సెల్లులొ సొల్లు కబుర్లు
ఈ కాలంలో సెల్లులేని ఇల్లు ఎక్కడుంది చెప్పండి. అంతెందుకు
సందు సందున మందు దుకాణాల్లా సెల్లు దుకాణాలు, అందులో
సెల్లులు సెల్లుచేస్తుంటె కొనుక్కోడానికి మూగే జనాలు ఎప్పుడూ
కనిపిస్తుంటారు. నాకు అనిపిస్తుంటుంది, నిత్యావసారాలలాగ
వీటికి ఇంత డిమాండ్ ఏమిటా అని.! కాలేజీకి వెళ్ళే అమ్మాయిల,
అబ్బాయిల చేతుల్లోనే కాదు, స్కూళ్లకు వెళ్ళే పిల్లల చేతుల్లోనూ
ఈ ఫోన్లే !.
మా కాలంలో అసలు లాండు ఫోన్లే ఎవరో వ్యాపారం చేసే వాళ్ళకు,
గొప్పవాళ్లకి వుండేవి. రాజమండ్రిలో మేము ఉంటున్న వీధిలో నాళం
రాజారావు గారనె ఎలక్ట్రికల్ డీలర్ షాపు/ఇంట్లో, అద్దేపల్లి నాగేశ్వరరావు
గారి ప్రెస్ ( సరస్వతీ పవర్ ప్రెస్, ఈ ప్రెస్ లోనే ఆంధ్రాయూనివర్సిటీ వారి
AA పుస్తకాలు అచ్చయేవి) మాత్రమే టెలీఫోన్లు ఉండెవి. నాన్న గారు బ్యాంకు
నుంచి ఫోను చేస్తే , ప్రెస్ వాళ్ళు చెప్పమన్న విషయం మా ఇంటికి
వచ్చి చెప్పేవారు. రోజులు మారాయి. ఇప్పుడు ఫోను స్టేటస్ సింబల్ కాదు.
అత్యవసరం. ఇక మొబైల్ ఫోన్ మన బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన
సమాచారాన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తే సద్వినియోగమే. కానీ
ఈనాడు సెల్ వల్ల ఉపయోగంతో బాటు నష్టం కూడా వుంటున్నది. బయట
నుంచి ఇంటికి మాట్లాడే టప్పుడు కొద్దిగా నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకోవాలి.
ఈ మధ్య HINDU పత్రికలో శ్రీ వి.రాజగోపాల్ సెల్ ఫోన్లపై వ్రాస్తూ, జరిగిన ఓ
సంఘటణను ఉదహరించారు. ఓ పెద్దమనిషి రోడ్డు మీద నిలబడి ఫోనులోగట్టిగా
ఇంట్లో బీరువాలో డబ్బు పెట్టానని, బ్లూ టీషర్ట్ వేసుకొన్నతను వస్తాడు ,డబ్బు
ఇమ్మని చెబితే, ఇదంతా విన్న ఒకడు అతనింటికి వెళ్ళి (బ్లూ షర్టు తో)
డబ్బు తీసుకొని దొరలా వచ్చి దొంగగా చక్కాపోయాడట! మనం సాధారణంగా
చూస్తుంటాము. రైళ్లల్లో, సినిమా హాళ్లల్లో గట్టిగా ఇంట్లో విషయాలన్నీ
లోకమంతా వినిపించేలా మాట్లాడుతుంటారు. ఇక బైకులమీద వెడుతూ
మెడ వంకర పోయిన వాడిలా సెల్లుతో మాట్లాడుతుంటారు. ఇది ప్రమాదం
అని తెలియక కాదు, వాళ్ల భావనలో ఫాషన్. ఇంట్లో ఉన్నప్పుడె చాలా సార్లు
ఎంత జాగ్రత్తగా వున్నా క్రింద పడిపోతూంటుంది. అదేమిటొ అలా మెడ సందులో
అలవాటు చేసుకోవడం మంచిది. ఇక ఆఖరుగా సెల్లు జోకులతో ముగిస్తాను.
భార్య భర్తతో, " ఏమండీ, ప్రతి అడ్డమైన వెధవ దగ్గర సెల్ ఫోనుంటున్నది.
మీరూ ఒకటి కొనుక్కోరాదటండీ ! "
*****************************************
******************************************
> ఏమండీ, ప్రతి అడ్డమైన వెధవ దగ్గర సెల్ ఫోనుంటున్నది. మీరూ ఒకటి కొనుక్కోరాదటండీ
ReplyDelete:-))
Apparaogaaroo,
ReplyDeleteWell written. Please visit an article written by me in my blog using your first cartoon. Following is the link
http://saahitya-abhimaani.blogspot.com/2009/12/blog-post_15.html
బగుంది. చెవిపోటు కార్టూను కూడా :)
ReplyDelete