తీయనిదీ, విడతీయనిదీ స్నేహం !
ఆ స్నేహానికి ఏడాదికి ఒక రోజా ? !
బంధాలతో ఏర్పడేది బంధుత్వాల అనుబంధం !!
కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహం!!
( నా సురేఖార్ట్యూన్ల నుంచి)
మనకు బంధువులను ఎంచుకొనే అవకాశం లేదు, కాని మనకు
స్నేహితుల్ని ఎంచుకొనే అవాకాశం వుందని ఇంగ్లీషులో ఓ సామెత.
సృష్టిలో అన్నింటికన్నాతీయనిది స్నేహమని చెబుతారు. అలాటి
స్నేహం గుర్తుకు తెచ్చే జంటలు నాగిరెడ్డి-చక్రపాణి, బాపు-రమణలు!
ప్రతి సంధర్భానికి ఏడాదికి ఒకరోజును నిర్ణయించడం ఈ రోజుల్లో అదో
ఆనవాయితీగా మారింది. అసలు స్నేహానికి ఒక రోజేమిటి? ప్రతి రోజూ
మన స్నేహితులతో గడిపిన ప్రతి క్షణం పండుగే, వేడుకే! మనకు మంచి
సలహాలనిచ్చేది , ఇబ్బందుల్లో ధైర్యాన్ని ఇచ్చేది స్నేహితులే! ఇప్పుడు
రిటైరై బ్లాగు రాయటం మొదలు పెట్టాక ఎందరొ కొత స్నేహితులు
కలిశారు
. కొందరు నాపై అభిమానంతొ మా యింటికి వచ్చి కలిశారు.
. మరికొందరు మైల్స్ ద్వారా దగ్గరయ్యారు.
. శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్, భమిడిపాటి ఫణిబాబు, విజయ
వర్ధన్, శ్రీమతి వల్లబోజు జ్యోతి, రాధేశ్యాం, హిండూ కార్టూనిస్ట్ సురేంద్ర,
సుధామ, కర్లపాలెం హనుమంతరావు, చందమామ సంపాదకులు రాజ
శేఖర రాజు, శిష్ట్లా రామచంద్ర రావు ఇలా ఎందరో మహానుభావులు.
బాపు రమణలు నన్నూ ఓ స్నేహితుడిగా గుర్తించారంటే అంతకంటే
అదృష్టమేముంది చెప్పండి.నిన్ననే USA నుంచి వచ్చిన వర్మ అల్లూరి
శ్రీ ఫణిబాబుగారి ద్వారా నా ఎడ్రెస్ కనుక్కొని మా యింటికి వచ్చారు.
ఫ్రెండ్షిప్ డేకి ఒకరోజు ముందర ఆయన రావటం నిజంగా కాకతాళీయమే!
"Animals are such agreeable friends-they ask no
questions, they pass no criticisms- George Eliot
చివరిగా మితృలందరికీ ఫ్రెండ్షిప్డే శుభాకాంక్షలు తెలియ జేసుకుంటూ
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారి "నవ్వితే నవ్వండి- మా కభ్యంతరం
లేదు" నుంచి ఓ జోకు :
"నాకో రూపాయి అప్పుకావాలనుకోండి ప్రాణం పోయినా
సరే స్నేహితుణ్ణి మాత్రం ఎన్నడూ అడగను.అది నామతం"
అన్నాడు అప్పారావు.
"ఒట్టు ?... ... అయితే యీ క్షణం నించి నన్ను మీ ఆప్తమిత్రులలో
ఒకడిగా చేర్చుకోండి"అన్నాడో పరిచితుడు భక్తిగౌరవాలతో.
<><><><><><><><><><>
మీస్నేహితుల లిస్టులో నన్ను కూడా చేర్చినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteనన్ను మీ స్నేహితుల లిస్ట్ లొ చేర్చుకోనందుకు...ఏమన్నా అందామంటే మీరు నాకు స్నేహితులుకదా...
ReplyDeleteRelatives are by force..Friends are by choice...
మిమ్మల్ని కొత్త స్నేహితుల లిస్టులో ఎలా చేర్చుకుంటాను. మన స్నేహం ఎప్పటిది ! నలభై ఏళ్ళ స్నేహం! కాదంటారా ?!
ReplyDeleteఅప్పారావు గారూ,
ReplyDeleteనమస్కారం! కాకతాళీయంగా రాజమండ్రి రావడం, మీరు ఎంతో ఓపికతో సేకరించి భద్రపరచిన అమూల్యమైన భాండాగారాన్ని చూడగలగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందుకు నా ధన్యవాదాలు. మీకు వీలుకుదిరినప్పుడు ఈ మెయిల్ పంపించగలరు.
భవదీయుడు
వర్మ