Sunday, March 21, 2010

అలనాటి ( 1966 ) నా కార్టూన్ జ్ణాపకాలు




44 ఏళ్ళ క్రితం నేను బాపట్ల స్టేట్ బ్యాంక్ లో కాషియర్ గా పనిచేస్తున్న రోజుల్లో
నేను వేసిన ఈ కార్టూన్ ఆంధ్రప్రభ వీక్లీలో పడింది. ఈ కార్టూన్ 2008 లో అచ్చయిన
" సురేఖార్టూన్స్" పుస్తకంలో మరోసారి చూసిన మితృలు శ్రీ జయదేవ్ చాల మెచ్చుకున్నారు.
ఆ నాడు అచ్చయినప్పటి కంటే శ్రీ జయదేవ్ బాగుంది అన్నప్పుడు ఎన్నో రెట్లు ఆనందించా .
నాకు కాప్షన్ లేకుండా వుండే కార్టూన్లంటే చాలా ఇస్టం. వీటిని సైలెంట్ కార్టూన్లంటారు. శ్రీ
జయదేవ్ గారి సైలెంట్కార్టూన్ వెబ్ ఛూడండి.

రెండు బొమ్మలేసి పైన హాస్య సంభాషణ వ్రాసే కార్టూన్లే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి.
కనీసం ఆ హాస్యానికి సంభందించినది ఆ బొమ్మలో మనకు కనిపింఛాలి. ఇలాటి కార్టూన్ల
లో మన బాపు గారు, జయదేవ్ గారు, సరసి గారు ముందుంటారని వేరే చెప్పలా ?

3 comments:

  1. సురేఖ గారూ !
    మీ నలభై ఏళ్ళ జ్ఞాపకం బావుంది. మాక్కూడా పంచినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. కార్టూన్ బావుంది.

    ReplyDelete
  3. రెండు బొమ్మలేసి పైన హాస్య సంభాషణ వ్రాసే కార్టూన్లే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి -- బాగా చెప్పేరండీ. హాస్యసంభాషణకీ, కార్టూనుకీ తేడా. అభినందనలు.

    ReplyDelete