Monday, March 22, 2010

తెలుగోడి గోడు






తెలుగోడి గోడు

అదేమిటొ గాని తెలుగంటే మన తెలుగువాళ్లకే చిన్న చూపు.ఎవరైనా తెలుగులో మాట్లాడుతున్నాడంటే
అతను ఎంత ఉన్నత చదువులు చదివిన వాడైనా ఏవీ రాని అనాముకుడిక్రిందే లెక్క కడతారు మన
తెలుగు వాళ్ళు. ఈ మధ్య మనం వార్తల్లో చదువుతూ,వింటూ వున్నాం. బడిలో తెలుగు మాట్లాడారని
పిల్లల్ని ఘోరంగా శిక్షిస్తున్నారట ఉపాధ్యాయులు. ఇక ఇంట్లో అమ్మా, నాన్నలకు మమ్మీ, డాడీ అని
పిలిపించుకోవడమే ఎంతో గొప్ప. మా చిన్నప్పుడు మా నాన్నగారి స్నేహితులను మావయ్య గారు, అత్తయ్య
గారూ అని పిలిచే వాళ్ళం. ఇప్పుడొ మరోలా అనుకోకపోతే , ముష్టి వాళ్లను కూడా అంకుల్ అని పిలుస్తున్నారు
ఈ కాలం పిల్లలు ! నాకొక తృప్తి ఏమిటంటే మా మనవళ్ళు (చెన్నై), మనవరాలు (ముంబాయి) వాళ్ల
అమ్మా నాన్నలను అలానే పిలుస్తారు. గత కొద్ది నెలలుగా "ఈనాడు" జిల్లా సంచికలలో రోజుకో తెలుగక్షరం
చొప్పున బొమ్మల ఆకారంతో వేస్తున్నారు. వాటిని జాగ్రత్తగా కత్తిరించి పుస్తకంలో అంటించి పెడుతున్నాను.
వేసవి సెలవులకు పిల్లలు వచ్చినప్పుడు వాటిని చూపించి తెలుగక్షరాలు వాళ్ళకి నేర్పాలని నా ఆశ !
టీవీల్లో మన తెలుగు వాళ్ళను పరిచయం చేస్తున్నప్పుడు అదేమిటో వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువగా
ఇంగ్లీషే మాట్లాడుతుంటారు. తెలుగు మాట్లాడిన కొద్ది సేపు అండ్ అన్న మాట తరచు ఉపయోగిస్తుంటారు!

ఏనుగు బొమ్మను ఏ , ను , గు , అనే అక్షరాలతో ఏనుగు ఆకారంలో వేస్తే కాన్వెంట్ కుర్రాడు తెలుగులో
వుండబట్టి ఆ బొమ్మ ఏమిటొ కనుక్కోలేక పోతున్నాడని ఓ కార్టూన్ గీశాను. ఎలాఅ వుందో మీరే చెప్పాలి.
అదండీ సంగతి !!

3 comments:

  1. ఏనుగు బొమ్మ సూపర్ సార్

    ఈ మధ్య మరీ వింత పోకడలు కనిపిస్తున్నాయి.

    "they were celebrating అన్నమాట."
    "అందులో he was busy"
    "కానీ i said no"

    ఇలా ఉన్నాది భాష

    ReplyDelete
  2. సౌమ్య గారు, ధన్యవాదాలు. అవును ఈ మధ్య మాట్ల్లాడుతున్న భాష
    కొత్త పోకడలు పోతున్నది. ఈ కొత్త రకం భాష తొ ఏది సరైనదో ఏది
    కాదో కూడా మర్చిపోతున్నాము.................సురేఖ....

    ReplyDelete
  3. baga chepparandi.. ippudu paristhithi alane undi.. enugu bommani telugu aksharaalatho geeyatam chala creative ga undi..

    ReplyDelete