Wednesday, July 28, 2010

వార్తా పత్రికల కబుర్లు




వార్తా పత్రికల కబుర్లు
ఇప్పుడు మనకు తెలుగులోనే ఎన్నో దిన పత్రికలు. ఒక్కొక్కటి దాదాపు
ఓ పాతిక కేంద్రాలనుంచి వస్తున్నాయి. ఇక రంగులు , జిల్లా ఎడిషన్లు
ఇలా ఎన్నెన్నో హంగులు. ఉదయని కల్లా పత్రికలు మన ముంగిటకు
వచ్చి పలకరిస్తున్నాయి. మా చిన్న తనంలో ఇన్ని దిన పత్రికలు లేవు.
ప్రముఖ పత్రికలు తెలుగులో రెండే ఉండేవి. అవి కాశీనాధుని నాగేశ్వరరావు
గారి " ఆంధ్రపత్రిక", ఇండియన్ ఎక్స్ప్రెస్స్ గ్రూప్ వారి "ఆంధ్రప్రభ". ఆది వారం
రెండు అణాలు, మిగతా రోజుల్లో ఒక అణా (ఆరు పైసలు) ! ఇంగ్లీష్ దిన
పత్రికలలో "THE HINDU", "MADRAS MAIL", "INDIAN EXPRESS"
పత్రికలు వచ్చేవి. ఇవన్నీ మద్రాసు కేంద్రంగా ప్రచురించ బడేవి.
ఈ నాటి మన వార్తాపత్రికలకు మూలం ఎక్కడో తెలుసుకోవాలంటే రోమన్ల
కాలం నాటి జూలియస్ సీజర్ కాలం నాటికి వెళ్ళాలి. సీజర్ "ఏక్టా డయర్నా"
లిఖిత ప్రకటనల పత్రాలు ప్రవేశపెట్టాడు. "ఏక్టా డయర్నా" అంటే "దైనిక విశేషాలు"
అని అర్ధం ట. మొదట్లో లెటర్ ప్రెస్ ద్వారా అచ్చయే పత్రికలు ఈనాడు అత్యంత ఆఫ్సెట్లో
వేగంగా వివిధరంగుల్లో తయారవుతున్నాయి. "ఆంధ్రపత్రిక", "ఆంధ్రప్రభ" తరువాత
విజయవాడ నుంచి INDIAN EXPRESS తో బాటు ప్రచురించడం ప్రారంభించారు.
కాలక్రమాన ఉషోదయా సంస్ఠ " "ఈనాడు " పత్రికను ప్రారంభించి పేరులోనే కొత్త
వరవడిని ప్రవేశపెట్టారు. ఆంధృల అభిమాన పత్రికగా ఫెరుమోసిన "ఆంధ్ర పత్రిక"
కనుమరుగయింది. "ఆంధ్రజ్యోతి", "వార్త", "సాక్షి", "సూర్య", " విశాలాంధ్ర" పత్రికలు
వస్తున్నాయి. చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు " ఉదయం" పేరిట దిన పత్రికను
ప్రారంభించారు కాని ,ఎంతో కాలం సాగలేదు. "THE HINDU", "INDIAN EXPRESS"
పత్రికలు బోఫోర్స్ కుంభకోణాన్ని బయట పెట్టాయి. ఎమర్జన్సీ చీకటి రోజుల్లో పత్రికల
మీద అప్పటి ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టినా దేశంలోని పత్రికలు ధైర్యంగా ఎదుర్కోన్నాయి.
మహత్మా గాంధి సంపాదకత్వంలో వెలువడిన YOUNG INDIA ( 25.05.1921)
పత్రికను, ఆంధ్రపత్రిక ( 4th APRIL, 1914) ప్రతిని, గాంధి హత్యను GANDHIJI
SHOT DEAD అన్న వార్తను ప్రచురించిన జనవరి 31,1948 నాటి HINDU పత్రికను,
బోఫోర్స్ కుంభకోణం వార్తను వేసిన HINDU, INDIAN EXPRESS పత్రికల ఫొటోలను
పైన చూడండి.
ప్రఖ్యాత హాస్య రచయిత కీ" శే" శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారిని కలవడానికి వేళ్ళి
నప్పుడు, ఏమండి ఇంకా స్నానం అవలేదా? అని అడిగితే, "ఫెపర్లలో ఉదయాన్నే చావు
కబుర్లు ఉంటాయి కదా, అవన్నీ చదివాక స్నానం చేస్తా, అందుకే లేటు" అని నవ్వుతూ
అనే వారు. ఉదయాన్నే పేపర్లలో ఈ వార్తలు చూసినప్పుడల్లా ఆయన మాటలే గుర్తు
కొస్తాయి.

1 comment:

  1. పాత పత్రికల గురించి మంచి సమాచారం రాశారు. అలానే అప్పుడప్పుడి ఆనాటి పత్రికలూ, ఆనాటి ముచ్చట్లు రాయండి

    ReplyDelete