ఎన్నిసార్లు ముళ్లపూడి వెంకట రమణగారి మాటల నవ్వులాటలు చదివినా
తలపుకు వచ్చినా తనివితీరదు ! మరో సారి ఆయన మాటల చమత్కారాల
విందును ఆస్వాదిద్దాం!
ఆరుద్రగారు ఒక సారి ముళ్ళపూడివారితో "నేను సిగరెట్లు తాగడం
మానేశాను తెలుసాండి !" అన్నారు దర్పంగా.
"అదేం గొప్ప ! నేను అలా చాలా సార్లు మానేశాను" అన్నారు బుడుగు
రమణగారు.
<><><><><><><><><><><>
ఒకాయన ముళ్లపూడి వారి వద్దకు వచ్చాడు. ఆ మాటా ఈ మాటా
మాట్లాడుతూ " మద్రాసులో ఎక్కువ అరవవాళ్ళే వుంటారు కదా ?
వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా?" అన్నాడు.
రమణగారు ఆయనకు తన మార్కు జవాబిచ్చారు.
"ఏముందీ ? మీరు పేపరు కొని చదువుతుంటే, మధ్యలో ఆ
పేపర్ ఎవరు తీసుకుంటారో వాడే తెలుగువాడు!"
"ఋణానందలహరి" లోఅప్పారావు ఆకారం గురించి రమణాగారి వర్ణన:
అప్పారావు కొత్త రూపాయి నోటులా ఫెళఫెళ లాడుతూ ఉంటాడు.
కాల దోషం పట్టిన దస్తావేజులాంటి మాసిన గుడ్డలూ, బడి పంతులు
గారి చేబదుళ్ళలా (ఆ రోజుల్లో మాష్టార్లకు సరిగా జీతాలొచ్చేవు కావు)
చిందర వందరగా వుండే జుట్టూ, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా
మెరిసే పత్తికాయల్లాంటి కళ్ళూ, అప్పులివ్వగల వారందర్నీ చేపల్లా
ఆకర్షించగల యెదలాంటి చురుకైన చూపులూ- అతను బాకీల వాళ్ళకి
కోపిష్టి వాళ్ళ జవాబులా టూకీగా వుంటాడు.
ఇక ఆయన చెప్పిన అప్పుపమానాలు :)
"అప్పులు తీర్చేసిన వాడి మనసులా"
"అప్పుచేసిన డబ్బులా హడావిడిగా ఖర్చయి పోయింది"
అప్పు పై సూక్తులు :
" ఏ జేబులో ఏ అప్పుందో "
"లైఫే ఓ పెద్ద ట్రిక్కు-జీవితమే ఓ పెద్ద అప్పు"
"అడగ్గానే అప్పుదొరకా"
ఆయన డైలాగులు వ్రాసిన "ముత్యాలముగ్గు" ( రావు గోపాలరావు
డైలాగుల 45RPM రికార్డులు ఆ రోజుల్లో మొదటిసారిగా ఆంధ్ర
ప్రదేశ్ లో 10,000 అమ్ముడయ్యి రికార్డూ సృష్టించాయి! ముళ్ళపూడి
" హాల్లో నవ్వినంత మాత్రాన మంచి కామెడీ అని చెప్పలేం" అన్నతన
వ్యాసంలో ఇలా అంటారు.
" ఒక హాస్య సంఘటన బాగా రూపొందించాం అని ఎప్పుడు
అనిపిస్తుందంటే దాన్ని శ్రోత విని, మనసులో పెట్టుకొని
దాన్ని "రిపీట్" చేస్తే , అది హాస్యాన్ని ఉన్నత శిఖరాలకు
తీసుకు వెళ్ళినట్లు"
మరి కొన్ని రేపో ఎల్లుండో చెప్పుకుందామా మరి !!
రేపో ఎల్లుండో ఎందుకు, ఇవ్వాళే చెప్పెయ్యండి.
ReplyDeleteబాగుందండి. ఆ మాటల మూటలన్నీ అందరికీ పంచుతున్నందుకు ధన్యవాదాలు.
ReplyDeletebagunnayi...
ReplyDeleteచాలా బావుందండీ....మనసుకి హాయిగా ఉంది. మిగతావి ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నా!
ReplyDeleteమీ అందరికీ ఇంత నచ్చినందుకు ముళ్లపూడివారి జోకు చదివినంతా, బాపుగారి బొమ్మ చూసినంత సంతోషంగా
ReplyDeleteవుంది. మీ అందరికీ నవ్వోదయాలు!!