Saturday, March 13, 2010

శంకర్స్ వీక్లీ-శంకర్ ,మేటి రాజకీయ కార్టూనిస్ట్

రాజకీయ కార్టూనిస్టులలో శ్రీ శంకర్ ను ఆయన 1948 లో ప్రారంభించిన "శంకర్స్ వీక్లీ" ని
ఎన్నటికీ మరచిపోలేము.ఆయన తరువాత అంతటి ప్రాచూర్యం పొందినది శ్రీ ఆర్కే.లక్ష్మణ్,ఇక
మన తెలుగు లో ఈనాడు శ్రీధర్ గార్లే!.

శ్రీ శంకర్ పూర్తి పేరు కేశవ శంకర పిళ్ళై.1902,జూలై 31న కేరళలోని ఓ పల్లెటూరిలో
జన్మించారు.చిన్న నాటి నుంచి చిత్ర కళ పై ఆసక్తి తో బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్
లో జేరుదామనుకొంటే కనీస అర్హత లేదని ఆయన అభ్యర్ధనను త్రోసిపుచ్చారు.తరువాత మన
బాపు గారిలా లా చదివి ఓ షిప్పింగ్ కంపెని లో ఉద్యోగం చేసారు.చిత్రకళ పై గల ప్రేమతొ
ఉద్యోగం వదలి బాంబే క్రానికల్, ఫ్రీ ప్రెస్ జర్నల్ లలో కార్టూనిస్ట్ గా పరిచయమయ్యారు.

1931లో హిందూస్తాన్ టైమ్స్ లో ప్రతి దినం కార్టూన్లేయడం ప్రారంభించారు.అతని కార్టూన్లు ప్రతి చోటా
చర్చనీయాంసంగా వుండేవి.సాధారణంగా కార్టూనిస్ట్ కార్టున్ చూసి ఎడిటర్ అనుమతి పొందాకే
ప్రచురించబడుతుంది.కాని,శంకర్ విషయంలో ఆ నియమం ఉండేది కాదట.అదే ఆయన ప్రత్యేకత!
1941 హిందూస్తాన్ టైమ్స్ లో శంకర్ అప్పటి భారత దేశ వైస్రాయి లార్డ్విన్విత్గో కాళికాదేవి లా
పుర్రెలు మెళ్ళోవేసుకొని స్మశానంలో కరాళ నృత్యం చేస్తున్నట్లు బొమ్మ వేసారు. ఊదయాన్నే ఆ
బొమ్మ చూసిన ఎడిటర్ బ్రిటిష్ ప్రభుత్వం తన పత్రికను నిషేధించడం తప్పదనుకున్నాడట.అనుకున్నట్లు
గానే వైస్రాయి ఆఫీసు నుంచి మీ కార్టూనిస్ట్ ను మా ఆఫీస్ కు పంపించండి అంటూ ఫోనొచ్చింది.
భయపడూతూ శంకర్ వైస్రాయి గదిలోకి అడుగుపెట్టాడు.వైస్రాయి లార్డ్ విన్త్ గో తన సీటులోంచి లేఛి
కరచాలనంచేసి" నీ కార్టూన్ అద్భుతంగా వుంది.కీప్ ఇట్ అప్.ఆ కార్టూన్ ఒరిజినల్ నాకివ్వగలవా?,
దాచుకొంటాను"అన్నాడట.అలా తన కార్టూన్లను భారతీయ నాయకుల్లో అభిమానించినది,గాంధీ,నెహృలని
శంకర్ అనేవారు.


1948 లో "శంకర్స్ వీక్లీ"ని ప్రారంభించి నప్పుడు నెహౄ "నా మీద కూడా నువ్వు
కార్టూన్లు ప్రతీ సంచికలోను గీసి నా లోపాలను ఎత్తి చూపాలి సుమా"అని నెహౄ కోరారట.నా చిన్న
తనంలో మా నాన్న గారు "శంకర్స్ వీక్లీ" తేగానే ముందుగా మధ్య పేజీలని ఆత్రంగా చూసేవాళ్ళం.
ఆ పేజీలో గాదిదల తలలతో ఆడ,మగ మనుషుల బొమ్మలతో కార్టూన్లుండేవి!నా కార్టూన్లు చూసి
నవ్వుకోవాలి,అందులోని వ్యక్తులైనా సరే అనే వారటశంకర్. ప్రతి ఏడాది నవంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు చిత్రకళా పోటీలు ఏర్పాటు చెశేవారు.ఢిల్లీలో ప్రపంచ దేశాల్లోని పిల్లల బొమ్మలు సేకరించి మ్యూజియం ఏర్పాటు చేసారు శ్రీ శంకర్.


ఓ పత్రికలో ఆయన ఫొటో చూసి నా మిడి మిడి జ్ఞానంతో బొమ్మ గీయడానికి ప్రయత్నీంచా!
శంకర్ గారి కొన్ని కార్టూన్లు మీ కోసం.చివరిగా ఓ విన్నపం.మన బ్లాగర్ మితృలెవరి దగ్గరైనా
"శంకర్శ్ వీక్లీ" కాపీలుంటే జిరాక్స్ కాపీ పంపించ గలరా! దానికి అయ్యే కర్సులు అవీ తరువాత
చూసుకోందారండి.



1 comment:

  1. అప్పరావుగారూ. మంచి కార్టూన్లను జ్ఞాపకం చేశారు. నా దగ్గర దాదాపు 20-30 శంకర్స్ వీక్లీలు ఉండాలి. కాని వెతకాలి. అవి 1970 ప్రాంతాలవి అనుకుంటాను. ప్రముఖ తెలుగు కార్టూనిస్టు, దూరదర్శన్‌లో అనేక ధారావాహికలను మనకు అందించిన ప్రముఖ దర్శకులు శ్రీ శంకు గారు అనేక మంది ప్రముఖ కార్టూనిస్టుల గురించిన డాక్యుమెంటరీలను తయారు చేశారు. అందులో శంకర్ గారి గురించిన డాక్యుమెంటరీ నాకు పంపారు. అది చూసి నేను ఒక మంచి వ్యాసం వ్రాద్దామని ఎప్పటినుండో అనుకుంటున్నాను, కుదరటంలేదు.

    ఆ తరువాత, వెబ్లో వెతితికితే శంకర్స్ వీక్లీ కార్టూన్లు కొన్ని దొరుకుతున్నాయి. ఈ కింద ఇచ్చిన లింకు నొక్కి చూడండి.

    http://www.friendsoftibet.org/cartoons/ict6.html

    మన దేశ దురదృష్టం, ఏమాత్రం తెలివితేటలు లేని ఒక రొమాంటిక్ మన ప్రధమ ప్రధాని కావటం. ఆ వ్యక్తి అనుసరించిన అపభ్రంశపు విదేశాంగ విధానం మన్ని ఈరోజున ఉన్న పరిస్థితిలోకి నెట్టేసింది. ఎవరితోనూ మంచిలేదు. టిబెట్టు విషయంలో నెహ్రూ వేసిన తప్పటడుగులు, వంతపాడిన ద్రోహి కృష్ణ మీనన్ గురించిన వ్యంగ్య చిత్రాలు పైన ఇచ్చిన లింకులో చూడవచ్చు.

    ReplyDelete