ఈ రోజు ప్రపంచ జోకుల దినోత్సవంట ! ఇంకేం జోకులాడుకోటానికి ఇదో అవకాశం వచ్చింది.
మా "హాసం క్లబ్" లో నేనూ, మితృడు హనుమంతరావు కల్సి వే(చే)సిన ఈ చిన్న జోకులాంటి
స్కిట్ !
అలో అలో సలహాల్రావ్ ! ఎన్నాళ్ళకు దొరికావోయ్ ! నా దేహానికి వచ్చిన ఈ
సందేహాన్ని నువ్వే తీర్చాలి!
ఈ సలహాల్రావ్ పనే అది ! ఇంతకీ ఏమిటి నీ సందేహం ?
స్కూటర్లు, బైకుల ధరలు కార్ల కంటే తక్కువ కదా ?
అవునూ, తక్కువే, ఐతే ఏమిటంటావు ?
అలాటప్పూడూ తక్కువ ధరలున్న స్కూటర్లకూ, బైకులకు స్టాండు పెట్టి
లక్షలుపెట్టి కొన్న కార్లకు స్టాండు పెట్టక పోవటం అన్యాయం, పరమ మోసం
కాదా?
ఓస్ ! అదా నీ బాధ ! ఇలా చూడు సందేహాల్రావ్ ! స్కూటర్ బరువు కారుకన్నా
తక్కువకదా ?! ! ఎత్తి స్టాండు వేయటం తేలిక. అదే కారయితే బరువు వల్ల ఎత్తి
స్టాండు వేయటంకష్టం కదా! అందుకే పెట్టలేదు. ఇందులో ఏ మోసమూ లేదు. బెంగ
. పడకు !
నిజమేనోయ్ ! ఎలా ఐనా నీ బుర్రే బుర్ర ! నీ తెలివి అమోఘమనుకో ! వస్తా !
మరో కొత్త మొఖం జోకు
ఏయ్ ఎవరు నువ్వు? నా జేబులో చెయ్యి పెడుతున్నా వేమిటి ?
సారీ సార్ ! నా జేబనుకున్నా !
మరి కొంత సేపటికి..
అరే ! మళ్ళీ నా జేబులో చెయ్యి పెడుతున్నావ్ ! ?
మరేం లేదు సార్ ! అగ్గి పెట్టె కోసమండీ !!కోప్పడకండి !
ఐతే నన్నడగవచ్చుకదా ! ముక్కూ మొఖం తెలియని వాడివి, నా జేబులో
చెయ్యి పెడుతున్నావ్ !!నా కేదో అనుమానంగా వుంది నీ తీరు చూస్తుంటే!
మరీ అంత అనుమానించి అవమానించకండి సార్ ! మీరెవరో నాకు తెలియదు
కదా ! అదే వచ్చిన చిక్కు! నాకు కొత్త ముఖాలతో మాట్లాడాలి అంటే అమిత
సిగ్గండీ ! అందుకనీ !!
ఆ ( !!
ఆ( అనమని మనల్ని డాక్టర్ దగ్గరకేళ్ళి నప్పుడు అంటారు! అన్నట్టు ఈ రోజు
డాక్టర్స్ డే కూడా! వైద్యంతో బాటు తమ పేషెంట్లని జోకులు చెబుతూ నవ్వించే
డాక్టర్లు కూడా చాలా మంది వున్నారు. వారికీ జోకుల నవ్వుల పువ్వుల మందార
మాలలు.
నవ్వే జనా సుఖినో భవంతు !!
సురేఖగారు...ఈ క్రింద వ్రాసినది ...మీ బ్లాగుమితృలకు ...సో..మీరు చదవకండి::::
ReplyDeleteమిత్రులారా! సురేఖగారు ప్రస్తావించిన హనుమంతరావుని నేనే... ఈ ప్రక్క
బ్లాగులోనే ఉంటాను... నిజమే ఇల్లు కూడా వారింటికి దగ్గరే..మేమిద్దరం కలసి పరుగుచేస్తున్న హాసంక్లబ్ 7.. 7లు పూర్తి చేసుకుని 8వ 7లో పరుగెడ్తోంది..మీరెప్పుడైనా రాజమండ్రి వస్తే మా హాసంక్లబ్ కు రండి.. నవ్వించి పంపిస్తాము.పోనీ అండీ...మీరే మమ్మల్ని నవ్వించి పంపిద్దురుగాని సరేనా...నన్ను మీరు ఓ జోకు సాంపిల్ చెప్ప మంటున్నారా ఇక్కడా ?...వద్దండీ...అప్పారావుగారికి కోపం వస్తుంది ఆయన బ్లాగుకదా... మా బ్లాగుకొచ్చేయండి...అక్కడ చెప్పుకుందాం...
ఎలా రావాలంటే dvhrao.blogspot.com..ఇక వెళ్తా.. అప్పారావు గారు చూస్తే ఇలా ఎడ్వర్టైజ్ చేసినందుకు జరిమానా వేస్తారు...బై...
అప్పారావుగారూ! మీ జోకులు బావున్నాయి..మీ టేస్టే వేరు...మీరు
మంచివారు...బై...బై...
I am delighted to go through the blog. Sorry for missing till today. Keep continue to keep our friends in good humourwhich I most believe as the best than other regular medicines.
ReplyDeleteT S Murty (nick name "Thammudu" during my stay at RJY branch)