Friday, April 02, 2010

అప్పటి,ఇప్పటి 'రీడర్స్ డైజెస్ట్'




'రీడర్స్ డైజెస్ట్' పత్రిక ప్రపంచ వ్యాప్తంగా 21 భాషల్లో 50 ఎడిషన్లు ప్రచురించ బడుతున్న పత్రిక
ఫిబ్రువరి 1922లో ప్రారంభించారు. ఆ ప్రతి ఫెసిమైల్ ఎడిషన్ చందాదారులకోసం ప్రత్యేకం గా ప్రింటు
చేసి ఉచితంగా అందచేసారు.ఆ కాపీని, 1944 లో మా నాన్నగారు రాజమండ్రి వచ్చినప్పుడు మొదటి
సారిగా కొన్న నవంబర్ సంచిక ఫొటో, మే 1983 సంచిక, మార్చి 2010 సంచిక ఫొటో చూడండి.
1944 నుండి క్రమం తప్పకుండా నాన్న గారు డైజెస్ట్ పత్రికకు చందాదారు. ప్రతి ఏడాది పత్రిక పెట్టు
కోడానికి ఓ ప్లాస్టిక్ కవరును గిఫ్ట్ గా పంపేవారు. ఆ కవరులోనే నాన్నగారు కొద్దిగా కాష్, ఓ లూజ్
లీఫ్ చెక్కు పెట్టుకొనే వారు. ఇప్పటిలా ఏటియంలు లేవు కాబట్టి అవసరమైనప్పుడు ఆ చెక్కును మార్చే
వారు.నాన్న గారు కూడా స్టేట్ బాంకులో ఆఫీసరే కాబట్టి చెక్కును ప్రతి షాపు వాళ్ళూ తీసుకొనే వాళ్ళు.
నాన్నగారు కీర్తి శేషులైనాక ఆ పత్రికను ఇప్పటికీ తెప్పిస్తున్నాను. పత్రిక రాగానే ముందుగా అందులోని
లాఫ్టర్,ది బెస్ట్ మెడిసెన్ శీర్షికను చదవడం నా కెంతో ఇస్ఠం.తరువాత 'ఇట్ పేస్ టు ఎన్రిచ్ యువర్
వర్డ్ పవర్' శీర్షిక చూస్తాను. మే 1983 సంచికలో ' వై డూ బాడ్ తింగ్స్ హాపెన్ టు గుడ్ పీపుల్'
అనే ఆర్టికల్ చాలా బాగుంటుంది. 1983లో పది రూపాయలున్న పత్రిక ఇప్పుడు అరవై రూపాయలైంది!
ఇండియన్ ఎడిషన్ 'ఇండియా టుడే' గ్రూప్ ప్రచురిస్తున్నది. నాకు ఇంగ్లీష్లో అభిమాన పత్రికైన 'రీడర్స్
డైజెస్ట్'గురించి మీతో పంచుకొవాలని అనిపించింది.



1 comment:

  1. సార్. ఈ readers digest లోపట ఎక్కువగా బుచికి బుచికి వ్యాసాలే ఉంటాయి.

    ReplyDelete