1953 నవంబర్ చందమామ దీపావళి ప్రత్యేక సంచికలో 'పొట్టి పిల్ల' అనే కధ
మొట్టమొదటి సారిగా రంగుల్లో ప్రచురించారు.చందమామ బొమ్మలను రెండు రంగుల్లో
చూసే మాకు, అలా ఆ కధ బొమ్మలను రంగుల్లో చూడటం ఎంతో సంతోషం కలిగించింది.
1954 జనవరి నెల సంపాదకీయంలో 'తోకచుక్క' రంగుల్లో వేయగలిగాం అని వ్రాసినప్పుడు
మా ఆనందానికి హద్దులు లేవు.ఆ సీరియలుకు ఆర్టిస్ట్ 'చిత్రా' అద్భుతమైన బొమ్మలు
వేశారు.ఆయన చందమామ ప్రారంభించినప్పటి నుంచి (1947 జూలై) బొమ్మలు వేసారు.
1975లో ఆయన కీర్తిశేషులయ్యారు.ఇక ఈ సీరియలును రచించినది శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం.
తరువాత శ్రీ దాసరి చందమామలో అనేక సీరియలు కధలు రచించారు.
చిత్రా గారి బొమ్మలు చూస్తుంటే నిజంగా ఆ దృశ్యాలు మన కల్లెదుట ఉన్నట్లుగానే ఉంటుంది.
అలానే శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనా నైపుణ్యానికి 'చిత్ర'బొమ్మలు వన్నె తెచ్చాయి.
ఆ ఇద్దరు మహానుభావులు ఈ నాడు మన మధ్య లేక పోవటం బాధాకరం.ఈ కారణ జన్ములు
ఏ నాటికి చిరంజీవులే!
మంచి బొమ్మలు అందించారు సురేఖ గారూ. చిత్రాగారు మరణించినది 1978లో అప్పటినుంచి, చందమామలో మొదట్లో వచ్చే ధారావాహికను చదవటం మానేశాను. ఆయన బొమ్మలకున్న ఆకర్షణ అటువంటిది.
ReplyDelete1970 చివర్లలో కూడా చందమామ లో తోకచుక్క తిరిగి వచ్చింది, చాలా ఎదురుచూసి నేను చదివేవాడిని. చాలా తీపి గుర్తు ని వెలికిదిసారు. చిత్ర గారి లాగానే శంకర్, జయ(?) అనే వారు కూడా బొమ్మలు వేసినట్లు గుర్తు. వారి గురించి కూడా వ్రాయండి.
ReplyDeleteశివరామప్రసాద్ గారు,
ReplyDeleteనిజమే. చిత్రా గారు మరణించినది 1978 లోనే.పొరబాటును తెలియ జేసినందుకు
ధన్యవాదాలు.
chala bagunnayi anDi
ReplyDelete