Friday, July 30, 2010

రావి శాస్త్రి "రచనా సాగరం"


రాచకొండ విశ్వనాధ శాస్త్రి

రావి శాస్త్రి గా పేరొందిన తెలుగు పాఠకుల అభిమాన రచయిత
ఎన్నో కధలు, నవలలు, నాటికలు వ్రాసారు. శ్రీ శాస్త్రి గారు 1922,
జూలై 30 వ తేదీన శీకాకుళం లో జన్మించారు.
ఆయన రచనలన్నీ ఒకే చోట ఏర్చి కూర్చి రాచకొండ విశ్వనాధ శాస్త్రి
రచనా సాగరం పేరిట మనసు ఫౌండేషన్ వారు శ్రి బాపు ముఖచిత్రంతో
1373 పేజీలతో పుస్తకాన్ని ప్రచురించారు.
శ్రీ రావి శాస్త్రి గారి కలం నుండి వెలువడిన ఓ చిన్న మణిపూస.

విస్కీ సీసాని
అతను కౌగలించుకొని తెస్తూ
మెట్ల మీద బోర్లా పడిపోయాడు.
విరిగిన సీసా పెంకులు అతని గుండెల్లో గుచ్చుకోగా,
అతను చనిపోయాడు.
అతను ఆ విధంగా మట్టిపాలయినందుకు
అతని భార్యాబిడ్డలూ విచారించారు.
సీసాలోని స్కాచ్ విస్కీ నేలపాలయినందుకు
అతని" స్నేహితులు " విచారించేరు.
( స్వాతి ,సెప్టెంబరు, 1978 )




"


"

No comments:

Post a Comment