Thursday, March 18, 2010

తెనుగు దేశం

తెనుగు దేశం-- తొలి ముఖ్య మంత్రి టంగుటూరి ప్రకాశం
ఈ బాల లోనే ఇంకోచోట "తెలంగాణాలో కోటి మంది ఆంధ్రులు" అన్న రచన పడింది. అది చదివితే నైజాం
సంస్తానంలో మన తెనుగు వారు పడుతున్న కస్టాలు తెలుస్తాయి. అలాగే మన తెలుగు దేశం కొంత భాగం
ఒరిస్సా రాస్ట్రంలో కలసిపోయి,అక్కడ మనతెనుగువారు చాలా కస్టాలు పదుతున్నారు. మైసూరు రాజ్యంలో
కొన్నిభాగాలు తెనుగువారివి. ఈ "బాల" పుట్టిన ఈ చెన్నపట్టణం కూడా తెలుగువారిదే. ఇలాగ మన తెలుగు
దేశం అంతా ఒక రాస్ట్రంగా లేక ముక్కలు ముక్కలుగా వేరు వేరు రాజ్యాలలో వుంది. ఈ చెన్నపట్టణంలో
చూస్తే మన తెనుగువారు సుమారు అయిదారు లక్షలమంది వున్నారు. తెనుగు పిల్లలు చదువుకోవాలంటే
అరవం నేర్పే బడులలో చదువుకోవాలి. తెనుగు నేర్పే బడులు చాలా తక్కువ. మన రాజ్యం ఇతరుల చేతులలో
వున్నంతకాలం మనకు ఈ కస్టాలు తప్పవు. చీలిపోయిన మన తెనుగు సీమలన్నీ కలిపి ఒక రాస్ట్రంగా ఏర్పడితే
మన దేశం,మన భాష, మన వర్తకం అభివ్రుద్ధిజెంది మనం హాయిగా వుంటాం. తెనుగు బాల బాలికలందరూ
"మాకు ప్రత్యేక రాస్ట్రం కావాలి" అని సభలు చేసి, అలజడి చేయాలి. మనకి ప్రత్యేక రాస్ట్రం వచ్చేవరకు ఊరుకోకూడదు.
ఇదంతా పందొమ్మిది వందల నలభై ఏడు,ఏప్రియల్ నెల "బాల" పిల్లల సంచికలో బాలన్నయ్య వ్రాసిన
సంపాదకీయం అంటే మీరు నమ్ముతారా?! ఇప్పుడు మళ్ళి ప్రత్యేక రాస్ట్రమంటూ గొడవలు మొదలెట్టారు. మనకు
మొదటి ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన యావదాస్తిని దేశం కోసం ఖర్చు చేశారు.
ఇంకో విషయం. ఆయన మా రాజమండ్రి మునిసిపాలిటీలో చైర్మన్ గా పనిచేశారు.

1 comment:

  1. ." చీలిపోయిన మన తెనుగు సీమలన్నీ కలిపి ఒక రాస్ట్రంగా ఏర్పడితే
    మన దేశం,మన భాష, మన వర్తకం అభివ్రుద్ధిజెంది మనం హాయిగా వుంటాం. తెనుగు బాల బాలికలందరూ
    "మాకు ప్రత్యేక రాస్ట్రం కావాలి" అని సభలు చేసి, అలజడి చేయాలి. మనకి ప్రత్యేక రాస్ట్రం వచ్చేవరకు ఊరుకోకూడదు.
    ఇదంతా పందొమ్మిది వందల నలభై ఏడు,ఏప్రియల్ నెల "బాల" పిల్లల సంచికలో బాలన్నయ్య వ్రాసిన
    సంపాదకీయం అంటే మీరు నమ్ముతారా?"----

    గురువు గారూ,

    చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా, మన దౌర్భాగ్య రాజకీయనాయకుల దగ్గర ఏం చెప్పినా ఉపయోగం లేదు. అది మనం చేసికున్న దురదృష్టం !

    ReplyDelete