Tuesday, January 11, 2011

మన అనగనగా కధలు-జానపద సినిమాలు





ఒకనాడు మన తెలుగు సినిమా తెరను జానపద సినిమా కధలే ఏలాయి.
అందులోని మాంత్రికులు చెసే మాయలూ, నాయకులు చేసే కత్తి యుద్దాలు
ఆకాశంలో గుర్రాల మీద ఎగిరిపోవడం లాంటి దృశ్యాలు పిల్లల దగ్గరనుంచి
పెద్దల దాకా అలరించాయి. అలనాటి బాలరాజు, కీలుగుర్రం, మాయలమారి,
పాతాళభైరవి, జయసింహ, సువర్ణసుందరి లాంటి చిత్రాలతో ఏఎన్నార్,ఎన్టీయార్
ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ చిత్రాలలో మంచి సంగీతంతో బాటు
ఉత్తమ అభిరుచులున్న నిర్మాతల నుంచి రావడంతొ అవి జానపదాలైనా
కలకాలం గుర్తుండిపోయాయి. అటు తరువాత జానపద బ్రహ్మ అన్న పేరు
గాంచిన దర్శకనిర్మాత విఠలాచార్య నిర్మించిన చిత్రాలతో కాంతారావు హీరోగా,
రాజనాల ప్రతినాయకుడిగా పేరుపొందారు. విజయవారు బాలకృష్ణ తోనిర్మించిన
భైరవ ద్వీపం సినిమా కూడా విజయం సాధించింది.
ఆ తరువాత తీసిన చిత్రాలు జనాన్ని అంతగా ఆకర్షింపలేక పోయాయి. ఇప్పుడు
ప్రపంచ ప్రఖ్యాత డీస్నీ సంస్థ ద్వారా దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో
ఆయన కుమారుడు కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వంలో "అనగనగా ఓ ధీరుడు"
సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నది. డిస్నీ లాంటి సంస్థ బానరు పై ఓ
తెలుగు చిత్రం విడుదలవుతుందంటే ప్రతి తెలుగు వాడూ గర్వించవలసిన
విషయమని నా నమ్మకం.కధ విషయంలోనూ, నటీనటుల ఎన్నికలోనూ
డిస్నీ సంస్ఠ ప్రత్యేక శ్రర్ధ చూపించింది. ఇందులో నాయకిగా కమలహసన్
కుమార్తె శ్రుతిహసన్, మాంత్రికురాలిగా నటుడు మోహన్ బాబు కుమర్తె
లక్ష్మి నటించడం మరో ప్రత్యేకత. లక్ష్మి లక్శ్మిటాక్ షో ద్వారా బుల్లితెర
ప్రేక్షకులకు ఇదివరలోనే పరిచయమయింది నాయకుడిగా బొమ్మరిల్లు హీరో
సిద్ధార్ధ అగుపిస్తాడు. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ నిర్మించారు. ఈ సినిమా
ప్రచార చిత్రాలు ఈ సరికే మనం టీవీల్లో చూస్తున్నాం.మరొ సంతోషకరమైన
విశేషం ఇందులోని హాస్యసన్నివేశాలకు సంభాషణలు, పాటను వ్రాసింది
శ్రీ తాడినాడ రాజసింహ. ఈ యన చాలా రాఘవేంద్రరావుగారి చిత్రాలకు
పనిచేశారు. సంక్రాంతికి ఈ సినిమా మన కన్నుల పండుగ చేస్తుందనే నమ్మకంతో
మొట్టమొదటి సారిహాలీవుడ్ తో టాలీవుడ్ చేతులు కలిపి మన ముందుకు వస్తున్న
ఈ అనగనగా ఓ ధీరున్ని నిండు మనసుతో ఆహ్వాన్నిద్దాం !

2 comments:

  1. అప్పారావుగారూ. మంచి విషయం చెప్పారు. ఇదే విధంగా డిస్నీ వారు మన తెలుగు చందమామ ధారావాహికలన్నీ కూడ, ముఖ్యంగా శిధిలాలయం ధారావాహికను సినిమాగా తీస్తే అంత బాగుంటుంది11

    ReplyDelete
  2. శివరామ ప్రసాద్ గారు, శుభ సాయంత్రం. చి"తాడినాడ రాజసింహ ( ఈచిత్రానికి
    ఒక పాట కూడా వ్రాశారు ) మా బొంబాయి వియ్యంకుడిగారి సోదరుడి అబ్బాయి.
    ఈ సారి మీ సూచనను ఆయనకు తప్పక తెలియ జేస్తాను.

    ReplyDelete