Wednesday, January 27, 2010

పద్మశ్రీలు





ఈ ఏడాది ప్రదానం చేసిన పద్మ అవార్డులు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా నిరాశాజనకంగా ఉన్నాయి.అన్యధా భావించకపోతే ప్రభుత్వం దృష్టిలో చొక్కాలు విప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేసే హీరోలే (ఈ మధ్య ఆందోళన లలో కూడా అర్ధనగ్న ప్రదర్శన కూడా ఓ ఫాషనై పోయింది) ఈ బిరుదులకు అర్హులేమో!నిన్న దిగవంతులైన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వీళ్ళ దృస్టికి రాక పొవడం మన తెలుగువాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం కాక మరేమిటి? పౌరాణిక,జానపద,సాంఘిక చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించారు. అలానె విదేశాల్లో సాంకేతికంగా పేరు ప్రఖ్యాతులు పొందిన సీతా కళ్యాణం లాంటి చిత్రాలను తీసిన బాపు రమణ గార్లను ఈ అవార్డ్లకు గుర్తించకపోవడం నిజంగా భాధాకరం.ఐనా మనం ఇలాటి విషయాల్లో స్పందించం.తెలుగు వాళ్ళు చాలా విశాల హృదయులు కదా మరి. ఏదో గుడ్డిలో మెల్ల. గాయకులు నూకలచిన సత్యనారాయణ గారికి, శొభారాజ్ గారికి ఇచ్చినందుకు సంతోషిద్దాము.

4 comments:

  1. బాపూ రమణ గార్లది "సీతా కల్యాణం" అండి

    ReplyDelete
  2. చైతూ గారూ,

    పైన అప్పారావు గారు 'సీతా కల్యాణం' అని సరీగ్గానే వ్రాశారు కదా! మీరు ఆయన వ్రాసింది సరిదిద్దున్నట్లుగా తిరిగి వ్యాఖ్యలో ఎందుకు వ్రాసినట్లు? అంత తెలివైన వాడిని కాదనుకోండి, అర్ధం అవలేదు.

    ReplyDelete
  3. సురేఖ

    చైతు గారు,
    ఒక చిన్న మాట. నేను బాపు,రమణ గార్ల చిత్రం సీతాకళ్యాణం
    అని సరిగానే వ్రాసాను. మరి మీరు అలా ఎందుకన్నారో నాకు
    తెలియలేదు.మీ అభిప్రాయం ఏమిటో తెలియజేస్తే తప్పైతే సరి
    దిద్దుకుంటానండి.

    ReplyDelete
  4. క్షమించండి. చైతూగారు నిజమే చెప్పారు. నేను ఆ తప్పును సరిదిద్దాను. పని హడావిడిలో ఈ విషయం చెప్పలేదు.

    ReplyDelete