Friday, July 29, 2011

కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి,ముక్కోతి కొమ్మచ్చి

ఆత్మకధలు వ్రాయటం, ఇంకొకరి కధలను వేరొకరు వ్రాయటం సులువు
కాదు. తన గురించి వ్రాసుకోవడంలో నిజాలు వున్నా అవి ఆత్మ స్తుతిలా
చదివే వాళ్ళకు అగుపించవచ్చు..అలానే మరొకరి కధ వ్రాస్తుంటే వాళ్లకధ
వ్రాసే అవకాశం వచ్చినందుకు పొగుడుతున్నాడనిపించవచ్చు. రమణగారు
తన కధను కోతికొమ్మచ్చిగానూ, అక్కినేని జీవిత చరిత్ర "కధానాయకుడి
కధ"గా చెప్పినప్పుడూ పాఠకులను విశేషంగా మెప్పించారు.కోతికొమ్మచ్చి
మొదటి భాగం ఏడు ప్రచురణలు, రెండవ భాగం నాలుగు ప్రచురణలు అచ్చ
యింది రమణగారు అక్షరాలతో అక్షరాలా ఆడుకుంటారు. ప్రతి పదం పద
విన్యాసం చేస్తుంది. ఆక్కినేని జీవిత కధను ముఖస్తుతి అంటూ ప్రారంభిస్తూ
"ప్రతిభాశాలి జీవితంలా కళకళలాడుతుంది బెజవాడ రైల్వే స్టేషన్" అంటారు.
ఇక పుస్తకాన్ని ముగింపుకు మొదటి ప్రకరణం అని పేరుపెట్టి " ప్రతిభాశాలి
జీవితంలా కళకళ లాడుతుంది విజయవాడ రైల్వే స్టేషన్......"అంటూ వ్రాశారు.
మీరు గమనించారా ఈ వాక్యాలు ఒకేలా వున్నా ఓ తేడా వుంది.అదేమిటంటే
"బెజవాడ" తరువాత వచ్చిన మార్పుతో "విజయవాడ" అయింది! దటీజ్ రమణ
గారు


ముక్కోతి కొమ్మచ్చిలో అందాలరాముడు చిత్ర నిర్మాణంలో ఎదురైన కష్టనష్టాలు,
"ముత్యాలముగ్గు","సీతాకళ్యాణం","భక్త కన్నప్ప","వంశవృక్షం", " త్యాగయ్య ",
"గోరంతదీపం", "పెళ్ళిపుస్తకం" చిత్రాల అనుభవాలతో బాటు తన సన్నిహితుల
గురించి, యన్టీయార్ తయారుచేయించిన పిల్లల వీడియో పాఠాలు, చిల్డ్రన్ ఫిలిం
సొసైటీలోని బ్యూరాక్రసీ గురించి చెప్పారు. హిందీ చిత్ర నిర్మాణ విశేషాలు చెప్పారు
ఆయనకు ఎంతో ఇష్టమైన శ్రీరాముడి కధను "శ్రీ రామరాజ్యం" రచనను మొదలు
పెట్టడం వల్ల "ముక్కోతి కొమ్మచ్చి" సంపూర్ణంగా అందించలేకపోయారు.రమణగారి
శైలి పుస్తకాన్ని చివరిదాకా వదలకుండా చదివిస్తుంది. ఇందులో ఆయన అక్కడక్కడ
వ్రాసిన "అడ్డమైన వ్రాతలు" ( చూడండి! రమణగారు ఎంత చక్కటి పేరు పెట్టారో)
అలరిస్తాయి. మచ్చుకు కొన్ని...
తినడం కోసం బతికితే
బతుకంతా దండగే
బతకడం కోసం తింటే
బతుకంతా ఒక పండుగే ... మరో అడ్డమైన రాత
స్తానం చేశాక మీరేం చేస్తారు ?
-ఏముంది-చీర కట్టుకుంటాను-
అనుభవం అంటే-
జుట్టు రాలిపోయాక దొరికిన దువ్వెన..
హాసం బుక్స్ వారు ప్రచురించిన "ముక్కోతి కొమ్మచ్చి" నేడే కొనండిరేపు దొరక్కపోవచ్చు.
అన్నట్టు కోతికొమ్మచ్చి మొదటి భాగం మీరు చదవటమే కాదు హాయిగా కళ్ళు మూసుకొని
వినొచ్చు. ఈ ఆడియో స్వంతం చేసుకోవాలంటే www.kothikommachi.com చూడండి.
సర్వశ్రీ యస్పీ.బాలు, వరప్రసాద్ రెడ్డి, యమ్బీయస్.ప్రసాద్, అనంత శ్రీరామ్, జొన్నవిత్తుల,
ముళ్లపూడి వర స్వరాలతో మీకు వీనుల విందుగా వినిపిస్తారు.

4 comments:

  1. అప్పారావు గారు,

    ఎక్కడ కొమ్మ కనపడ్డా కొమ్మచ్చి ఆడేస్తుంటాను అంటె ఈ పుస్తకం యొక్క తెలుగుతనం ఇంకా ఎంత పచ్చిగా ఉందో ఆలోచించండి. ఇప్పుడే వేను గారి బ్లాగులో కామెంటి వెంటనే ఈ కొమ్మ (బ్లాగు) మీద వాలి చదివేసి కామేంటేస్తున్నా. ఇది తెలుగువారి సొబగైన సొత్తు. మనం చదివి ఆస్వాదించి ఆనందించి మళ్ళి మళ్ళి మనచేత చదివించుకునె (ఆడించుకునే) కొమ్మ(పుస్తకం). పుస్తకం గురించి బ్లాగులో పెట్టినందుకు మరొక్క మారు దండాలు అదే అభినందనలు :D.

    ధన్యవాదాలు

    ReplyDelete
  2. excellent Apparao garu, Thanks for the link!

    ReplyDelete