Tuesday, August 10, 2010

హెర్గే అద్భుత సృష్టి " టిన్ టిన్ " కామిక్స్


కార్టూనిస్ట్ హెర్గే అద్భుత సృష్టి " టిన్ టిన్ "

టిన్ టిన్ కామిక్స్ అంటె ప్రతి ఒక్కరికి ఇష్టం. అద్భుతమైన బొమ్మల
చిత్రీకరణ , కధావిధానం వల్ల "టిన్ టిన్ కామిక్స్ యావత్ ప్రపంచంలో
పాఠకుల అభిమనాన్ని సంపాదించింది. బెల్జియం దేశంలోని బ్రసెల్స్
నుంచి వెలువడే లావింగ్ టైమ్ సీస్లే అనే దిన పత్రికలో 1929 జనవరి
10 వ తేదీన టిన్ టిన్ పేర మొట్టమొదటి కామిక్ ప్రచురించారు.
ఆ కామిక్స్ 33 భాషల్లోకి అనువదించారు. ఆ పుస్తకాలు ప్రపంచ
వ్యాప్తంగా పది కోట్ల కాపీలకు పైగా అమ్మకాలు జరిగాయంటే పాఠకులను
టిన్ టిన్ ఎంతగా ఆకర్షించాడో అర్ధమవుతుంది. టిన్ టిన్ పాత్ర సృష్టి
జరిగి 80 ఏళ్ళయింది. ఈ అద్భుత పుస్తక సృష్టి కర్త హెర్గే తన 76 వ
ఏట 1983 లో మరణించాడు. ఈ కామిక్స్ పుస్తకంలో గీసిన గీతలు
ప్రస్పుటంగా ఉంటాయి. చందమామ లాటి గుండ్రని ముఖంతో, చిన్న
ముక్కు , విశాలమైన కళ్ళతో టిన్ టిన్ ఆకర్షణీయంగా ఉంటాడు..చాలా
కాలం టిన్ టిన్ బొమ్మలు రంగుల్లో వేయలేదు. 1947 నుంచే టిన్ టిన్
రంగుల్లో కనిపించడం మొదలు పెట్టాడు. హెర్గే ఫౌండేషన్ దగ్గర వున్న
ఒరిజినల్ కార్టూన్లను ప్రదర్శనకు ఉంచారట. మన పిల్లలు ఈ కార్టూన్
పుస్తకాలను స్వంతం చేసుకోవాలంటే ధర మాత్రం ఎక్కువ గానే
ఉంటున్నది. ఓ పదేళ్ళ క్రితం 60 రూపాయలున్న ఈ పుస్తకాలు ఇప్పుడు
250/- రూపాయలకు పైగా ఉండటం కాస్త బాధాకరమే ! ప్రభుత్వం
పిల్లల పుస్తకాలకు రాయితీ ఇచ్చే ఏర్పాటు చేస్తే మరింత మంది
చిన్నారులకు పుస్తకాలు చదివే అవకాశం కలుగుతుంది.

1 comment:

  1. It is absolutely brilliant.
    హెర్గె బెల్జియన్ అనుకుంటా. ఆంగ్లంలోకి డయలాగులు మాగొప్పగా తర్జుమా చేశారు. ముఖయంగా కేప్టెన్ తిట్టే తిట్లు. నేను పెద్దయ్యాక, టిన్ టిన్ ఒరిజినల్ ఆంగ్లం కాదని తెలుసుకుని చాలా హాఛ్ఛర్య పోయాను.
    అమెరికా వచ్చాక, ఇక్కడోళ్ళకి టిన్ టిన్ తెలీదని తెలుసుకుని మళ్ళి హాఛ్ఛర్యపోయాను.
    ఆ తరవాతెప్పుడో అమెజాన్‌లో సెట్ అమ్ముతుంటే కొన్నాను కానీ అవి మూడేసి కథలు ఒకే పుస్తకంగా వేసిన నోటుబుక్కు సైజువి. ఒరిజినల్ సైజులో చదివిన ఆనందం కలగలేదు. ఎవరో పిల్లలకి బహుమతిగా ఇచ్చేశా.

    ReplyDelete