ఆరోగ్యము దీర్ఘాయువు - 1938 నాటి తెలుగు పుస్తకం
ఇక్కడ చూస్తున్న పుస్తకం " ఆరోగ్యము-దీర్ఘాయువు" అన్న
పుస్తకము. ఈ పుస్తకం 1938 సంవత్సరంలో ఏ.సి.సెల్మన్,
యం.డి చే రచింపబడింది. ఇందులో సాధారమైన వ్యాధుల
కారణాలను, వాటినుంచి తప్పించుకొనే ఉపాయాలను, వాటి
నివారణ చేయు విధముల గూర్చి సులభశైలి వ్రాయబడిన
యొక గ్రంధము. ఇలానే పుస్తకం మొదటి పేజీ లో వ్రాసారు!
ఓరియంటల్ వాచ్మెన్ పబ్లిషింగ్ హౌస్, సాలిస్బరీ పార్క్,పూనా
ఇండియా వారిచే ప్రచురించబడింది!
మొదటి ఎడిషన్ 1927 లో 3,000 కాపీలు, రెండవ
ఎడిషన్ జూలై 8, 1931 లో 2,ooo కాపీలు, మూడవ ఎడిషన్
( ఇప్పుడు మా ఇంట్లో వున్న పుస్తకం) సెప్టెంబరు, 15, 1938 లో
3000 కాపీలు ప్రీంటు చేశరాని రెండో పేజీలో వ్రాసారు. 73 ఏళ్ళ
నాటి ఆ పుస్తకంఆ నాడు ఈ నాటి ఆధునిక ముద్రణా సాధనాలు ,
సాంకేతిక సౌకర్యాలు లేక పోయినా అందమైన క్యాలికో బైండుతో
చక్కని పేపరుతో కొత్త పుస్తకంలా వుంది. అంతే కాదు, రంగులలో
మనుష్యాకృతి యొక్క వివరణ అన్న బొమ్మ రంగులలో వేయడమే
కాకుండా శరీర భాగాలను ఒక దాని కింద ఒకటి ఎలా లోపల
వుంటాయొ కాగితంతో వివిధ పొరలుగా చూపించడం నిజంగా ఓ వింత !!
ఈ నాడు అలామన సైన్సు పుస్తకాలు అచ్చువేయగలిగే వాళ్ళెవరైనా
వున్నారా? ఆ పేజీని మీరు ఇక్కడ చూడొచ్చు!
No comments:
Post a Comment