Wednesday, July 21, 2010

గో గో గో !! గోమాత !!

ఆవు దూడను పూర్తిగా తాగనివ్వక దాని పాలు పూర్తిగా.
పిండుకుంటాము. మనది ఓ వేళ పాల వ్యాపారమైతే
అందులో నీళ్లు కలిపి అమ్ముకుంటాము. అన్యాయంగా
సంపాదించే వాళ్ళను "వాడు నానా గడ్డి తిని సంపాదించాడు"
అంటూ వుంటారు. ఫాలు పిండుకుంటే పిండుకున్నారు
ఆ ఆవుకు ఇంత దానాగా గడ్డి వేయరు. పాలు తిసుకున్నాక
వాటిని రోడ్డు మీదకు తోలుతారు. పాపం అవి కార్పొరేషన్
చెత్త కుండీలలోని నానా చెత్త తింటాయి. ప్లాస్టిక్ సంచుల్లో
ఉంచి పారేసిన కూరగాయల తొక్కును ఆ సంచుల్తో పాటు
నములుతాయి. ఆ ప్లాస్టిక్ అరగక వాటికి ఎన్ని జబ్బులో!
గోవును పూజించడం మన సంప్రదాయం. చెత్త కుండీ దగ్గర
ఆవు కనిపించగానే ,అక్కడ ఎంత దుర్ఘ్హంధంగా వున్నా సరే
వెళ్ళి తోకకు ఓ దండం పెడతారు. ఢిల్లీ లో సుల్తాన్పూర్ బర్డ్
సాంక్చ్యురీ దగ్గర ఎండిన చెరువులోని ఓ రకం చేప కళేబరాన్ని
తింటున్న ఓ ఆవు ఫొటోని "ఇండియా టుడే" పత్రిక ఇటీవలే
ప్రచురించింది. అంటె ఆవులు కూడా మాంసాహార జంతువులుగా
మారిఫొయేటట్లు ఛెస్తున్నామన్నమాట. అదే ఆ పై ఫొటో.
గోవు మాలచ్చిమిని నీ దేవతంటావు
పాలు తీసుకొని రోడ్డు పైకి గోగో అంటూ తోలుతుంటావు !!
మునిసిపాలిటీల నానా చెత్త తింటుంటే ఆ ఆవు
చూసి తోకకో దండమెడతావు!! నోటికో పండందించలేవు !!
ఫోటో : ఇండియా టుడే సౌజన్యంతో

1 comment:

  1. అయ్యా!

    ఆవులు ఓ దశాబ్దం పైగానే మాంసాహారులయ్యాయి. (పందులతో సహా) ఇతర జంతువుల ప్రేగులూ, జీర్ణాశయాలూ మేపడం వల్లే "మేడ్ కౌ డిసీజ్" ప్రపంచ వ్యాప్తమయిందనీ, కొన్ని వేల పశువుల్ని చంపేశారనీ చదవలేదా?

    ఆవు తోకకి కాదు--సద్ బ్రాహ్మణులు చెప్పినట్టు "ఆ యోని" పూజనీయం అని గ్రహించిన మహిళలూ, వనితలూ, గరితలూ, తోకెత్తి మరీ--వేళ్ళతో తడిమి, నెత్తిన వ్రాసుకొని, నమస్కరించడం మీరు చూడలేదేమో!

    ఇంకెక్కడి ఆవు పూజనీయత? వేలం వెఱ్ఱి కాకపోతే!

    (నా తెలుగు రాడికల్ బ్లాగులో, 'గోగ్రామ యాత్ర ' టపా చదవండి.)

    ReplyDelete