Monday, November 15, 2010

కూరలకు కోరలొచ్చాయి !!


కన్నీళ్ళు తిరుగుతున్నాయి ; ఉల్లినే కాదు ఏ కూర తరిగినా!
జేబులో డబ్బులూ తరుగుతున్నాయి !!
వెజిట "బుల్స్" కు కొమ్ములొచ్చి జనాన్ని కుమ్ముతున్నాయి !!
ధరల కోరలు పెంచి నాన్ వెజులుగా మారి జనాల్ని కొరొక్కుతింటున్నాయి !!

వానల్లు కురవాల, వరి చేలు పండాల అని పాడుకొనేవారు. కానీ
ఇప్పుడు వానలు తెగ కురిసి వరిచేల్లు , కూరల మడులు తమతో బాటు
తమ రైతుల్నీ ముంచేశాయి. ఇక కూరలకు కోరలొచ్చి వండకుండానే,
(కొన్ని చోట్ల గాస్ కూ కొరత వుందని వాటికీ తెలిసింది కాబోలు) మండి
పోతున్నాయి. విస్తారంగా పంటలు కూరగాయలు పండే మా తూ.గో లోనే
ఇలా వుంటే మరి ఇతర చొట్ల ఎంత కూరగాయాలు చేస్తున్నాయో మరి!!

5 comments:

  1. రైతు బజారు లో కిలో ఇరవై రూపాయలు ఉన్నాయ్
    బైట కొంటె ముప్పై నలభై ఉంటున్నాయ్ HYD LO

    ReplyDelete
  2. బొమ్మలోను, టైటిల్ లో మొత్తం చెప్పేసారుగా!! బాగుందండి!

    ReplyDelete
  3. కూరలు తరుముతున్నా కూర్చుని కవిత వ్రాసి మెప్పు పొందుతున్నారంటే
    ధరలుపెరిగినా కూరలు మీకు లాభంచేకూరుస్తున్నాయండి బాబూ!.....
    పెరగనీయండి...యివ్వాళ నలభై కూర రేపు ఎనభైదాకా ఎదిగి ఆ
    మరునాడు ఓ రూపాయి తగ్గి డెబ్భైతొమ్మిదయితే కూరలు చవకైపోయాయని
    చంకలుగుద్దుకొనే అల్పసంతోషులం మనం. పెరిగిన ధరలకు....అంతగా
    అలవాటుపడిపోతాం.

    ReplyDelete
  4. బాగుంది సార్..! క్రింది లింక్ కి వెళ్లి కార్టూన్ చూడండి...!!!
    http://2.bp.blogspot.com/_ULlNyV4vetY/S81B7Ad6d_I/AAAAAAAACzE/C2U2lYtZ_xI/s1600/ATT1860112121112.jpg

    ReplyDelete
  5. రాధేశ్యాం గారు, ధన్యవాదాలండి.ఆ కార్టూన్ శ్రీ అజిత్ నైనాన్,
    టైమ్స్ ఆఫ్ ఇండియా లోనిది అనుకుంటాను.

    ReplyDelete