Monday, January 31, 2011

మొట్టమొదటి తెలుగు కార్టూనిస్ట్ శ్రీ తలిశెట్టి రామారావు


మన తెలుగు పత్రికలలో వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడటం 80 ఏళ్ళ
క్రితమే మొదలయింది. ఇందుకు ఆద్యులు శ్రీ తలిశెట్టి రామారావుగారు.
ఆయన ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో వ్యంగ్య చిత్రాలు గీయటం మొదలు
పెట్టారు. ఇందుకు ఆంధ్రపత్రిక వారు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు.
మన కార్టూనిస్టులలో చాల మంది ఆంధ్ర పత్రిక ద్వారానే వెలుగులోనికి
వచ్చారన్నది నిజం. తరువాత మిగిలిన పత్రికలు కూడా కార్టూన్లను
గుర్తించడం మొదలు పెట్టాయి. బాపు గారి ఎప్పుడూ ఇంతే, సత్యమూర్తి
గారి చదువుల్రావు, ప్రియ మితృలు జయదేవ్ గారి కార్టూన్లు ఆంధ్ర వార
పత్రికలో చూసే ఎంతో మంది కార్టూనిస్టులు పుట్టుకొచ్చారు. నా మొదటి
కార్టూన్ కూడా ఆంధ్రవారపత్రికలో 1958 లో అచ్చయింది. ఆంధ్ర వార
పత్రికలో బాబుగారి కార్టున్లు కూడా ఎక్కువగా వచ్చేవి. చీకటి కార్టూన్ల
పేర బొమ్మ అంతా నల్లగా వేసి బెలూన్లో మాటలుండేవి. నాకు అలాటి
ఒక చీకటి కార్టూన్ గుర్తుంది. చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావని అడిగితే
చీకటి కార్టూన్ గీస్తున్నా అన్న జవాబుతో ఒక కార్టూన్ వచ్చింది. ఇదో
కొత్త ప్రక్రియ ! పులిచెర్ల అనే ఆయన కూడా ప్రతి వారం కార్టూన్లు వేసే
వారు.
ఈ పై కార్టూన్ "గొప్పవారిని నాటకానికి పిలచినయేడల" అన్న
పేరుతో శ్రీ తలిశెట్టి రామారావు గారు 1932 ఆంధ్రపత్రికలో వేసినది.

5 comments:

  1. అప్పారావు గారూ,
    మొన్న రాగతి పండరి గారిని జ్ఞాపకం చేశారు. నిన్న ఆంధ్రపత్రిక, నేడు తొలి తెలుగు కార్టూనిస్ట్ తలిసెట్టి రామారావు గారు. గత వైభవాన్ని గుర్తు చేస్తున్నారు. ధన్యవాదములు.

    ReplyDelete
  2. అప్పారావు గారూ !
    మన సాంస్కృతిక సంపదను సుసంపన్నం చేసిన వారిని మర్చిపోకుండా ఇలా గుర్తు చేసుకోవడం, ఇప్పటి తరాలకు వారి గురించి తెలియజేయడం చాలా అవసరం. ఆ పరంపరలో మీరు మొదటి వ్యంగ్య చిత్రకారుడు తలిశెట్టి రామారావు గారిని గుర్తు చెయ్యడం బాగుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. తొలి తెలుగు కార్టూనిస్ట్ గారిని గుర్తు చెయ్యడం బాగుంది ధన్యవాదములు.

    ReplyDelete
  4. I recall the name of పులిచెర్ల from my childhood days. Thank you for reminding me of those great days. Apparaao garoo, is it possible for you to write a full length article on Shri Pulicherla with his cartoons.

    ReplyDelete
  5. శ్రీ శివరామ ప్రసాద్ గారూ, శుభోదయం. పులిచెర్ల గారి కార్టున్లు నా దగ్గరాలేవు.
    దొరుకుతాయేమో ప్రయత్నిస్తాను.

    ReplyDelete