Tuesday, July 12, 2011

అమ్మగారు !!



ఈ మధ్య "అమ్మగారు" అన్న మాట తరచు వినిపిస్తున్నది. ఎక్కడ ?ఇంకెక్కడ? పేపర్లలోనూ,
టీవీల్లోను. మన రాజకీయనాయకుడొకాయన మాట్లాడుతున్నపుడల్లా "అమ్మగారు" అంటూ
ఏదో పని వాడిలా అంటుంటే "అమ్మ" అనే మంచి మాటకూడా చిరాగ్గా అనిపిస్తుంది. ఈ రోజుల్లో
యస్సెమ్ములు ( అదే నండి సర్వెంట్ మెయిడ్స్ ) కూడా అమ్మగారు అనటం మానేశారు. "ఆంటీ"
అని, ఆవిడగారి మొగుడుగారిని "అంకుల్" అనీ పిలుస్తున్నారు. తప్పేముంది? రోజులు మారాయి.
మా చిన్నప్పుడు మ ఇంటి ప్రక్క అత్తయ్యగారు ( మాకు ఇప్పటిలా ఆంటీ అని పిలవటం తెలియదు)
వాళ్ళ పనిమనిషిని దాసీది అని చెప్పేది. ఇప్పుడలా ధైర్యంగా ఎవరైనా ఆమాట అనగలరా?మా అమ్మ
మాత్రం పేరుపెట్టే పిలిచేది.
అదేమిటో పనిమనిషి రాక పోతే ఇల్లాళ్ళ పనైపొతుందట ! ఈ రోజు అర్చన రాదట ( ఆపేరు మా S. M
పేరులెండి) ఇక నా పనైపోయినట్లే అంది శ్రీమతి. ఇంకేం పనైపోతే మంచిదేగదా అన్నాను హిందూ
లో సురేంద్ర ,ఈనాడులో శ్రీధర్ కార్టూన్లను ఆల్బమ్స్ లో అంటించడానికి కట్ చేస్తూ! నా మాటను కట్
చేస్తూ మీకన్నీఎడా-పెడార్ధాల నవ్వులాటగానే వుంటాయి! మీరు చిన్నపిల్లల్లా చింపిపోసే ఈ పేపర్ల
ముక్కలు ఎత్తిపోయడానికే నాకు సగం పనైపోతుంది అంటుంది.ఒక్కోసారి "ఇదేనయం రోజూ వచ్చే
న్యూస్ పేపర్లను నెలకొకటి చొప్పున బైండు చేయించటం లేదు"అని సంతోషపడుతుంటుంది.
పనిమనుషుల సబ్జెక్ట్ మీద, మా కార్టూనిష్టులు నవ్వుల బొమ్మలు వేశారు,వేస్తున్నారు.
. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంటుంది. మన ఇంట్లో మన పని చేసుకోవడానికే ఎంతో కష్టంగా వుంటుంది.
. అలాటప్పుడు ప్రతి రోజూ ఆదివారంతో సహా పాపం అలా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారే అని
జాలికలుగుతుంటుంది. అంతకన్నా ఏం చేయగలం చెప్పండి. అమెరికాలో వాళ్ళకంచాలు, గిన్నెలూ వాళ్ళే
తోముకుంటారట ! self help is best help కదా!

చివరగా జోకులు చెప్పుకుందాం !
సుబ్బారావుగారు పకపక నవ్వి " ఏవయ్యా,ఇదెప్పట్నించి? నీ కంచం నువ్వే
కడుక్కోడం ? " అన్నాడు.
" అబ్బే ఎన్నడూ లేదు ! " అన్నాడు చక్రవర్తి.
" ఆ, ఇందాక నా కళ్ళతో నే చూస్తినే "
" పిచ్చివాడా, అది నాదికాదోయ్, మా ఆవిడ తిన్న కంచం" అన్నాడు చక్రవర్తి
విరగబడి నవ్వుతూ. (ముళ్లపూడి నవ్వితే నవ్వండి నుంచి)
*కార్టూన్లు శ్రీ బాపు, శ్రీ జయదేవ్ లకు కృతజ్ఞతలతో*

4 comments:

  1. "...మాట్లాడుతున్నపుడల్లా "అమ్మగారు" అంటూ
    ఏదో పని వాడిలా అంటుంటే "అమ్మ" అనే మంచి మాటకూడా చిరాగ్గా అనిపిస్తుంది..."

    You are not alone in feeling like that, there is a silent majority in this country, which only prevented the calamity of having a foreigner as PM for us.

    ReplyDelete
  2. అమ్మ మమ్మీ అయినప్పుడు ‘అమ్మగారు’ఆంటీ అవటంలో తప్పులేదండి.
    అబ్రహాం లింకన్ మహాశయుడు ఒకనాడు తన బూట్లకు మెరుగుపెడుతుంటే యెవరో దానయ్య వచ్చి,"హేవిటీ మీ షూకి మీరే పాలిష్ చేసుకుంటారా ?" బోల్డంత ఆశ్చర్యపోతే దానికాయన,"అవును,మరి మీరెవరి షూకి పాలిష్ చేస్తారేమిటి’అని అడిగారని ఒక ఐతిహ్యం.

    ReplyDelete