Thursday, July 29, 2010

భలే మంచి రోజు ! సినారె పుట్టిన రోజు !!



రసహృదయ వశిష్టుడు సినారె
ప్రముఖకవి, సినీ గేయ రచయిత తెలంగాణాలోని హనుమాజీపేట
అనే చిన్న గ్రామంలో జూలై 29 , 1931 జన్మించారు. ఆయన హైద్రాబాద్
ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తూనె యన్టీయార్
ఆహ్వానం పై 1961 లో "గులేబాకావళి కధ" చిత్రంతో పాటలు వ్రాయటం
ప్రారంభించారు. మద్రాసులో నివాసం వుండకుండా హైదరాబాదులోనే ఉంటూ
శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ లాంటి దిగ్గజాల మధ్య నిలబడి పాటల రచయితగా
అసమాన ఖ్యాతిని పొందారంటే సామాన్య విషయం కాదు. శ్రీ నారాయణరెడ్డి
ప్రభంధిక మాటలను సినీ గేయ రచనలలో ప్రవేశపెట్టారు. ఆయన స్వయంగా
మధురంగా పాడగలగటం మరో ప్లస్ పాయింట్ అయింది. సినారె గా ప్రశిద్దులైన
ఆయన లలిత సంగీతం, గేయ కావ్యాలు వ్రాశారు. " ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు
దాగెనో", "సాగుమా ఓ నీల మేఘమా" లాంటి లలిత గీతాలు సినిమా కోసం
వ్రాసినవి కావు. తరువాత ఆ పాటలను వివిధ సినిమాలలో ఉపయోగించారు.
మొదటి సారిగా 1961లో యన్టీయార్ సినిమా "గులేబాకావళి కధ" చిత్రానికి
పాటలు వ్రాస్తున్నప్పుడు, శనివారం సాయంత్రం హైద్రాబాదు నుండి మద్రాసుకు
వచ్చి పాటలు వ్రాసి తిరిగి సోమవారం ఉదయం ఫ్లయిట్లో తిరుగుప్రయాణమై
యూనివర్సిటీలో క్లాసులకు హాజరయ్యే వారంటే ఆయన కార్యదీక్షత,సమయ
పాలనను మెచ్చుకోలేకుండా వుండలేము. శ్రీ నారాయణరెడ్డి మంచి వక్త. ఘజల్స్
అద్భుతంగా గానం చేయగల ప్రతిభాశాలి. " మాయదారి సిన్నోడు నా మనసే
లాగేసుండు" పాటలో తెలంగాణా మాండలీకాన్ని సినిమా పాటలో మొదటిసారిగా
ప్రవేశపెట్టారు. ఆయన రచించిన ప్రఖ్యాత కావ్య రచన కర్పూరవసంతరాయలు,
నాగార్జున సాగరం, జాతిరత్నం, ఋతుచక్రం, విశ్వంభర, గేయ నాటికలు, నవ్వని
పువ్వు, అజంతాసుందరి మొదలైనవి. 1978లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ
గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. సాహిత్య అకాడమీ తో బాటు 1977 లో పద్మశ్రీ
అందుకొన్నారు. "కర్పూర వసంతరాయలు" కావ్యాన్ని ఆయన ఆలపించగా అమెరికా
లోని ఆయన అభిమానులు LP రికార్డుగా తయారు చేయించి విడుదల చేశారు.
సినారె చమత్కారాలు
ప్రసిద్ధ కవి బోయి భీమన్న తన అభిప్రాయాల్ని వ్యాసాల్లొ, ఉపన్యాసాల్లో నిర్భయంగా
వ్యక్తీకరిస్తుంటారు. భీమన్న పాల్గొన్న ఒక సభలో సినారె ప్రసంగిస్తూ బోయి "భీమన్న
కాదు, ఈయన బాబోయ్ భీమన్న" అన్నారు.
* * * * * *
హైదరాబాదులో నాగార్జున సాగర్ కమ్యూనిటీ హాల్లో సినారె గారికి జ్ణాన పీఠ్ ఎవార్డు
వచ్చినప్పుడు జరిగిన సన్మాన సభకు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు అధ్యక్షత
వహించారు. సినారె వారిని సంభోదిస్తూ " మేధావుల సాంబశివరావు" అన్నారు.
**********
సినారె చణుకు
1990 లో తూర్పు గోదావరి జిల్లా రామవరం లో సినారె కి సన్మానం ఏర్పాటు
చేశారు. విశేషజనవాహినిని చూసిన ఓ వక్త ఈ సభ "మయ సభ"ను గుర్తు
చేస్తుంది అని అన్నాడు. "మయ సభ" అంటే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా
చూపించేది. కాబట్టి ఈ సభను మయ సభా అనవద్దు, వాఇ~మయ సభ అందాం
అన్నారు.
***********
సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణవేత్తా వచ్చారు.
ఇద్దరూ సినారెకు అత్యంత ఆప్తులు. సెలవు తీసుకొని వెడుతూ స్కూటర్ మీద
కూర్చున్నారు. మితృలకు వీడ్కోలు చెబుతూ సినారె "బాగుంది ! ఈ జంట! ముందు
కరణం, వెనుక వ్యాకరణం" అంటూ చలోక్తి వదిలారు..
***********
ఈ రోజు 29వ తేదీన 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సినారె గారికి మన
బ్లాగందరి తరఫున శుభాకాంక్షలు !!

Wednesday, July 28, 2010

వార్తా పత్రికల కబుర్లు




వార్తా పత్రికల కబుర్లు
ఇప్పుడు మనకు తెలుగులోనే ఎన్నో దిన పత్రికలు. ఒక్కొక్కటి దాదాపు
ఓ పాతిక కేంద్రాలనుంచి వస్తున్నాయి. ఇక రంగులు , జిల్లా ఎడిషన్లు
ఇలా ఎన్నెన్నో హంగులు. ఉదయని కల్లా పత్రికలు మన ముంగిటకు
వచ్చి పలకరిస్తున్నాయి. మా చిన్న తనంలో ఇన్ని దిన పత్రికలు లేవు.
ప్రముఖ పత్రికలు తెలుగులో రెండే ఉండేవి. అవి కాశీనాధుని నాగేశ్వరరావు
గారి " ఆంధ్రపత్రిక", ఇండియన్ ఎక్స్ప్రెస్స్ గ్రూప్ వారి "ఆంధ్రప్రభ". ఆది వారం
రెండు అణాలు, మిగతా రోజుల్లో ఒక అణా (ఆరు పైసలు) ! ఇంగ్లీష్ దిన
పత్రికలలో "THE HINDU", "MADRAS MAIL", "INDIAN EXPRESS"
పత్రికలు వచ్చేవి. ఇవన్నీ మద్రాసు కేంద్రంగా ప్రచురించ బడేవి.
ఈ నాటి మన వార్తాపత్రికలకు మూలం ఎక్కడో తెలుసుకోవాలంటే రోమన్ల
కాలం నాటి జూలియస్ సీజర్ కాలం నాటికి వెళ్ళాలి. సీజర్ "ఏక్టా డయర్నా"
లిఖిత ప్రకటనల పత్రాలు ప్రవేశపెట్టాడు. "ఏక్టా డయర్నా" అంటే "దైనిక విశేషాలు"
అని అర్ధం ట. మొదట్లో లెటర్ ప్రెస్ ద్వారా అచ్చయే పత్రికలు ఈనాడు అత్యంత ఆఫ్సెట్లో
వేగంగా వివిధరంగుల్లో తయారవుతున్నాయి. "ఆంధ్రపత్రిక", "ఆంధ్రప్రభ" తరువాత
విజయవాడ నుంచి INDIAN EXPRESS తో బాటు ప్రచురించడం ప్రారంభించారు.
కాలక్రమాన ఉషోదయా సంస్ఠ " "ఈనాడు " పత్రికను ప్రారంభించి పేరులోనే కొత్త
వరవడిని ప్రవేశపెట్టారు. ఆంధృల అభిమాన పత్రికగా ఫెరుమోసిన "ఆంధ్ర పత్రిక"
కనుమరుగయింది. "ఆంధ్రజ్యోతి", "వార్త", "సాక్షి", "సూర్య", " విశాలాంధ్ర" పత్రికలు
వస్తున్నాయి. చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు " ఉదయం" పేరిట దిన పత్రికను
ప్రారంభించారు కాని ,ఎంతో కాలం సాగలేదు. "THE HINDU", "INDIAN EXPRESS"
పత్రికలు బోఫోర్స్ కుంభకోణాన్ని బయట పెట్టాయి. ఎమర్జన్సీ చీకటి రోజుల్లో పత్రికల
మీద అప్పటి ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టినా దేశంలోని పత్రికలు ధైర్యంగా ఎదుర్కోన్నాయి.
మహత్మా గాంధి సంపాదకత్వంలో వెలువడిన YOUNG INDIA ( 25.05.1921)
పత్రికను, ఆంధ్రపత్రిక ( 4th APRIL, 1914) ప్రతిని, గాంధి హత్యను GANDHIJI
SHOT DEAD అన్న వార్తను ప్రచురించిన జనవరి 31,1948 నాటి HINDU పత్రికను,
బోఫోర్స్ కుంభకోణం వార్తను వేసిన HINDU, INDIAN EXPRESS పత్రికల ఫొటోలను
పైన చూడండి.
ప్రఖ్యాత హాస్య రచయిత కీ" శే" శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారిని కలవడానికి వేళ్ళి
నప్పుడు, ఏమండి ఇంకా స్నానం అవలేదా? అని అడిగితే, "ఫెపర్లలో ఉదయాన్నే చావు
కబుర్లు ఉంటాయి కదా, అవన్నీ చదివాక స్నానం చేస్తా, అందుకే లేటు" అని నవ్వుతూ
అనే వారు. ఉదయాన్నే పేపర్లలో ఈ వార్తలు చూసినప్పుడల్లా ఆయన మాటలే గుర్తు
కొస్తాయి.

Monday, July 26, 2010

బొమ్మల కధలుగా ఇతిహాసాలు






విదేశాల్లో చిత్రకధలు ( కామిక్స్) పిల్లల్లో, పెద్దల్లో బాగా ప్రాచూర్యాన్ని
పొందాయి. మన దేశంలో అమరచిత్ర కధలు రూపంలో మన పౌరాణిక,
చారిత్రాత్మక గాధలు ఇండియా బుక్ హౌస్ సంస్థ విడుదల చేస్తున్నది.
1985లో సంస్కృతి ఇంటర్నేషనల్ శ్రీ బాపు, ముళ్ళపూడి గీసి,వ్రాసిన
రామాయణం బొమ్మల కధను ప్రచురించింది. ప్రచురుణ కర్తలు ముందు
మాటలో ఇలా అన్నారు.
" ఈ పుస్తకాన్ని ముందు ఇంగ్లీషు, ఫ్రెంచి, శ్పానిష్ భాషలలో
ప్రచురించి పదివేల కాపీలు అమెరికా, కెనడా దేశాలకు
పంపించాము. ఆమెరికాలో అఖండ విజయం పొందిన ఈ
గ్రంధం త్వరలో మరికొన్ని విదేశ భాషలలో కూడా ప్రచురించ
టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కధను విని కొంత అర్ధం
చేసుకున్న అమెరికెన్ పిల్లలు ఈ బొమ్మలు చూసి కధ
గురించి యింకా ఎక్కువ అర్ధం చేసుకున్నా మన్నారు"

శ్రీ కృష్ణలీలలు, మహా భారతం బాపు బొమ్మలు, ముళ్లపూడి వారి రచన చిన్న
పిల్లలకు చక్కగా అర్ధమయేంత అందంగా వుంటాయి. కొంచెం పెద్ద పిల్లలు
యింకా ఎంత సేపైనా చూడాలి అంటారు. ఈ పుస్తకాలు రామాయణం
లాగానే ఏ వయసుకు తగినట్లు ఆవయసుల వారికి ఉల్లాసం కలిగిస్తాయి.



Sunday, July 25, 2010

సురేఖార్ట్యూనులు




సురేఖా కార్ట్యూనులు : : నీరు కన్నీరు అను ’ఐస్ " వాటర్
( EYES WATER )
మునిసిపాలిటీ అందించే కలరు నీరు కాదా జనంపాలిటి కలరా !
ఆ నీళ్ళు త్రాగి రోగాలు రాని జనాలు ఒకరైనా కలరా ?
అందుకే సందు సందు ముందు పెట్టేశారు ఓ "మందు" దుకాణం !!
ఆ "మందు" తో తీర్చుకుంటున్నారు లే ఓటేసిన జనం ఋణం ! !

Saturday, July 24, 2010

"ఈనాడు" శ్రీధర్ కార్టూ‍న్ల పుస్తకం




ఈనాడు శ్రీధర్ కార్టూన్ల పుస్తకం
ఈనాడులో శ్రీ శ్రిధర్ గారి కార్టున్లు చూసినప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారి కార్టూన్
పుస్తకాలలా శ్రీధర్ గారి కార్టూన్ల పుస్తకం కూడా వెలువడితే బాగుండునని
చాలామంది ఆయన అభిమానులకు కలిగే వుంటుంది. ఈనాడు ఆగస్ట్,1999
లో ఈనాడు కార్టూన్లు శిధర్ పేరిట 10 X 8.5" సైజులో 214 పేజీలతో చక్కని
బైండు పుస్తకం రూ.70/-లకు విడుదలచేసింది. ఈనాడు పత్రికలో శ్రీధర్ 30
నవంబర్ 1982 నుండి 13 జూన్ 1999 వరకు వేసిన కార్టూనను
ఇందులో చూడొచ్చు. శ్రి ఆర్కే లక్ష్మన్ గారి తరువాత తెలుగులో రాజకీయ కార్టూనిస్ట్ గా
శ్రిధర్ ప్రధమ స్థానంలో నిలుస్తారనటంలో అతియోశక్తి లేదు.
శ్రీ రామోజీ రావు గారు పుస్త్రకంలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు.
" నేను నాటి,పాదుచేసి, పెంచిన మొక్క గురించి ఏం చెప్పను? "ఈనాడు" ప్రాంగణంలో
నా కళ్ళ ముందే కార్టూన్ కల్పవృక్షం గా ఎదిగిన శ్రిధర్ గురించి ఎంతని చెప్పను? నాటి
నా ఆలొచనకు శ్రీధర్ లో అంతర్లీనంగా ఉన్న తపన, వృత్తిపట్ల అంకిత భావం తోడయ్యాయి.
ఇవాళ ఆర్.కె.లక్ష్మణ్ల్ లాంటి అగ్రశ్రేణి కార్టూనిస్టుల సరసన సుస్ధిర స్థానాన్ని శ్రీధర్ కు
సముపార్జించిపెట్టాయి. ఈనాడులో పుట్టి ఈనాడులో పెరిగిన శ్రిధర్ తో నా అనుబంధం-
తండ్రీబిడ్డల వాత్సల్యం. శ్రీధర్ లాంటి కార్టూనిస్ట్ "ఈనాడు"లో తయారయినందుకు
పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాను."
ఇక శ్రీధర్ ఇలా అంటారు, "స్కాములూ, అవినీతి, అసమర్ధతా, నిరుద్యోగం, కరవూ,
చెత్తా చెదారం, బాధలూ, నీటి కొరతా, కరెంటు కోతా, అధిక ధరలూ, పన్నులూ కొనసాగినంత
కాలం నవ్వక తప్పదు... అంటే ,జీవిత పర్యంతం నవ్వాలి. అదంతే- నవ్వండి !"
ఆగస్టు 24, 1908 లో శ్రీధర్ గారిని కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆనాటి ఫొటొ మరొ
సారి, మీ అందరికోసం.

Friday, July 23, 2010

బాపు రమణ బొమ్మల కధలు






మరో మంచి పుస్తకం - బాపు రమణ బొమ్మల కధలు
బాపు రమణలు 60 ఏళ్ళనుంచి చేసిన కళా (ధా) పోసన లన్నీ ఏర్చి కూర్చి ఒకే
పుస్తక రూపంలో రచన శాయిగారు తమ వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా పెద్ద సైజులో
465 పేజీలతో ప్రచురించారు. తెలుగు పాఠకులకు ఇది పసందైన విందు. ఆంధ్ర
సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వార పత్రిక,ఆంధ్రజ్యోతి వీక్లీ, చందమామ,యివ,జ్యొతి,
విజయచిత్ర ఇలా ఎన్నెన్నొ ప్రముఖ పత్రికలలోని అద్భుత రచనలను,బొమ్మల
కధలను చూస్తూ చదవొచ్చు. ఆనాటి చందమామలో బాపుగారు వేసిన రంగుల
గలివర్ ట్రావల్సు బొమ్మల కధ, ఆంధ్రవారపత్రికలో వేసిన, రైతూ-రాజు, బంగారం-
సింగారం , బుడుగు "రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఖధ", బాపుగారు గీ(రా)సు
కున్న పెళ్ళిపుస్తకం,శ్రీ నాధ కవి సార్వభౌముడు స్క్రీన్ ప్లేలు ,చెప్పినడ్రాయింగ్
పాఠాలు, పంచతంత్రం బొమ్మల కధ అన్నీ అపురూపాలే.
495/-రూపాయలవిలువ గల ఈ పుస్తకం వాహిని బుక్ ట్రస్ట్,1-9-286
వుద్యానగర్, హైదరాబాద్- 500 04 వారి వద్ద దొరుకుతుంది.

Wednesday, July 21, 2010

గో గో గో !! గోమాత !!

ఆవు దూడను పూర్తిగా తాగనివ్వక దాని పాలు పూర్తిగా.
పిండుకుంటాము. మనది ఓ వేళ పాల వ్యాపారమైతే
అందులో నీళ్లు కలిపి అమ్ముకుంటాము. అన్యాయంగా
సంపాదించే వాళ్ళను "వాడు నానా గడ్డి తిని సంపాదించాడు"
అంటూ వుంటారు. ఫాలు పిండుకుంటే పిండుకున్నారు
ఆ ఆవుకు ఇంత దానాగా గడ్డి వేయరు. పాలు తిసుకున్నాక
వాటిని రోడ్డు మీదకు తోలుతారు. పాపం అవి కార్పొరేషన్
చెత్త కుండీలలోని నానా చెత్త తింటాయి. ప్లాస్టిక్ సంచుల్లో
ఉంచి పారేసిన కూరగాయల తొక్కును ఆ సంచుల్తో పాటు
నములుతాయి. ఆ ప్లాస్టిక్ అరగక వాటికి ఎన్ని జబ్బులో!
గోవును పూజించడం మన సంప్రదాయం. చెత్త కుండీ దగ్గర
ఆవు కనిపించగానే ,అక్కడ ఎంత దుర్ఘ్హంధంగా వున్నా సరే
వెళ్ళి తోకకు ఓ దండం పెడతారు. ఢిల్లీ లో సుల్తాన్పూర్ బర్డ్
సాంక్చ్యురీ దగ్గర ఎండిన చెరువులోని ఓ రకం చేప కళేబరాన్ని
తింటున్న ఓ ఆవు ఫొటోని "ఇండియా టుడే" పత్రిక ఇటీవలే
ప్రచురించింది. అంటె ఆవులు కూడా మాంసాహార జంతువులుగా
మారిఫొయేటట్లు ఛెస్తున్నామన్నమాట. అదే ఆ పై ఫొటో.
గోవు మాలచ్చిమిని నీ దేవతంటావు
పాలు తీసుకొని రోడ్డు పైకి గోగో అంటూ తోలుతుంటావు !!
మునిసిపాలిటీల నానా చెత్త తింటుంటే ఆ ఆవు
చూసి తోకకో దండమెడతావు!! నోటికో పండందించలేవు !!
ఫోటో : ఇండియా టుడే సౌజన్యంతో