Friday, January 01, 2010

చెత్త కబుర్లు

తెలుగు బ్లాగర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .. సంవత్సరపు మొదటి రోజు ఈ చెత్త కబుర్లేంటా? అని అనుకుంటున్నారా?

ఒక్కోసారి చెత్త కబుర్లు కూడా వింటానికి బాగానే ఉంటాయి! నిజమండి!! ఏమిటీ చెత్త కబుర్లను కుంటున్నారా? ఈ నాటి సినిమాల్లోని హాస్యం చూడండి! చెత్త గా ఉండటములే! ఆ చెత్త చూసి మన జనాలు పడీ పడీ నవ్విపోటంలే! ఇల్లరికం సినిమాలో రేలంగి మామ రమణారెడ్డి తొ ఏదోలే మామయ్యా, రెండు రాత్రులుండి పోవాలని వచ్చా అంటాడు.అప్పుడు అత్తగారు అదేమిటి నాయనా,రెండు రోజులేనా? అంటుంది. అప్పుడు రేలంగి "అదే అత్తయ్యా! శివరాత్రి నుంచి సంకురాత్రి దాకా" అని అంటాడు.ఈ జోకు ఈ కాలం కుర్రవాళ్ళకు చాలామందికి అర్ధం కాకపోవచ్చు.అదే రెండర్థాల చెత్త జోకనుకోండి వెంటనే నవ్వు కుంటారు.

సరే చెత్తకబుర్లలోకి వచ్చేస్తున్నాను.నేను మా ఆవిడా దీపావళికి మా అక్కయ్య,బావ దగ్గరికి వైజాగ్ వెళ్ళాము.ఉదయాన్నే "చెత్తమ్మగారు,మీ చెత్త! చెత్త తల్లీ! చెత్త" అంటూ స్పీకర్లో కేకలు వినిపింఛాయి.ఇదేమిటి పొద్దున్నే ఇలా లౌడ్ స్పీకరెట్టుకొని మరీ తిడుతున్నాడని ఆశ్చర్యపడి లేవగానే మా మేనల్లుడు విజయభాస్కర్ "కంగారు పడకు మావయ్యా " పిలిచేది,మా వైజాగ్ కార్పొరేషన్ చెత్త కలెక్ట్ చేసే వ్యాన్ వాళ్ళు!" అన్నాడు.ఎందుకోగాని "చెత్తమ్మగారు,చెత్త తల్లి" అన్నమాటలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు నవ్వాగదు! ఇదండీ నే చెప్పాలను కున్న చెత్త కబుర్లు! మరీ చెత్తగా ఉంటే క్షమించి పారేయండి!


సురేఖ

2 comments:

  1. మీకు చెత్త అనిపించింది వేరే వారికి కాకపొవచ్చు. మంచి ఉదాహరణ, చెత్త క్లీన్ చేసేవాడికి చెత్తే ఫుడ్ పెడుతుంది.

    నాకు ఈ టపా టైటిల్ నచ్చింది.

    ReplyDelete
  2. ఈ సంవత్సరం మీరు మరింత బ్లాగుండాలని మనసారా కోరుకుంటూ...మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete