Tuesday, March 29, 2011

కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి పట్టపురాణి


డి.కె.పట్టమ్మాల్ సంగీతం విన్న జర్మనీ దేశపు వనిత " మీ భాష నాకు
తెలియకపోయినా మీ సంగీతం నన్ను ఎదేదో కొత్త అనుభూతులను కలుగ
జేసింది." అని అన్నదంటే చాలు ఆమె సంగీతంలో ఎంతటి ప్రతిభావంతురాలో
అని తెలుసుకోడానికి! 1919 సంవత్సరం మార్చి 28న తమిళనాడు
కాంచీపురంలో జన్మించిన పట్టమ్మాల్ పూర్తి పేరు దామల్ కృష్ణస్వామి
పట్టమ్మాల్. ఐదేళ్ల వయసుకే ఆమె తన తండ్రి కృష్ణ స్వామి దీక్షితార్
వద్ద ఎన్నో వందల శ్లోకాలను నేర్చుకొని అప్పజెప్పగలిగేది. ఆ కాలంలో
స్త్రీలు, అందునా ఉన్నత వర్గాలలోని వారు బయటి మగవారితో మాట్లాడ
కూడదనీ, పాటలు పాడటం లాంటివి చేయకూడదనే ఆంక్షలుండేవి.
హిందూ పత్రికలో వచ్చిన వార్త ద్వారా ఆమెఖ్యాతిని విన్న కొలంబియా సంస్థ
ఆమెపాటలను రికార్డులుగా విడుదల చేయటానికి అనుమతిని కోరారు. బయట
ప్రపంచకానికి అలా పాటలు వినిపిస్తే అమ్మాయికి పెళ్ళి కాదేమో నని ఆమె
తండ్రి ఒప్పుకోకపోతే శ్రీనివాసన్ అనే కాంగ్రెస్ నాయకుడు, మీ అమ్మాయికి
పెళ్ళీడు వచ్చినప్పుడు నామేనల్లుడికిచ్చి వివాహం చేస్తానని హామీ ఇచ్చాడు.
తరువాత అన్నట్లుగానే 1939లో ఆయన మేనల్లుడు శ్రీనివాసన్ తో ఆమెకు
వివాహం జరిగింది. సంగీత కళారంగాలకు నిలయమైన మద్రాసు నగరానికి
పట్టమ్మాల్ కుటుంబం మకాం మార్చారు. మద్రాసుకు వెళ్ళాక ఆమెకు
ఎందరో సంగీత నిష్టాతులతొ పరిచయం ఏర్పడి సంగీత కచేరిలు చేసి సాధన
చేశారు. ప్రజల్లో పట్టమ్మాల్ గాన మాధుర్యం పై పెరిగిన విశేష ఆదరణను
గమనించిన రికార్డు కంపెనీలు, రేడియో కేంద్రాలు లాభాలు పొందాయి. .
సినిమారంగంలో తొలి నేపధ్య కర్ణాటక గానం చేసిన గాయనిలలో ఆమె
ఒకరు. ఫూర్వం మద్రాసు సంగీత ఎకాడమీలో పురుషులకే ప్రాధాన్యత
వుండేది ఎమ్మెస్.సుబ్బులక్ష్మి, డికే.పట్టమ్మాల్, యంయల్.వసంతకుమారిల
గాన త్రయం పేరుగాంచాక అకాడమీ వారు వీరిని కచేరీలకు ఆహ్వానించడం
మొదలుపెట్టారు.1970 పట్టమ్మాల్ ను "సంగీత కళానిధి"బిరుదుతో సత్కరించింది.
ఎందరో వాగ్గేయకారుల కీర్తనలను ఆమె తన బాణీకి అనువుగా మార్చుకున్నారు.
భారతదేశం తరఫున ఆమె, బెర్లిన్, బాన్ నగరాలు,ప్రాన్స్ ,స్విజర్లాండు, కెనడా,
యుఎసేఏ పర్యటించారు. ఆమెకు పద్మభూషణ్, గాన సరస్వతి, పద్మవిభూషణ్
మొదలైన సత్కారాలు అందాయి మన దేశానికి , ముఖ్యంగా మన దక్షిణ భారత
దేశానికి కర్ణాటక సంగీతానికి గుర్తింపు తెచ్చిన గాయనీ మణుల్లో పట్టమ్మాల్ ఒకరు.

2 comments:

  1. ఎందరో మహానుభావులు.. అందునా...ఆఆఆఆఆఆఆఆ.. శ్రీమతి పట్టమ్మాళ్ గారు ఒకరు. కర్నాటక సంగీతత్రయంలో ఒకరిని గుర్తుచేసినందులకు ధన్యవాదాలు!

    ReplyDelete
  2. ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ప్రముఖ స్థానంలో ఉన్న గాయని నిత్యశ్రీ మహదేవన్ - పట్టమ్మాళ్ గారి మనవరాలేనన్న విషయంకూడా వ్యాసంలో చేరిస్తే బాగుండేదేమో.

    ReplyDelete