Saturday, November 05, 2011

గొల్లలమామిడాడలో అద్దాల రాముడు !!


తూర్పుగోదావరి జిల్లాలో గల గొల్లలమామిడాడ అనే ఊర్లో 1889 లో
శ్రీ సీతామహాలక్ష్మి, శ్రీరామచంద్రమూర్తి అనే చిన్న కోవెలలను ద్వారపూడి
వంశస్థులు నిర్మాణం చేశారు. అటుతరువాత ఆలయానికి తూర్పు వైపున
160 అడుగుల ఎత్తు గోపురం, ఆ తరువాత పశ్చిమాన 200 అడుగుల
ఎత్తుగల గోపురం 1969లో నిర్మించబడింది. సిమెంటు స్లాబులతొ తొమ్మిది
అంతస్తులతో చక్కని శిల్పాలతో నిర్మించిన ప్రతి అంతస్థుకు బాల్కనీతో
మెట్లద్వారా పైకి వెళ్ళగలిగే సౌకర్యంతొ నిర్మించబడింది.
గోపురం పైన సిమెంటుతో తయారుచేసిన దేవతామూర్తుల శిల్పాలు
కనులవిందు కలిగిస్తాయి.


శ్రీ కోదండరామచంద్రమూర్తిని దర్శించుకోడానికి వచ్చిన భక్తులు స్నానం
చేయడానికి, స్వామివారి వసంతోత్సవ సమయాన చక్రస్నానమునకు,
క్షీరాబ్దిద్వాదశినాడు తెప్పోత్సవం జరపడానికి శ్రీరామ పుష్కరిణి నిర్మాణం
జరిగింది
ఇక ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ స్వామివారి అద్దాలమేడ. ! ఇందులో
పెద్దహాలులో వివిధ కోణాలలో అమర్చిన అద్దాల ద్వారా శ్రీరామ పట్టాభిషేక
శిల్పాలు వివిధ దృశ్యాలుగా అగుపిస్తాయి. ఒక చోట నిలబడిన హనుమ
కనిపిస్తే మరో కోణంలో కూర్చున్న హనుమ అగుపిస్తారు. ఈ అనుభూతిని
ప్రత్యక్షంగా చూసి ఆనందించాలేగని వివరించలేము. ఈసారి మీరు అవకాశం
దొరికినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శింఛండి.

6 comments:

  1. నెలకి ఒకసారయినా వెళ్ళి వచ్చేదానినండీ! ఎంత బాగుంటుందో! అసలు మన రాజమహేంద్రవరం చుట్టూ ఎన్ని పుణ్యక్షేత్రాలున్నాయో కదా! కోనసీమలో పుట్టడం నిజంగా ఒక వరమే అనిపిస్తుంది నాకు మాత్రం!

    ReplyDelete
  2. anduke enchukuni maree rajamahendra varaniki vachi settle ayaanu. gollamamidala gurinchi telipinanduku dhanyavadalandi.

    ReplyDelete
  3. గొల్లల మామిడాడ శ్రీరామ ఆలయం లొ రామనవమికి ఈ ఏడాది వెళ్ళాను. అక్కడ , ఎక్కడ లేని జనం వచ్చారు , అన్నదానం చేసి పద్ధతి చూసి , నా మనస్సు కలుక్కు మంది , సాంబార్ సిమెంట్ గోళాలు కట్టి , దాని నిండా పోసారు ?? పశువులకి దానా పెట్టినట్లు, సాంబార్ నిలువ ఉంచడానికి సిమెంట్ గోళాలు వాడడం వాడతారా , తప్పుకదా ?? ఆరోగ్య రీత్యా మంచిది కాదు , ఇకముందు ఆలయ కమిటి వారు బుర్ర వాడితే మంచిది ??

    ReplyDelete
  4. andhra lo public ki chala varaku awareness, community training ivvalsina avasaram undi entainaa

    ReplyDelete
  5. mari Ramalayam gurinchi chepparu kaani Suryanarayana swamy vari temple gurinchi cheppaledu, endukani. EE roju ETV lo cover chesaru. Chala bagundi. Can anybody tell the route from Rajahmundry.

    ReplyDelete