Thursday, August 18, 2011

కెమెరా కధ



సరిగ్గా 123 ఏళ్ళక్రితం జార్జి ఈస్ట్మన్ తను సృష్టించిన కోడక్ కమేరాను మొట్తమొదటి
సారిగా జనాలకు పరిచయం చేశాడు. ఈ నాడు ఫిల్మ్ అవసరంలేని డిజిటల్ కమేరాలను,
సెల్ ఫోను కమేరాలను ఉపయోగిస్తున్నాం కాని ఆరోజుల్లో (1888)లో కమేరాలో లోడ్
చేసిన ఫిల్మ్ తోనే కమేరాలు వచ్చేవి. వాటితో ఓ వంద వరకు ఫొటోలను తీసుకొనే సదు
పాయం వుండేది. వంద ఫొటోలు తీసిన తరువాత కంపెనీకి కమెరాను పంపిస్తే తిరిగి
ఫిల్మ్ లోడ్ చేసి ఇచ్చేవారు. అటు తరువాట రోల్ ఫిల్ములు వచ్చాయి.
1900 సంవత్సరంలో ఈస్ట్మన్ బ్రౌనీ బాక్స్ కమేరాను విడుదలచేశాడు. 1950 లో మా
నాన్నగారు కొన్న బ్రౌనీ కోడక్ బాక్స్ కమెరా ఇప్పుడు నాదగ్గర గుర్తుగా వుంది..
ఆగ్ఫా,కనాన్ మొII లైన కంపెనీలు రకరకాల కమేరాలను విడుదలచేశాయి రోల్ ఫిలిమ్
కనొక్కోక ముందు గ్లాస్ ప్లేట్స్లను ఫొటోలు తీయడానికి ఉపయోగించేవారు. మా రోజుల్లో
స్కూలు గ్రూప్ ఫొటో తీసుకోవడం అదో పెద్ద తతంగంలా వుండేది. సాయంత్రం వెలుగు తగ్గే
లోపలే తీయాల్సి వచ్చేది. స్టాండ్ మీద ఓ పెద్ద పెట్టెలా వుండే కమెరా పెట్టి ఫొటోగ్రాఫర్
కమెరా లెన్సు బయటకు వుంచి , కమెరాకు నల్లని గుడ్డ కప్పిఅందులో దూరి నానా
తంటాలు పడుతూ ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు అంతా మారిపోయింది


ఫిల్ము బదులు చిప్స్ వచ్చాయి. మనము తీసిన ఫొటోలు ఎలా వచ్చాయో అప్పుడే
ఆ క్షణంలోనే చూడొచ్చు. నచ్చనివి చెరిపేసుకోవచ్చు. ఫిల్మ్ తో తీసినప్పుడు స్టూడియోకు
వెళ్ళి డెవలప్ చేసుకోవలసి వచ్చేది.ఇక చీకట్లో తీయడానికి పూర్వం రోజుల్లో ఫ్లాష్ పెద్ద
అల్యూమినియం డోమ్ తో వుండేది. ఫొటో తీసిన ప్రతిసారి బల్బును మార్చాల్సి
వచ్చేది. ఒక ఫొటో తరువాత ఆ బల్బు పనిచేయదు. ఎడిసన్ మూవీ కమెరాను
కనుగొనడానికి ముందు 1895లో LUMIERE BROTHERS మొదటి మూవీ
కమెరాను తయారు చేశారు. ఇప్పుడు అతి చిన్న వీడియో కమెరాలు, డిజిటల్
కమేరాలు వచ్చేశాయ్.ఇప్పుడు ప్రతిదీ అతి సులువుగా మారిపోయింది !

2 comments:

  1. అప్పరావు గారూ !

    కెమెరా ప్రస్థానాన్ని చక్కగా వివరించారు. బాక్స్ కెమెరా, ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా ( 120ఎం‌ఎం ), గ్రూప్ ఫోటోలకు వాడే పెద్ద లెన్స్ కెమెరా ( అది మాత్రం ఇంకా నా దగ్గర వుంది )లాంటి దాదాపు అన్నీ రకాల కెమెరాలతో బాటు ఇప్పటి డిజిటల్ కెమెరాల వరకూ వాడిన నాకు ఒక్కసారి గతవైభవాన్ని కళ్ల ముందు వుంచారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. కెమెరా ప్రస్థానాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

    ReplyDelete