Monday, February 14, 2011

అంపైరింగ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన మా శాస్త్రి



ఈ రోజు ఉదయాన్నే మా తూగో ఈనాడు చూడగానే మా బ్యాంకు కొలీగ్
బి.వి.యస్.యల్.ఎన్.శాస్త్రి ఫొటో, ఆర్టికల్ చూడగానే, మన
శాస్త్రి బీసీసీఐ అంపైర్ గా పనిచేసిన విషయం గుర్తుకొచ్చింది. ప్రతి సారి
మేము కలుసుకున్నప్పుడు రెటైరయిన మే మిద్దరం ఆ విషయం మాట్లాడు
కోలెదు. ఏ మంటే నాకు క్రికెట్ అంటే ఏ మాత్రం అభిరుచి లేక పోవడం ఒక
కారణం. బ్యాంకులో ట్రాన్సిస్టర్ రేడియోలు చెవిదగ్గర్ పెట్టుకొని,( ఆ రోజుల్లో
ఇంకా టీవీలు బాగా ప్రాచూర్యంలోకి రాలేదు.) ఔట్ అయినప్పుడల్లా పెద్దగా
కేకలు పెడుతుంటే నాకు చాలా చిరాకుగా వుండేది.
శాస్త్రి గారి తో నా మొదటి పరిచయం 1972 లో అమలాపురంలో. 197 2
లో నన్ను ఆఫీసరుగా ప్రమోట్ చేసి అమలాపురం రాజమండ్రి మెయిన్
బ్రాంచినుంచి పోస్ట్ చేశారు. అమలాపురం లో శాస్త్రి రూము లో వుండేవారు.
నేను ఆయనతో బాటు ఆయన రూములో వుండేవాడిని. శాస్త్రి క్రికెట్ బాట్
తోనే కాదు గరిట తిప్పడంలోనూ చాలా ప్రావీణ్యం వుందని అప్పుడే తెలిసింది.
ఉదయాన్నే షడ్రుచులతో వంట చేసేవారు. నాకు ఆయన అలా వండి పెడుతుంటె
కూర్చుని తినడానికి చాలా ఇబ్బందిగా వుండేది. ఆయన బ్యాంకులో కూడా
చాలా బాగా పనిచేసే వారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు బయలు
దేరేబస్సులో రాజమండ్రి వచ్చేవాళ్ళం. శాస్త్రి నాన్నగారు కూడా మానాన్నగారికి
అదే స్టేట్ బ్యాంకులో కొలీగ్. అలా మేమిద్దరం రెటైరైన మా తల్లిదండ్రుల దగ్గర
శని ఆదివారాలు గడిపేవాళ్ళం. అప్పటికి ఆయన బ్రహ్మచారి. అటుతరువాత
73 లో తిరిగి రాజమండ్రి ఇన్నీస్పేట బ్రాంచికి ట్రాన్స్ఫరు అయ్యాను.శాస్త్రి హైద్రాబాద్
కు ట్రాన్స్ఫరు అయ్యారు. 1983 లో బిసీసీఐ రంజీ పానల్ కోసం అఖిలభారత
స్థాయిలో నిర్వహించిన పరీక్షలలో శాస్త్రి విజయంసాధించి దేశవ్యాప్తంగా బిసీసీఐ
నిర్వహించిన మ్యాచ్ లలో అంపైర్ గా చేశారు. అలానే బాంబే, బరోడా మాచ్లో
ఆయన ( ఆ మాచ్ లో బాంబే తరఫున సునీల్ గవాస్కర్,వెంగ్ సర్కార్ ఆడారు.
బరోడా వైపు రాజ్ కులకర్ణి ,గైక్వాడ్, కిరణ్మోడే ఆడారు) అంపైర్ గా పనిచేశారు..
ఇలా మన తెలుగు వాడు, మా స్టేట్ బ్యాంక్ ఉద్యోగి, పైగా అతను నా ఆప్త మితృడు
కావడం నాకు ఎంతో సంతోషంగా వుంది. వేలంటైన్ రోజున ( ప్రేమికులంటే ,క్రికెట్,
పుస్తక, సంగీతం లాంటి కళల ప్రేమికులు కూడా కాకూడదా!) మా శాస్త్రి ప్రతిభను
గుర్తు చేసిన "ఈనాడు" ను అభినందిస్తూ శ్రీ శాస్త్రికి మన బ్లాగర్లందరీ తరఫున
శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. అనుకోకుండా ఈ రోజు మాఇంటికి వచ్చిన
శాస్త్రితో గత స్మృతులను నెమరు వేసుకున్నాం.

1 comment:

  1. చాలా బావుంది సార్. థాంక్ యూ. శాస్త్రి అంకుల్, మా నాన్నగారికి ( వేదుల వెంకట రామం (వి.వి.రామం)) చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ స్టేట్ బాంక్ లోనే పని చేసేవారు. మేము వైజాగ్ లో ఉన్నప్పుడు ప్రసాదరావ్ అంకుల్ (ఆయన మీకు బావగారు అవుతారని నాన్నగారు ఇప్పుడే చెప్పారు) వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉండేవారు. మాకు ఫామిలీ ఫ్రెండ్స్. ఇది చదివిన వెంటనే డేడీకి ఫోన్ చేసి చెప్పాను, చాలా సంతోషించారు. మీ అందరినీ అడిగానని చెప్పమన్నారు.

    ReplyDelete