Tuesday, September 21, 2010

గురజాడ వెంకట అప్పారావుగారి 149వ జయంతి





దేశమును ప్రేమించుమన్నా-మంచి అన్నది పెంచుమన్నా
వట్టిమాటలు కట్టి పెట్టోయ్-గట్టిమేల్ తలపెట్టవోయి !
తిండి కలిగితె కండ కలదోయ్ -కండకల వాడేను మనిషోయి !
ఈసురోమని మనుషులుంటే-దేశమేగతి బాగుపడునోయి
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ !!
ఇంతటి మంచి ప్రొబోధ గీతాన్ని అందించిన మహరచయిత
శ్రీ గురజాడ 149వ జయంతి ఈ రోజే! ఆయన కలం నుండి
జాలువారిన ప్రసిద్ధ నాటిక కన్యాశుల్కం, పూర్ణమ్మ కధలు
విశేష ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. శ్రీ గురజాడకు
అంజలి ఘటిస్తూ., "కన్యాశుల్కం" చిత్రంలోని రెండు ఫొటోలు
మీకోసం. ఈ చిత్రంలో మధురవాణి పాత్ర మహానటి సావిత్రి
అత్యంత అద్భుతంగా నటించింది.

1 comment:

  1. మహోన్నత వ్యక్తి. కన్యాశుల్కం ను మాత్రమే నేను రెండు సార్లు వరసగా చదివాను , ఇంకే పుస్తకానికి చివరి పేజీ పూర్తి చేసి మళ్ళీ మొదటి పేజీ కి రాలేదు. అంత ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని కలిగించిన నవల అది. గురజాడ వారు పుట్టిన విజనగరంలో నేనూ పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇంటిని గ్రంధాలయంగా చేసారు. ఆ గ్రంధాలయంలో కూర్చుని ఆయన స్మృతులను అనుభవించే భాగ్యం దక్కింది నాకు. ఆ మహానుభావుడికి ఇవే నా జోహార్లు!

    ReplyDelete