Friday, November 11, 2011

శివనామాలు- ఈనాటి తారీఖు !!




శివనామాలు మీకు తెలుసుగదా! ఈ మాసం అంతా శివనామ స్తోత్రాలతో
భక్తులు పరవశిస్తారు. ఈ రోజు ప్రత్యేకత ఏమంటే , ఈ రోజు తేదీని చూశారుగా!
11౦11౦11 . ఈ తారీఖు అంకెలను నిలువుగా త్రిప్పి చూడండి. శివనామాలుగా
అ(క)నిపిస్తాయి !




ఇలా తారీఖుల తమాషా గతనెలలోనూ జరిగింది. అదే 9-10-11 .
ఆ రోజునాటికి నేను విశాఖపట్నం లోవున్నాను. నేను వస్తున్నట్లు
కార్టూనిష్టు మితృలు శ్రీ పుక్కెళ్ళ రామకృష్ణ గారికి తెలియజేస్తే ఆయన
నన్ను కలిసి ఆయన గ్రాఫిక్స్ లో తయారు చేసిన నా బొమ్మను కానుకగా
అందజేశారు. ఈ రోజు 11-11-11 న ఆయన రాజమండ్రికి మా ఇంటికి
సతీసమేతంగా రావలిసి వున్నా అనుకోని పని వత్తిడి వల్ల రాలేకపోతున్నట్లు
చెప్పారు. ఈ రోజు మేము కలిసి వుంటే మరో విశేషంగా వుండేది.

1 comment:

  1. సురేఖ గారు, నమస్కారములు.

    11-11-11 నాటికి రాజమండ్రి రావాలనే అంతా సిద్దం చేసుకున్నాం. అనివార్యకారణాల వలన చివరి రోజున కాన్సిల్ చేసుకోవలసి వచ్చింది. తొందర్లోనే మిమ్మల్ని కలుసుకుంటాం.

    నా గురించి మీ బ్లాగ్ లో చర్చించినందుకు ధన్యవాదములు.
    ~ రామకృష్ణ పుక్కల్ల

    ReplyDelete