ఈ బొమ్మలొ రిక్షాపై వున్నది కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. ఈ పొటొ గుంటూరులో తీసిన పోటో.
మన బ్లాగర్ శ్రీ శివరామ ప్రసాద్ గారు, ముళ్ళపూడి వారి కోత కొ0మ్మచ్ఛి కోసం పంపించారు. ఈమ్తకీ అసలు
సంగతి ఏమంటే పూర్వం ఇప్పటిలా ఆటోలు లెనప్పుడు , సైకిల్ రిక్షాల ముందు మనుషులు లాగే రిక్షాలు ఉండేవి.
ఒక మనిషి కూర్చుంటే మరో సాటి మనిషి బరువును లాగడము ఎంతో ఇబ్బంది కరమైన విషయం. ఏమిటొ ఆ
కాలంలో అలా అనిపించేది కాదు. ముఖ్యంగా మా రాజమండ్రి లాంటి ఊర్లలో కొన్ని రోడ్లు మెరకగా ఉంటె ,పాపం
ఎండలో చెమటలు కారుతూ లాగే వాళ్ళు. ఆ పాత రోజులు పోయాయి. ఇప్పుడు ఆటోలు వచ్చేశాయి.ఆ రోజులు
ఆ ఫొటో చూస్తే జ్ఞాపకం వచ్చి మీతో పంచుకోవాలనిపించింది.
'సురేఖ'గారూ !
ReplyDeleteఅద్భుతమైన, అరుదైన ఫొటో అందించిన మీకు, శివ గారికి వందనాలు.
అరుదైన ఫోటో మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు...
ReplyDeleteపై బొమ్మ హిందూ దిన పత్రికలో పడినది జాగ్రత్త చేసినది. ఫొటో తీసినది ఎవరో సరిగ్గా తెలియదు. తీసినది మాత్రం విజయవాడలో. శ్రీ విశ్వనాథ వారు ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో తెలుగు విభాగం లో పని చేస్తున్నప్పుడు వారు కాలేజీకి అలా రిక్షాలో వెడుతుండగా, శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి స్నేహితుడు తీశారని చదివాను. వారిద్దరూ అప్పుడు అదే కాలేజీలో చదువుతున్నారట. ఈ ఫొటో "రిక్షాలో కవి రాజు" అని అప్పట్లో కాలేజీలో చాలా ప్రసిధ్ధికెక్కిందట.
ReplyDeleteఈ మధ్య, ముళ్ళపూడిగారు తమ కోతి కొమ్మచ్చి మూడో భాగంలో తమ కథనానికి సరిపోయే విశ్వనాధవారి మధ్య వయస్సు నాటి చిత్రానికి వెతుకుతున్నారని, మన సురేఖ గారే తెలియచేస్తే, వారికి ఈ ఫొటో మైలు చేశాను. ఈ ఫొటొను ముళ్ళపూడివారు వాడినట్టుగా సురేఖగారే చెప్పారు. నేను చూడలేదు. ఏమైనా కోతి కొమ్మచ్చి రచనలో ఈ చిన్న ఉడుత సహాయం చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది.