరూ గుర్తుపట్టే, గుర్తుపెట్టుకునే కార్టూన్లు గీసిన లక్ష్మణ్ గారికి శుభాకాంక్షలు.

    ReplyDelete