Sunday, January 17, 2010

అలా కలిశాం

నాకు ఇవ్వాళ ఆనందకరమైన రోజు. ప్రియ (బ్లాగు) మిత్రుడు శ్రీ శివరామ ప్రసాదు గారు మా ఇంటికి వచ్చారు . ఇంతకాలం బ్లాగుద్వారా మాత్రమె పరిచయమే కాని కలుసుకున్నది లేదు. ఈ రోజు మాత్రం శివ గారు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకుని ఆయన ఆనందించారు, నాకు ఆనందాన్ని ఇచ్చారు. మేము కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియలేదు. అలాఅలా చాల సమయం గడిచిపోయి, అరె ఇంతసేపు మాట్లాడేసు కున్నామా అని ఇద్దరం కూడా ఆశ్చర్య పోయాము. నా దగ్గర ఉన్న పాత కాలపు కీ గ్రామ ఫోను చూసి అబ్బురపడి, అది తిప్పి అందులో పాట వినేంతవరకు వదలలేదు. చివరకు, ఆ గ్రామఫోను సూది వెతికి వెతికి, పదును పెట్టి, పాతకాలపు 78 RPM రికార్డు తిప్పి బాలానందం పాటలు విన్నాము. నేను ఆ రికార్డును మోగించటం తీసాము, అది ఈ కిందే ఉన్నది.

గ్రామఫోను అంటే తెలియని ఈ రోజులలో, కరెంటు అవసరం లేకుండా పూర్తీ యాంత్రిక శక్తితో (గడియారం లాగ కీ ఇస్తే పని చేస్తుంది) నడిచే ఈ వినోద పరికరం తెలియని వారు చూడటానికి ఇక్కడ ఇస్తున్నాను.

4 comments:

  1. గురువుగారూ,

    మీ ఇంటికి వచ్చి ఆనందించకుండా ఉండేవారెవరైనా ఉంటే చెప్పండి. అక్కడికి రావడం ఓ వ్యక్తపరచలేని అనుభూతి ( మాటలలో వ్రాయడం కష్టం)

    ReplyDelete
  2. మీలోనూండి నిజమైన ఆనందామృతం ప్రవహిస్తోందంటే నమ్మండి.

    ReplyDelete
  3. అప్పారావుగారూ,

    మీ ఇంటికి వచ్చి మీ అభిరుచులన్ని చూసిన ఆనందంలో ఇంకా ముణిగి ఈదులాడుతున్నాను. మీకు ఎంత ఓపిక అండి అప్పారావుగారూ. ఎన్ని విషయాలు, ఎన్నెన్ని చిత్రాలు మీదగ్గర. ఒక స్టాంపులేనా, స్క్రాపు పుస్తకాలేనా, పురాతన వస్తువుల సేకరణేనా, కాయిన్ల సేకరణ ఇంకా ఎన్ని ఎన్నెన్ని. కళ్ళు తిరిగిపోయాయంటే నమ్మండి. అన్నిటికి మించి పాత చందమామలు హై లైటు.

    మీ సేకరణలు మీ అభిరుచులూ కలకాలం హాయిగా గడవాలని కోరుకుంతున్నాను.

    ReplyDelete
  4. జవాబు:

    ప్రియ మితృలు శ్రీయుతులు శివరామప్రసాద్,ఫణి బాబు గారూ,
    ఇదంతా మీ అభిమానమే.మీ లాంటి అభిరుచులున్న మితృలను
    పొందినందుకు అదృష్టవొంతుణ్ని. ..సురేఖ..

    ReplyDelete