పొలిటికల్ కార్టూనిస్టులలో శేఖర్ ని తెలియని తెలుగు పాఠకులుండరు.
ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన గీసిన
గీస్తున్న వేలాది కార్టూన్లు నిజంగా రాజకీయనాయకులకు, తెలుగు
ప్రజలకు పారాహుషారే ! పారాహుషార్ పేరుతో శ్రీశేఖర్ గీసిన కార్టూన్ల
పుస్తకం ఎనిమిదేళ్ళక్రితమే వెలువడింది. ప్రతి పేజీ పారాహుషార్ అంటూ
మనల్ని హెచ్చరిస్తుంది. "నాలో ప్రవేశించి నాతో బొమ్మలు గీయుస్తున్న
సామాన్యుడికి....." అంటూ శ్రీ శేఖర్ తన పుస్తకాన్ని అంకితమివ్వడం
చాలా సమంజసంగా వుంది. 76 పేజీల ఈ కార్టూన్ సంకలనం లో ఒక
పేజీలో పెద్ద కార్టూన్, ఎదుటి పేజీలో పాకెట్ కార్టూన్, దాని ప్రక్క ప్రముఖ
వ్యక్తుల కేరికేచర్ , వాటికింద వుంచిన శీర్షిక ఆలోచన అద్బుతంగా వుంది.
అట్టవెనుక చిత్రంలో కార్టూన్లు గీస్తున్న తన సెల్ఫ్ బొమ్మతో బాటు,
తలుపు మీద ఇంటి నెంబరు, హైదరాబాదులోని ఏరియా, ఏడి పల్లిలో
స్కూల్కు వెళుతున్నట్లు , ఓయూ, కేయూలలో డిగ్రీ తీసుకొన్నట్లు,
కుటుంబచిత్రం ( సతీమణి, అమ్మాయి, అబ్బాయి)గది గోడ మీద బొమ్మలు,
టెలిఫోన్ రింగవుతుంటే ఆ ఫోన్ నంబరు ( 27532811), ప్రక్కనే ఆయనకు
ఇష్టమైన ఆర్కే లక్ష్మణ్, బాపు, మాక్సిజమ్ పుస్తకాలు, ఎమ్.ఏ.లిట్, ఎల్లెల్బీ
డిగ్రీలు ( చెత్త బుట్టలో) చూపించడం శ్రీ శేఖర్ మేధాశక్తిని చెప్పక చెబుతున్నాయి.
కార్టూన్ ఇష్టులూ అందరూ విశాలాంద్రకు వెళ్ళినప్పుడు ఈ పారాహుషార్ ను
తప్పక తీసు "కొన" వలసిన మంచి పుస్తకం.
శ్రీ శేఖర్ గారి కార్ట్యూన్ ల పుస్తకం గురించి చక్కగా పరిచయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. నాకు చాలా యిష్టమైన చిత్రకారులలో శ్రీ శేఖర్ ఒకరు. వారిని ఒకే సారి వ్యక్తిగతంగా కలిసాను. పుస్తకం గెటప్ గురించి మీ వివరణ ఆసక్తికరంగా సాగింది.
ReplyDelete