ఆడు వారి మాటలకు అర్ధాలె వేరులే అంటే ఇక్కడ 'ఆడు' అంటే మాటలాడు
అని అర్ధం చెప్పుకోవాలి. ఆడైనా, మగైనా మనం అప్పుడప్పుడూ మాటలాడే
'మాటల'కు అర్ధాలు వేరుగా స్ఫురించవచ్చు.కొందరు ఏదైనా షాపుల్లో కొనడానికి
వెళ్ళి ఏ గాజు వస్తువో చూపించి 'ఎదెంత పడుతుందండీ' అని అడుగుతుంటారు.
ఇక్కడ 'పడటం'అంటే 'ధర'ట!.కొన్ని మాటలు చూడండి.'ఫొటోలు "దిగడం",
ఇంట్లోకి 'దిగడం' అంటుంటారు.మీరు కొత్తగా బైకో,స్కూటరో కొనగానే,మీకు పరిచయం
లేని వాళ్ళయినా సరే "పెట్రోలు ఎంతిస్తుందండీ?" అంటూ అడుగుతారు.పెట్రోలు ఇవ్వడానికి
అదేమన్నా ఆవా,గేదా చెప్పండి పాలిస్తున్నట్లు ఇవ్వడానికి!ఇక జిల్లా జిల్లాకి మాటలకి
అర్ధాలు మారి పోతాయి.నేను 1963లో ఎస్బీఐ,శ్రీకాకుళంలో ఉద్యోగంలో చేరినప్పుడు,
మెసెంజర్ "ఇక్కడ దోమలు లావండీ,జాగ్రత్త" అన్నాడు.'లావు' అంటే అక్కడ 'ఎక్కువ'
అని అర్ధంట.మన ఫామిలీ ఊరెళ్ళి,మనం ఒంటరిగా వున్నప్పుడు ఏ ఫ్రెండో వచ్చి "టిఫిన్
చేద్దూగాని మా ఇంటికి రా" అని పిలిస్తే, సంతోషపడి వెళ్ళామనుకోండి అక్కడ నిజంగానే
మన చేత టిఫిన్ (తయారు)చేయించే ప్రమాదం వుంది.ఏమంటే వాళ్ల ఫామిలీ కూడా
శెలవులకు ఊరెళ్ళి ఉండొచ్చు! ఇక సభల్లో చూడండి.వేదికను ఎంతో డబ్బు ఖర్చు చేసి
పూలతో డెకరేటర్స్ చేత చేయిస్తారు.కాని ఆ సభకు అధ్యక్షత వహించిన వ్యక్తిని,ఆ ప్రక్క
ఆశీనులైన పెద్దమనుషులను,స్టేజీ పకి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరూ "వేదికను అలంకరించిన
పెద్దలకు నమస్కారం" అంటూ మొదలు పెడతారు.స్టేజీ అలంకరించినది ఒకరైతే దర్జాగా కూర్చున్న
వాళ్లను 'అలంకరించారు' అంటారు!ఇలా 'ఆడు మాటలకు' ఒక్కోసారి అర్ధాలు మరోలా
'అర్ధ' మవుతాయి.అందుచేత మన మాటలకు 'ఎడా-పెడా'ర్ధాలు (ముళ్లపూడి వారన్నట్లు)
తీసినప్పుడు ఒక్కో సారి ఆలోచిస్తే వినోదాన్ని కలిగిస్తుంటాయి.
అయితే ఇక నుంచి వేదికనలంకరించిన పెద్దలకు అనకుండా
ReplyDeleteవేదికకు (కేవలం?) అలంకారమైన పెద్దలకు? అనాలన్న మాట.. :-)
హ హ హ మంచి విషయం ప్రస్తావించారు. మీరన్నది నిజమే, అప్పుడప్పుదూ మనం పెడార్థాలు తీసుకుంటే సరదగా ఉంటాయి
ReplyDeleteబాగుంది .
ReplyDeleteతెలుగు భాషలో గొప్పతనం అదే కదండీ. ఉత్ప్రేక్ష లు చక్కగా హాస్య్యాన్నీ పుట్టిస్తాయి, ఏక కాలం లో రెండు అర్ధవంతమైన భావాలనీ పలికిస్తాయి.
ReplyDeleteబాపు - రమణ ల నవ్వితే నవ్వండి అనే హాస్త్య గల్పిక లో "సుశీలా రాయిలా కూర్చో" అని ప్రియుడు పిలవటం,ఆ సదరు సుశీల రాయిలా(స్టోన్ లా) కూర్చున్నట్లు చూపించారు. రా ఇలా కూర్చో అనటం వేరు, సంధి కలిపేసి రాయిలా కూర్చో అంటే,
ఇలా ఎన్నో