విదేశాల్లో చిత్రకధలు ( కామిక్స్) పిల్లల్లో, పెద్దల్లో బాగా ప్రాచూర్యాన్ని
పొందాయి. మన దేశంలో అమరచిత్ర కధలు రూపంలో మన పౌరాణిక,
చారిత్రాత్మక గాధలు ఇండియా బుక్ హౌస్ సంస్థ విడుదల చేస్తున్నది.
1985లో సంస్కృతి ఇంటర్నేషనల్ శ్రీ బాపు, ముళ్ళపూడి గీసి,వ్రాసిన
రామాయణం బొమ్మల కధను ప్రచురించింది. ప్రచురుణ కర్తలు ముందు
మాటలో ఇలా అన్నారు.
" ఈ పుస్తకాన్ని ముందు ఇంగ్లీషు, ఫ్రెంచి, శ్పానిష్ భాషలలో
ప్రచురించి పదివేల కాపీలు అమెరికా, కెనడా దేశాలకు
పంపించాము. ఆమెరికాలో అఖండ విజయం పొందిన ఈ
గ్రంధం త్వరలో మరికొన్ని విదేశ భాషలలో కూడా ప్రచురించ
టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కధను విని కొంత అర్ధం
చేసుకున్న అమెరికెన్ పిల్లలు ఈ బొమ్మలు చూసి కధ
గురించి యింకా ఎక్కువ అర్ధం చేసుకున్నా మన్నారు"
శ్రీ కృష్ణలీలలు, మహా భారతం బాపు బొమ్మలు, ముళ్లపూడి వారి రచన చిన్న
పిల్లలకు చక్కగా అర్ధమయేంత అందంగా వుంటాయి. కొంచెం పెద్ద పిల్లలు
యింకా ఎంత సేపైనా చూడాలి అంటారు. ఈ పుస్తకాలు రామాయణం
లాగానే ఏ వయసుకు తగినట్లు ఆవయసుల వారికి ఉల్లాసం కలిగిస్తాయి.
No comments:
Post a Comment