నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం
వేదంలాంటి గోదావరి తీరంలో ఎందరో పండితులూ, కవులూ, కళాకారులూ, కధానాయకులూ
జన్మించారు. అలానే ఈ గోదావరి ఒడ్డునున్న రాజమహేంద్రవరం(రాజమంద్రి)లోనే రాజరాజ
నరేంద్రుడు ఆదికవి నన్నయ చేత మహాభారత రచనకు శ్రీకారం చుట్టించాడు. అలాటి ఈ
సాహిత్య నగరంలో 16-4-1848 లొ ఈ యుగపు సంఘసంస్క్రర్త కందుకూరి వీరేశలింగం
జన్మించారు. 1919 లో మరణించే వరకూ కందుకూరి కలం,గలం తోటి మానవ హితం గురించే
సాగిపోయింది. ఆ రోజుల్లో ముక్కుపచ్చలారని బాలికలను పమ్డు ముసలి వాళ్ళకి భార్యలుగా
కట్టబెట్టడం, బలవంతపు వితంతు దుర్దశలకు గురిచేయడం,చదువుకొనే అవకాశాలు కలుగ చేయక
పోవడం లాంటి దుర్మార్గపు పనులతో స్త్రీలోకం ఆహుతి అయ్యేవారు. కందుకూరి గోదవరి గడ్డపై
జన్మించేవరకు స్త్రీలగురించి పత్తించుకొనే నాధుడే లేకపోయాడు.తల్లి,చెల్లి,ఆలి ఐనా స్త్రీ పురిషుని
ఆధీనంలో వుండవలసిన వస్తువుగా తలచేవారు.ఆ రోజుల్లో స్త్రీ వంటింట్లో,పడకటింట్లో పనిచేసే ఓ
యంత్రంగా భావించేవారు.ఇలాటి మూఢాచారాలకు అడ్డుకట్ట వేసిన సాహసి కందుకూరి వీరేశలింగం.
ఆయన తెచ్చిన సంఘసంస్కరణలు చీకటిలో మగ్గే స్త్రీమూర్తులకు వెలుగు దారిలో నడిపించింది.
కందుకూరి చిన్నతనంలోనే అన్యాయాలపై,అవినీతిపై తిరుగుబాటు చేసే ధైర్యం అబ్బింది.న్యాయం కోసం
తను నమ్మే మంచికోసం బడిలో గురువులనే ఎదురించేవాడు.టీచరుగా ఉద్యోగంలో చేరటానికి మంచి
రోజు చూడకుండా అమావాస్యనాడు చేరాడు.చిన్నతనంలోనే కవిత్వంపై ఆశక్తి చూపించి మార్కండేయ
శతకం,గోపాలశతకమ్ చాలా చిన్న వయసులోనే రచించారు.సంస్కృతం నుంచి కాళిదాసు నాటకాలను
అనువందించారు.భారతగాధ "దక్షిణగోగ్రహణం" 1885లో తొలిసారిగా రచించారు.స్త్రీలకు అకాలంగా
ప్రాప్తిస్తున్న బాల వైధవ్యాలకు కారణం చదువులేకపోవడమేనని భావించి మొదటిసాఅరిగా బాలికల
పాఠశాల ధవళేశ్వరంలో ప్రారంభించారు.1874 లో స్త్రీల ప్రయోజనం కోసం " వివేక వర్ధని "అనే
పత్రికను ప్రారంభించారు.1881లో మొదటి వితంతు వివాహం జరిపించారు.పునర్వివాహం అవకాశం
లేని వారి కోసం వితంతుశరణాలయం స్థాపించారు.యువకులు,పెద్దలు సమావేశమై చర్ఛించుకోవడానికి
పురమందిరం స్థాపించారు.వీటి అన్నిటి నిర్మాణానికి తన ఆస్తిపాస్తులను వెచ్చించారు.ఆయన రచీంచిన
నవల " రాజశేఖర చరిత్ర" దూరదర్శన్ సప్తగిరిలో వచ్చింది.ఆ నవల అత్యంత ప్రజాదరణ పొందింది.
ఆయన పేరిట రాజమండ్రిలో వీరేశలీంగ ఆస్తికోన్నత పాఠశాల నిర్మింపబడ్డది.ఇలా ప్రజలకోసం,ముఖ్యంగా
స్త్రీల కోసం పాటుబడిన మహావ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు.ఈ ఫొటోలలో మీరు చూస్తున్న
గృహం హితకారిణి సమాజం ప్రార్ధనామందిరం.ఆయన నిర్మించిన పురమందిరంలో ఓ గ్రంధాలయం వుంది.
"కాళాగౌతమి" లాంటి సాహిత్య సభలు జరుగుతూ వుంటాయి.
మొన్ననే వెళ్ళాను కందుకూరి వారి ఇంటికి। అలా గోదావరి గట్టు మీదకు వెళ్ళి అక్కడి నుండి గోపలస్వామి ఆలయానికి కందుకూరి వారి ఇంటికీ వెళ్ళాను।
ReplyDeleteనేను రాజమహేంద్రిలో ఒక వెయ్యసార్లు గట్టు వెంబడవెళ్ళినా ఈ ఇల్లు ఇక్కడ వుందని మొన్న మాటల్లో ఎవరో చెబితేనే గాని తెలియలేదు।
ఆదివారం సాయంత్రం చేత కట్టేసివుంది। ఈసారి సావకాశంగా పగలు వెళ్ళాలి।
ఆదివారం సాయంత్రం అంటే మీకు ఫోను చేసిన కాసేపటికి।
ఆ తరువాత కోటిలింగాలు కూడా వెళ్ళాను। ఎప్పుడూ వెళ్ళే రాజమండ్రే అయినా చూడడానికి చాలానే వున్నాయి తెలియనివి - అనిపించింది।