Monday, July 25, 2011

ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్

యుద్ధవాతావరణం మీద తీసిన ఈ సినిమా నిజంగా జరిగిన కొన్ని
సంఘటనలను కొన్ని మార్పులు చేసి "ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్"
పేరిట 1957 డిసెంబరు 18 న విడుదలయింది. ఎనిమిది అస్కార్
అవార్డులకు నామినేట్ అయిన ఈ చిత్రం, ఏడు అవార్డులు కైవసం
చేసుకొని ఈ నాటికీ మేటి చిత్రంగా నిలచింది. ఉత్తమ సినిమా,ఇందులో
నటించిన అలెక్ గిన్నెస్ ఉత్తమ నటుడిగా, ఇంకా ఉత్తమ దర్శకుడు,
ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఫొటోగ్రఫీ, ఉత్తమ సంగీతం,ఉత్తమ కూర్పు,
విభాగాలలో బహుమతులొచ్చాయి.
ఈ చిత్ర కధ నిజానికి ధాయిలాండ్-బర్మా దేశాల సరిహద్దుల్లో అడవుల్లో
జరిగినా నిర్మాణమంతా సిలోన్లోనే(శ్రీ లంక) జరిగింది.ఇంకా ఇందులో నటించే
నటుల ఎన్నిక పూర్తవకముందే ఇందులో అగుపించే బ్రిడ్జి నిర్మాణాన్ని
సినిమా సెట్ కార్మికులచేత, వారికి సహాయ సహకారాలను అందించే
ఇంజనీర్లచేత నిర్మాత శామ్ స్పీగల్ మొదలుపెట్టించటం ఓ విశేషం !!


క్వాయ్ నది మీద అసలు బ్రిడ్జిని ఆ కాలంలో ఎలా నిర్మించారో ఆ
ప్లాన్ ప్రకారమే బ్రిడ్జ్ నిర్మించారు.ఈ సినిమా వంతెన నిర్మాణానికి
500 మంది కార్మికులతో, 35 ఏనుగుల సాయంతో అసలు బ్రిడ్జ్ లాగా
కట్టారు.ఈ చిత్రంలో ఈ బ్రిడ్జ్ పేల్చివేసే దృశ్యంలో దానిపై నుంచి వెళ్ళే
రైలును ప్రత్యేకించి భారతదేశంలోని ఓ మహారాజు దగ్గరవున్న నిజం
రైలుకొని ఉపయోగించారు. చిత్రంలో బ్రిటిష్ ఆఫీసరుగా నికొల్సన్
పాత్రను అలెక్ గిన్నెస్ నటించగా, జపనీస్ కమాండర్ పాత్రను సయితోగా
హయకోవా నటించారు.

4 comments:

  1. Good information. I have a collector's edition of DVD, even in that this information is not there. Good show, Appa Rao garoo.

    ReplyDelete
  2. అప్పారావు గారు. ఒక మంచి సినిమా గురించి చెప్పారు. చాలా ఏళ్ళుగా నా లైబ్రరీలొ వున్నది.. అవసమయినప్పుడల్లా చూస్తూ ఉంటాను. ఈ సినిమ నిర్మాణం వెనుకున్న మంచి విషయాలను తెలిఅయజఎసారు..ధన్యవాదాలండి.

    ReplyDelete
  3. మంచి సినిమా గురించి చెప్పారు, అప్పారావు గారూ! ఈ సినిమాలోని సాంకేతిక నైపుణ్యంతో పాటుగా, నేపధ్యంలో సాగే ఈలపాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

    -వర్మ

    ReplyDelete