Friday, April 16, 2010

ఈరోజు చార్లీ చాప్లీన్ పుట్టిన రోజు




ప్రఖ్యాత హాస్య నటుడు చార్లీ చాప్లిన్ పుట్టిన రోజు ఈరోజు
చార్లీచాప్లిన్ అసలు పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్.ఆయన లండన్లో 1889 ఏప్రియల్
16 న జన్మించాడు. తల్లి తండ్రులిద్దరూ కళాకారులే. చార్లెస్ చిన్న తనంలోనే
తండ్రి మరణించాడు. చిన్న తనంలో చాప్లిన్ బీదరికం తో కష్టాలు పడ్డాడు. 1913 లో
"ఫ్రెడ్కార్నో కంపెనీ" చాప్లిన్ను ఓ ముఖ్య వేషానికి ఎన్నికచేసి అమెరికాకు తీసుకు
వెళ్లారు. అక్కడ బాగా పేరు పొందడంలో ఆ ఏడాదే సినిమా చాన్సులు కూడా వచ్చాయి.
తన జీవితంలో అనుభవించిన కష్టాలను,అనుభవాలను కధగా వ్రాసుకొని,స్వయంగా
దర్శకత్వం వహిస్తూ చిత్రం నిర్మించి ప్రధాన పాత్ర పోషించిన " ది కిడ్" మరువరాని చిత్రంగా
నిలచిపోయింది. అతను నటించిన చిత్రాలలో నేటికి ఆణిముత్యాలుగా నిలచిన చిత్రాలు:
గోల్డ్ రష్,సిటీ లైట్స్, ది కిడ్, ది కింగ్ ఇన్ న్యూయార్క్,ది గ్రేట్ డిక్టేటర్, మోడరన్ టైమ్స్,
సన్నీసైడ్,ది ఐడిల్ క్లాస్,ఎనైట్ ఇన్ ది షో,పోలీస్,పేడే, ది సర్కస్ మొదలైన ఎనభై
చిత్రాలు ఉన్నాయి. చాప్లిన్ పుట్టిన రోజున నవ్వులు పంచిన ఆయనకి మన బ్లాగర్లందరీ
తరఫున జోహార్లు.

2 comments:

  1. చార్లీ చాప్లిన్ గారిని మరొక్కసారి మనందరికి గుర్తు చేసినందులకు మీకు ధన్యవాదములు !!

    ReplyDelete
  2. చాప్లిన్ పుట్టిన రోజున ఆయనకి మన బ్లాగర్లందరీ తరఫున జోహార్లు తెలిపినందుకు మీకు మన బ్లాగర్లందరీ తరఫున ధన్యవాదాలు!

    ReplyDelete