బుల్లి బుక్కులు -మినీ మాగ్జైనులు !
పెద్ద మనుషులు ( పొడుగు మనుషులు ) చిన్న మనుషులు
ఉంటారు. మరీ పొట్టి మనుషుల కధను మనం గలివర్స్ యాత్రల
కధల్లో విన్నాం. ఇక పుస్తకాలలో కూడా బుల్లి బుల్లివి డిక్షనరీలు,
భగవత్గీతలు వచ్చాయి. గతంలో 1979 లో విజయబాపినీడు అనే
ప్రముఖ తెలుగు రచయిత , బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికల
సంపాదకుడు ,ప్రచురుణకర్త " నీలిమ " అనే పత్రికను చిన్న సైజులో
( 3.5" X 5'.7" ) 383 పేజీలతో బైండింగ్ పుస్తకాలకుండే సెక్షన్
కుట్టుతో ప్రచురించారు. ఈ చిన్న పుస్తకంలో " సురాజ్ ఉద్దేలా"
( విశ్వ ప్రసాద్ రచన) చరిత్రాత్మక సీరియల్, నవలాను బంధంగా
ఓ నవల, కార్టూన్ స్పెషల్ అని కొన్ని పేజీల్లో కార్టూన్లు, ప్రతి నెలా
ప్రచురించబడేవి. ఆయన సంస్థ నుంచే వెలువడిన " బొమ్మరిల్లు "
పిల్లల పత్రికకు అనుబంధంగా ప్రతి నెలా అరేబియన్ నైట్స్ కధలతొ
చిన్న పుస్తకాలు ( 2'.2"X5'.00") సైజులో వచ్చేవి. ఇవన్నీ ఆనాటి
జ్ణాపకాలు మీతో పంచుకొంటున్నాను.
No comments:
Post a Comment