Thursday, May 05, 2011

స్మృతి కవిత లో నా కవిత


శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి స్మృతి కవిత పేరిట ఎం.ఎస్.సుబ్బులక్ష్మీ
ఫౌండేషన్ ( MSSF ) వారు కవితలను పుస్తక రూపంలో నవంబరు
2006 లో ప్రచురించారు.ఆ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి డక్టర్ ఎ.పి.జె
అబ్దుల్ కలాం, లకుమ, డాక్టర్ బూసురపల్లి వెంకటేశ్వర్లు, శ్రీమతి
నన్నపనేని రాజకుమారి, డాక్టర్ చిల్లర భవానీదేవి, కానూరి
వెంకటేశ్వర్లు, ఏ.వి.యస్ (సినీ నటుడు ), ఈతకోట సుబ్బారావు,
మొహమ్మద్ ఖాదర్ ఖాన్, డాక్టర్ ఎల్.కె.సుధాకర్,ఇ.రఘు,తనికెళ్ళ
భరణి (ప్రముఖ నటుడు, రచయిత) ,డాక్టర్ శిఖామణి గార్ల కవితల
మధ్య నా కవిత ప్రచురించబడింది !!
అప్పుడప్పుడు స్థానిక దినపత్రిక "సమాచారం" లో ప్రతి ఆదివారం
సురేఖార్ట్యూన్లు పేర నేను వ్రాసిన కవితల్లోనుంచి ఎన్నుకొని నాకూ
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లాంటి మహనీయురాలి స్మృతి కవితలో చోటు
ఇచ్చినందుకు ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.
అమరగాన సరస్వతి
గాన సరస్వతి
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి !
నేడు అమృతం సేవించే దేవతలకు
గానామృతం పంచుతున్నది !!
గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగిలోని తారల తళకులు మసకబారాయి !!
నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది !!

2 comments:

  1. సంతోషం. అభినందనలు.

    ReplyDelete
  2. చాలా సంతోషం సార్..!! కంగ్రాట్స్ ..!! మీ కవిత చాలా బాగుంది.
    మా మేనత్త డా. ఆర్. సుమన్ లత గారు సంగీత కళానిధి శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మీద వ్రాసిన కవిత నా బ్లాగ్ లో ఇంతకు ముందు ప్రచురించాను. దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను. వీలయితే చూడండి.
    http://radhemadhavi.blogspot.com/2010/10/blog-post_10.html

    ReplyDelete