ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వ్యవస్ఠాపకులు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు
పంతులు గారు 1924 లో సాహిత్య మాస పత్రిక "భారతి" ని స్థాపించారు.
శ్రీ నాగేశ్వరరావుగారు "భారతి" ఆవశ్యకతను వివరిస్తూ ఇలా అన్నారు.
"ఆంధ్రహృదయము నందు స్వకీయ స్వరూప స్వభావములను
నిర్ణయించి స్వధర్మము నారాధింపవలయునను సంకల్పము
గలిగినది. ఆ సంకల్పము సఫలము చేయుటకు చరిత్ర కారులు,
పండితులు, పరిశోధకులు,కళాప్రవీణులు ప్రచారకులు చేయుచున్న
పరిశ్రమ దేశవ్యాప్తమై ప్రజాపోషణమును బడయుచున్నది. దేశ
వ్యాప్తములైన ప్రయత్నము లనేక ముఖమునను నాంధ్రసమాజము
నకు వ్యక్తముచేసి, ప్రజా దృష్ఠిని నవపవృత్తియందు లగ్నము చేయవలసిన
యవసరము గలిగినది. ఆ యవసరమును సఫలము చేయుటకు,ఆంధ్ర
ప్రపంచము పూర్వపర సంస్కారములను, సమన్వయమును చేయుటకును
బూనుకొనుచున్నది. ఆంధ్ర భారతియును ఆంధ్ర ప్రవృత్తిని వ్యక్తము
చేయుటకవతరించినది"
శ్రీ నాగేశ్వరరావుగారి అభిలాషను కొనసాగిస్తూ శ్రీ శివలెంక శంభుప్రసాద్ గారు
భారతిని చాలా కాలం కొనసాగించారు. "భారతి" ఉగాది సంచికలు ఎంతో
ప్రాచూర్యం పొందాయి. భారతి ప్రారంభసంచిక లోగో, 1954 జనవరి,ఫిబ్రవరి,
మార్చి,ఏప్రియల్ సంచికలో ప్రచురించబడ్ద వర్ణ చిత్రాలు వరుసగా,:
రోహిణీ చంద్రవిహారము : శ్రీ రాగి వెంకటేశ్వరరావు
నీహార విహారము : శ్రీ రణవీర సక్సేనా
నీటికడవ : శ్రీ వి.సంజీవరావు
పునరాగమనము : శ్రీ రణవీర్ సాక్సేనా, ( ఈ చిత్రాలు
నేను సేకరించినవి. భారతి గురించి ఆంధ్రపత్రిక చరిత్ర పుస్తకం సౌజన్యంతో)
ధన్యవదాలండీ! నా తప్పును మీరు చెప్పేదాకా గమనించలేదు.
ReplyDeleteపాత భారతి మాస పత్రికలు ఇప్పుడు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయా? ఏదైనా వెబ్ సైటుగాని, బ్లాగు కాని తెలుపగలరు.
ReplyDeleteనా మైయిల్ అడ్రసు : jkeesara@yahoo.co.in
appressaademyarchives.com
ReplyDelete